10_003 అభిప్రాయకదంబం

శుభాభినందనలు

ఆంధ్రత్వమాంధ్ర భాషాచ..నాల్పస్య తపసః ఫలమ్ అని అప్పయ్య దీక్షితులంటే….

          తెలుగదేలయన్న  దేశంబు తెలుగు

          ఏను తెలుగు వల్లభుండ , తెలుగొకండ

          ఎల్ల నృపులు గొలువ యెరుగవే బాసాడి

           దేశభాషలందు తెలుగు లెస్స ” 

అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. ఆంధ్రత్వం , ఆంధ్రభాష మహత్తరమైన తపః ఫలమని  మనసా వాచా కర్మణా నమ్మినవారు శ్రీ శిష్ట్లా రామచంద్ర రావుగారు. కనుకనే ఆ ఆంధ్రభాష కోసం , ఆ భాషౌన్నత్యం కోసం తన జీవితాన్నే  ధారపోసారు. పత్రిక నడపటమన్నది అందునా ఇంటర్ నెట్ పత్రిక నడపటం కష్టసాధ్యమన్న విషయం జగద్విదితం. ఈ కష్టసాధ్యమైన కార్యాన్ని అలవోకగా సుసాధ్యం చేసేసారు శిరా రావుగారు. తొమ్మిదేళ్లు నిర్విరామంగా ఇంటర్ నెట్ లో ఈ పత్రిక  నడుస్తూ పదో ఏడులోకి అడుగుపెడుతోంది అంటే బాల్యావస్థను  అధిగమించిందన్న మాట!  

                  మీరు గొప్ప మనసుతో , కళాహృదయంతో , దృఢసంకల్పంతో , సంస్కృతీగరిమతో చేపట్టిన ఈ పత్రిక ఉదాత్త ఆశయాలు , ఆదర్శాలు సఫలీకృతం కావాలని మనసా ఆకాంక్షిస్తూ………..

— గుమ్ములూరి ఇందిర

మహాలయం ” గురించి……

* మంచి కార్యక్రమం 🙏

– Rentala Ramachandra

తో. లే. పి. శీర్షికన “ సత్తిరాజు రామ్ నారాయణ ” గురించి…..

* 🙏🙏

Nagesh Babu Dwibhashyam

 

‘ అమెరికా ఇల్లాలి ముచ్చట్లు ‘ శీర్షికన “ బతుకు పడవ ” గురించి……

* వర్షం లో కోనసీమ అందాలు, ఒక మధ్య తరగతి కుటుంబం లో సహజంగా ఉండే వాతావరణం అంటే అనురాగాలు, జాగ్రత్తలు, చెప్పే మందలింపులు, ఇహ ఓ పక్క వర్షం వస్తుంటే అమ్మ చేసే వంట ఆ సువాసన, ఏక ధాటిగా వర్షం కురుస్తుంటే వసారా లో వరుస వడ్డనలు, దూరం నుంచి చూరులో కూర్చుని రెక్కలు ఆరబెట్టుకుంటున్న కాకి, పొరపాటున అది అరిస్తే చుట్టాలెవరైనా వస్తారనే సరదా వీటి ముందు ఏ ఆనందం అయినా దిగదుడుపే కదా.

– Gbv sastry

* madhyatharagathi – jeewiytaalalo – repati kosam nijaayithee kosam kashyta pade thatwam – kathalaku jeewaanni istaayi – cakkani kathanu nadincaar u shyamala gaaru –

– Kusuma Piduri

మావూరు – అమలాపురం ” గురించి….

ఆహా, ఎంత కమ్మగా రాశారు సామీ! షడ్రసోపేతమైన భోజనం తిన్నట్టు వున్నది. గోదారి జిల్లాల అందాల గురించి ఎంత చెప్పిన తక్కువే . రెండు జలాశయాల మధ్య ఏర్పడిన త్రిభుజాకారపు సుందర కోనసీమలో ముఖ్యమైన ప్రదేశము ఈ అమలాపురం.ఆకాశాన్నంటే కొబ్బరి చెట్లు.. పైరగాలికి ఊయలలూగే పచ్చటి పైర్లు.. నిండు వేసవిలోనూ జలకలతో సాగిపోయే కాలువలు.. ప్రకృతికాంత హొయలన్నీఅమలాపురంలో అడుగడుగునా కనబడుతాయి. కోనసీమ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతేకాదు, కోనసీమ సాంప్రదాయాలు, మర్యాదలు పర్యాటకులను కట్టిపడేస్తాయి.కోనసీమలో ప్రకృతి అందాలే కాదు.. ఆధ్యాత్మికతను పంచే పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి.ప్రతి అణువు అద్భుతమే.
ఇలాంటి ప్రదేశమైన అమలాపురం గురించి ఎంత వర్ణించినా చాలదు.  

Thanks & Regards

Durga Prasad

REGIONAL MANAGER, NITCO TILES LTD, ORISSA 

 

* మా వూరు కూడా అమలాపురమే. తెలియని విషయాలు తెలియచేశారు. ధన్యవాదములు. కళావెంకటరావు గారికి సమకాలీన కాంగ్రెస్ అగ్రగణ్యుడు అయిన న్యాయవాది తురగా శ్రీరామమూర్తి గారిని జ్ఞాపకం చెయ్యలేదు. ఆయన మాతాతగారు.

– NAGESWARA RAO TURAGA, Advocate

* అధ్భుతంగా డిజైన చేసారు రామచంద్ర!

– Prasad

* I like amalapuram very much.It is my birth place and educated there in skbr college.The above article has taken back me with lot of good memories.

– Aparanji pachigolla

“ డొక్కా సీతమ్మ గారి నిరతాన్నదాన వ్రతం ” గురించి……

* డొక్కా సీతమ్మగారికి నమస్కృతులు.

– Sivakumar Malladi

– Ayyagari Bala

* అద్భుతమైన వ్యాసం

– Svds Sarma

* Dokka seetamma talliki vela namaskatalu

– Padmaja Vani P

* Ramachandra Rao S garu ilanti mahatmula jeevitalanu neti taram pillalaku patyamsaluga nerpinchali…appude viluvala gurinchi telusukuntaru
Sarvepalli Jwalachaitanyakumar

09_017 సంచికలోని “ పసితనం – పసిడిమయం

Ee kadha na pasithanani tatti lepindi.
Mamatanu ragalu ane aksharamalato meeru Raasina ee kadha naalo unna pasithanani nenu anubhavinchina pasithanam loni gnapakalanu mee aksharala tho avishkarincharu.Eekadhanu prachurinchina sirakadhamba nirvahulaku,rachyata ku sirasu vanchi pasidi hrudyam to namaskaram.

Rachaita krishna mohan gariki parteyaka dhanyavadalu.

– Telidevara Rajendraprasad