తండ్రి నుంచి వారసత్వంగా అందిపుచ్చుకున్న సంగీతంతో బాటు సంగీత సభల నిర్వహణను ఖండాంతరాలలో కూడా నిర్వహిస్తూ మన కర్ణాటక సంగీతానికి ప్రాచుర్యం కల్పిస్తున్న కళాకారిణి శ్రీదేవి జోశ్యుల ప్రస్తుత నివాసం అమెరికా.
పూర్వీ కళ్యాణి రాగంలో ఆది తాళం లో స్వరపరచిన అన్నమాచార్య కీర్తన “ రామం ఇందీవర శ్యామం ” శ్రీదేవి స్వరంలో.... ముకుంద్ జోశ్యుల వాయులీన సహకారం....