10_004 సౌభాగ్యలక్ష్మి

 1.  ఓ సౌభాగ్యలక్ష్మి !

ఆభగవంతుదు, పరమాత్మ, అవ్యయుడు,

చరాచరసృష్టికి మూలభూతుడు

అయిన నీకాన్తుడు శ్రీమహావిష్ణువు

నీకు పతియై “ లక్ష్మీపతియై ”

త్రిజగత్తులకు పరమాత్మయై

విలసిల్లినాడు.

 1.  ఓ సౌభాగ్యలక్ష్మి !

నీపతి శ్రీమహావిష్ణువు లక్ష్మీపతి

యగుట వలన విశ్వైకవంద్యుడై

మహదదృష్టముతో తేజరిల్లినాడు.

 1.  ఓ సౌభాగ్యలక్ష్మి !

నీ కృపావీక్షణము నాపై – లవలేశమైన

యుండిన భోగభాగ్యములతోపాటు

జగత్ ప్రసిద్ధిని సుగతిని ఓ తల్ల్లీ ! ఈ క్షణమే

పొందుదును.

 1.  ఓ సౌభాగ్యలక్ష్మి !

విజ్ఞానమనే దివ్యకాంతులతో

నీ భక్తుల హృదయమందున్న అజ్ఞాన

తిమిరాన్ని పారద్రోలి నీ అమోఘమైన

ఆశీస్సులతో ఎల్లప్పుడు

రక్షించుచున్నావు గదా !

 1.  ఓ సౌభాగ్యలక్ష్మి ! ఓ తల్లీ !

వేదవాఙ్మయమున పఠించుచు

అర్చకులు మంగళ కలశాలతో

గంగాది పవిత్ర తోయముతో

నిన్నభిషేకించి ఆగమోక్తప్రకారముగా

ఎల్లడల నిన్నర్చించున్నారు.

 1.  ఓ సౌభాగ్యలక్ష్మి !

దేవేంద్రుడు కృతాంజులుడై “ ఓ భువనేశ్వర

నన్ను కరుణించుమమ్మా ! ” అని

ప్రార్థించి ఇంద్ర పదవిని పొంది

ఆనందించుచున్నాడు.

 1.  ఓ సౌభాగ్యలక్ష్మి !

సంసారమనే స్వేదముతో

కలుషమైన మోహజాలంలో

మానవులు మునిగి త్రేలుచున్నారు.

అమ్మా ! మానవ జీవితమన్న

ఎత్తు పల్లములతో కూడినదిగదా !

 1.  ఓ సౌభాగ్యలక్ష్మి !

వేదాన్త బోధతో చల్లనై స్పష్టముగా తెలుసు

కొనబడి, నీ కైంకర్యమనే

పుణ్యముచే గురిబెట్టబడి

గుర్తించబడిన, ఆత్మావలోకనమనే

సుఖమును కలిగించి, దయతో

బ్రోవుమమ్మా !

 1.  ఓ సౌభాగ్యలక్ష్మి !

జ్ఞానము – బలము – ఐశ్వర్యము

వీర్యము – శక్తి – తేజస్సు అనే

షడ్గుణ పరిపూర్ణమైనదానివై

కలికాల, కలిదోషమును హరించు

దేవతా ! ఈ షడ్గుణప్రభావము

మాకునూ కలిగించుమమ్మా !

 1.  ఓ సౌభాగ్యలక్ష్మి !

( అం + అ ) అమ్మ – అంతులేని అడ్డులేని

 అనవద్యమైన శుభములతో

నిత్యము ప్రకాశించుదానా ! తల్లీ !

బ్రహ్మాండనాయకుని వధువ

కలశాబ్ధి పుత్రి, సర్వశోభాయమైనదానా !

తల్లీ రక్షించుము. మము చల్లగా బ్రోవుము !

 1.  వేదాల వంశోద్భవ పండితులలో

మాననీయుడు ఉ|| వే|| శ్రీ స్వామి వెంకటా

చార్యుల వారి పుత్రుడైన శ్రీనివాసా

చార్య కృతమైన శ్రీహర్ష వర్షమన

ఈ కృతిని భక్తులు పఠించి అధిక

ఆనందమయమైన జీవనమును

గడుపుదురు గాత ! ఇతిశమ్ ||

*******************