09_005 అభిప్రాయకదంబం

One Reply to “09_005 అభిప్రాయకదంబం”

  1. ఫిబ్రవరి 1987 ఆంధ్ర పత్రిక ఉగాది పోటీలో కన్సోలేషన్ బహుమతి గెల్చుకున్న ఓలేటి వెంకట్ సుబ్బా రావు గారి “ట్రంకు పెట్టి” కథ చాలా బాగుంది . ప్రతి ఒక వ్యక్తికీ కొన్ని మధురమైన జ్ఞపకాలు అలాగే వాళ్ళు ప్రేమించిన వస్తువులు చాలా అపురూపంగా చూసుకుంటారు.
    నిజమే…. పాత మధుర్ స్మృతులు ఒంటరిగా ఉన్నప్పుడు జీవించడానికి ఒక రకమైన కాయాకల్ప ఔషధం లేక టానిక్ లాగా పనిచేస్తాయి. జ్ఞాపకశక్తి మునుపటి అనుభవాల పజిల్ ముక్కలను కలిపి ఉంచడం లాంటిది. జ్ఞాపకశక్తి ఆత్మ యొక్క ప్రధానమని నేను నమ్ముతున్నాను – కాంతిలో ఉన్న బల్బ్ లాగా, అది లేకుండా కాంతి ప్రకాశించదు.
    కష్ట కాలంలో ఉన్న జ్ఞాపకాలు కూడా ఎంతో అందమైనవని మీరు ఎప్పుడయినా ఊహించారా ? జ్ఞాపకాలు తప్ప మరేదీ గతాన్ని తాకదు. బాధాకరమైన జ్ఞాపకాలు కూడా మనల్నిజీవితంలో ఎదగడానికి కారణమవుతాయి.చాగంటి ప్రసాద్ గారి “బాపు నీ కోసం” కథ చాలా బాగుంది. కధావీధిలో వేణు గారి త్రిపుర కధలు అప్పుడే ముగింపుకు వచ్చేసాయా అన్న బాధ కలిగింది. రానున్న రోజులలో కొడవగంటి కుటుంబరావు గారి చదువు ఇంకా అనుభవం లాంటి కధల విశ్లేషణ మాకు అందిస్తారని ఆశిస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *