స్వరనీరాజనం
‘ సంగీత సామ్రాట్ ‘ఎం. ఎస్. బాలసుబ్రహ్మణ్య శర్మ గారి స్మరణ కార్యక్రమం
ఆంధ్ర దేశములో పేరెన్నిక గన్న గొప్ప గాత్ర విద్వాoసులు సంగీత సామ్రాట్ శ్రీ ఎం.స్ .బాలసుబ్రహ్మణ్య శర్మ గారి 91 వ జయంతి సందర్బముగా వారిని స్మరించుకుంటూ శిష్య ప్రశిష్యులు 17 -09 -2020, గురువారం నాడు ఫేసుబుక్ ద్వారా స్వర నీరాజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రస్తుత పరిస్థితిలో ప్రత్యక్షంగా సభా నిర్వహణ వీలు లేనందువల్ల సాంఘీక మాధ్యమాలలో ఎంతో ప్రచారములోనున్న ఫేసుబుక్ లో సంగీత సామ్రాట్ శ్రీ ఎం.ఎస్. బాలసుబ్రహ్మణ్య శర్మ పేరుతో ఒక ఫేసుబుక్ పేజీని ప్రారంభించి అందులో శిష్య ప్రశిష్యులందరూ ఒక్కొక్కరుగా వారి రచనలను పాడి స్వరనీరాజనం సమర్పించారు
ఆ రోజు ఉదయము శ్రీ శర్మ గారు పాడిన శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం తో కార్యక్రమం ప్రారంభమైనది. శర్మ గారి మీద సంగీత విద్వాన్ శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు గారు రచించి స్వరపరచిన ” వందే బాలసుబ్రహ్మణ్యం” అనే కృతితో శ్రీమతి భమిడిపాటి లలితామాధవ్ గురువందనం సమర్పించారు. ఆ తరువాత శర్మ గారి పెద్ద కుమారులైన శ్రీ ఎం.బి. శేషావతారం గారు వారి నాన్నగారి గురించి ప్రసంగించారు. ప్రముఖ అంతర్జాతీయ సంగీత మాస పత్రిక ” గానకళ ” సంపాదకులు శ్రీ మునుగంటి వెంకటరావు గారు, ఉప సంపాదకులు శ్రీ జయంతి శాస్త్రి గార్లు శర్మ గారితో వారికున్న అనుభవాలను వివరించారు.
బాలసుబ్రహ్మణ్య శర్మ గారి సంగీత, సాహిత్యముల మీద పరిశోదన చేసి ఎం. ఫిల్. పట్టాని పొందిన ఒంగోలు వాస్తవ్యులు, ఎస్. ఎస్. ఎన్. డిగ్రీ కాలేజీ లెక్చరర్ డా. శ్రీ నందనవనం శివకుమార్ గారు శర్మ గారి సంగీత సాహిత్య వైశిష్ట్యము గురించి సవివరముగా ప్రసంగించారు.
ఆ తరువాత గురువుగారి శిష్యులు శ్రీ పింగళి ప్రభాకర రావు, శ్రీమతి K. S. వసంత లక్ష్మీ, శ్రీమతి శివకామేశ్వరి ( శర్మ గారి ద్వితీయ కుమార్తె ) ,శ్రీమతి లలిత తంగిరాల ( శర్మ గారి మనుమరాలు ), శ్రీ K V బ్రహ్మానందం, శ్రీ శ్రీరామచంద్రమూర్తి విష్ణుభట్ల, శ్రీ బి. రఘునాథ్, శ్రీ మధుసూదన రావు వారి శిష్యులు, శ్రీమతి నాగ సునీత ( శ్రీ DV మోహనకృష్ణ శిష్యురాలు) గురువు గారిని స్మరించుకుంటూ వారి కృతులు, స్వరపరచిన అన్నమయ్య కీర్తనలను గానం చేశారు.
ఆ రోజు సాయంత్రము, శర్మగారి శిష్యులు శ్రీమతులు హేమ, వనజ, అపర్ణ, నాగలక్ష్మి, రాజేశ్వరి, శైలజ, నాగసుధ, లలితామాదవ్, కుమారి వసంత గురువుగారి కృతులు, స్వరపరచిన అన్నమాచార్య సంకీర్తనలను గానం చేసి సంగీత సామ్రాట్టుకి సభక్తి పూర్వక స్వర నీరాజనం సమర్పించారు.
కార్యక్రమ రూపకల్పన మరియు నిర్వహణ
శర్మగారి శిష్యులు
శ్రీమతి భమిడిపాటి లలితామాధవ్ ( చెన్నై)
శ్రీమతి పమిడిపాటి నాగ సుధ ( ఒంగోలు)
ఈ కార్యక్రమం ఈ లింక్ లో వీక్షించవచ్చు….
https://www.facebook.com/Sangeetha-Samrat-Sri-MSBalasubrahmanya-Sarma-103124554866621/