10_003 కందుకూరి రుద్రకవి – కొండోజీ అనుబంధం

                       

                           శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానం – కోట సింహద్వారం నుండి అక్కడికి – సారస్వత సభకుచేరడమంటే మాటలా!? 

ద్వారపాలకులు ముందే బల్లాలను` X `వలె అడ్డం పెట్టేస్తారు కదా. 

కొలువులోని ఉద్యోగులు, సిబ్బంది – ఈ వర్ధమాన కవిగారికి తెలీదు.
తాతాచార్యుల వారి ముద్ర వీపు తప్పినా వీపుకు తప్పదు – ఇత్యాది సామెతలకు హేతువు ఐన తాతాచార్యులు – ఆస్థాన కవులలో స్థిర స్థానం పొందిన కవి – అని అర్ధం ఔతూనే ఉన్నది కదా!

@@@@@@

శ్రీకృష్ణదేవరాయల వారి భువనవిజయం – ప్రాంగణంలో ఈశాన్య దిశలో ఉన్న పీఠంపై కందుకూరి రుద్రకవి ఆసీనుడయ్యాడు. ఆ కుర్చీలో కూర్చునే అర్హత సంపాదించడానికి అతడు ఎన్నో అడ్డంకిలను, ఇక్కట్లను అధిగమించి రాగలిగాడు. 

ఎలాగైతేనేం, కొసకు –  శ్రీకృష్ణదేవరాయల వారి క్షురకుడు – 

కందుకూరి రుద్రకవికి హామీ ఇచ్చాడు, 

” మీకు సార్వభౌముల దర్శనం లభించడానికి, నాకు చేతనైనంత సాయం చేస్తాను.” 

ఈ చిన్న మాట కందుకూరి రుద్రకవి కన్నులను ఆనందాశ్రువులతో నింపింది. 

స్నేహహస్తం అందించిన ఆ రాయల వారి మంగలి పేరు కొండోజీ. 

కందుకూరి రుద్రకవికి తటస్థపడిన ఈ వృత్తికారుడు మంగలి తిమ్మోజు కొండోజీ – 

నివాసం బాడవి పట్టణం.

శ్రీకృష్ణదేవరాయలవారి తర్వాతి రాజ్య పాలకులు సదాశివ రాయలుకు, అళియ రామరాయలు.

1542 నుండి 1565 వరకూ పాలించిన సదాశివ రాయలుకు, అళియ రామరాయలు లకు కూడా – సాన్నిహిత్య సేవకుడు. 

కేవలం మంగలి పని నిర్వహణయే కాక, ప్రభువులకు మంచి సలహాలు ఇచ్చే చురుకుదనం, ఇంగితజ్ఞానం ఉన్న వ్యక్తి, కనుకనే – మహా రాజులకు సఖ్యత ఉన్న భృత్యుడు అయ్యాడు కొండోజీ. 

కొండోజీకి బహుమతులుగా ఇచ్చిన భూములు, కానుకల వివరముల గురించిన దాన శాసనాలు ఈ విషయానికి ఆనవాళ్ళు. 

తనకు వీలు ఉన్నంతలో నలుగురికీ సాయపడే గుణం కలిగి ఉన్న మనిషి కొండోజీ, అందుచేతనే – కందుకూరి రుద్రకవి –

“మంగలి కొండోజి మేలు మంత్రుల కంటెన్.” అని పద్యాన్ని చెప్పాడు కవి. 

కందుకూరి రుద్రకవి – నుడివిన పద్య పంక్తి కాస్తా – లోకోక్తి ముక్తావళి గా మారింది.

***********************************************