వక్కలంక కృష్ణమోహన్ గారి “స్వీయ నియంత్రణానుభవములు” ఎంతో బావుంది! ప్రతి ఇంట ఉన్న పరిస్థితిని వారు కడు రమ్యంగా చెప్పారు!. పాశ్చ్యాత్యదేశాల ప్రభావ కారణంగా ఈమధ్య కాలం నుంచి అమెరికాకు ఇండియాకు పెద్ద తేడా ఏమి ఉండటంలేదు. ఇక్కడి అలవాట్లు ఇక్కడి ఆలోచనా పధ్ధతి పుణికిపుచ్చుకున్న కారణంగా, మన దేశంలో చాలా విషయాల్లో మార్పు వచ్చినా కృష్ణ మోహన్ గారు వర్ణించిన “మొగుళ్ళ/మొగవాళ్ళ వైభవం” విషయంలో మాత్రం మార్పు రాలేదు. ఇప్పుడు కరోనా పుణ్యమా అని ఇన్నాళ్ళుగా మారని మొగవాళ్ళు టక్కున మారిపోయారు! అమెరికా మొగుళ్ళేకాదు ఆంధ్ర దేశంలో మొగుళ్ళు కూడా గిన్నెలు తళతళా తోముతున్నారన్న వార్త ఇక్కడి మొగవాళ్ళకు నిజంగానే శుభవార్త!
ఇకనుంచి మగవాళ్ళందరూ ఒక చేతిలో మాప్ , ఇంకో చేతిలో చీపురుతో విష్ణుమూర్తి అవతారంలో వాళ్ళ లక్ష్మీ దేవికి చేదోడువాదోడుగా ఉంటారని ఆశిద్దాం!!

శ్యామలాదేవి దశిక
యు ఎస్ ఎ-న్యూ జెర్సీ
మీ ఆత్మీయ ప్రశంసలకు అభివందన మందారాలు.