09_018 సహజత్వమే నా శైలి-కస్తూరి

One Reply to “09_018 సహజత్వమే నా శైలి-కస్తూరి”

  1. “సహజత్వం” ఈ పదం ఆ రోజుల్లో చాలా తక్కువ గా ఫోటోగ్రఫీలో వినిపించే మాట 70 వ దశకంలో. ముఖ్యంగా కలర్ సినిమా అంటే ముదురు రంగులు తెర అంతా ఎంత కొట్టొచ్చే రంగులతో కనిపిస్తే అంత కంటికి ఇంపు అనే రోజులు. ముఖ్యంగా 1973 తరువాత కలర్ సినిమాలు రావడం ఎక్కువై ప్రేక్షకులు వాటినే చూస్తున్న రోజుల్లో మార్పు మొదట సారి చూసింది ఇషన్ ఆర్య ద్వారా ముత్యాల ముగ్గు, తరువాత గోరంతదీపం. ఆ తరువాత బాలూమహేంద్ర, కస్తూరి గార్ల శంకరాభరణం. అదే సమయంలో వీరి ద్వారానే వచ్చిన”నెంజేత్తై కిళ్లాదే” (తెలుగులో మౌనరాగం) వంటివి గొప్పగా చెప్పుకోవచ్చు.
    ఇక సప్తపది లో ముఖ్యంగా కనిపించేది కథతో పాటె కెమెరా వెళ్లడం. నటుల ముఖాలు ప్రత్యేకంగా కనిపించాలి అనే నియమం లేకుండా మొత్తం సన్నివేశాన్ని కే ప్రాధాన్యత ఇవ్వడం, ఇక మనిషి నీడ కూడా సన్నివేశం లో అంతర్భాగంగా ఉంచడం వంటి అంశాలు ఈ” సహజత్వం” అనే మాటని సాధికారికంగా కస్తూరి గారు సొంతం చేసుకునే టట్టు చేశాయి. బహుశా వారు చెప్పినట్టు ఈ సినిమాకి ఈ మధ్యనే దివంగతులయిన “కణ్ణన్” తో పోటీ “అలైగల్ ఓయవ దుళ్ళై” ( ‘ సీతాకొక చిలుక ‘ తెలుగు ) వచ్చి ఉంటుంది. వ్రేపల్లియ “ఎద ఝల్లన” పాట మొదటి లో కృష్ణా నదిలో సూర్య కిరణాలు తీసిన విధానం, కణ్ణన్ గారు కన్యాకుమారి దగ్గర “ముట్టం” అనే చోట ఇదే విధంగా సముద్రపు కెరటాలు తీరాన్ని తాకి వెనక్కి వెళుతున్నప్పుడు పడిన సూర్యాస్తపు కిరణాలు తో పోటీ పడి కస్తూరి గారికే అవార్డు వచ్చి ఉంటుంది.
    సప్తపది అమరావతి తీరాన్ని, కృష్ణ సొగసుల్ని, కొండల్ని ఏ విధమైన కృత్రిమత్వం లేకుండా చూపించిన చిత్రం. జ్యోతి ఆర్ట్ అని మొదట వచ్చినప్పుడు సూర్యుడు బ్యాక్ గ్రౌండ్ లో ఒక కిరణం హారతి గా చుట్టూ తిరగడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కధని కెమెరా చెప్పాలనే సూత్రం ఉన్నా కొన్ని చోట్ల కెమెరా మెరుపులు బయటకి అవే వచ్చేస్తాయి. ఆ మెరుపులు వేదానికి చేసిన నాట్యం లో గమనించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *