మాటాడనికవులకలాలకు
పాటలు నేర్పేమొనగాడా !
మాటలలో మధువులు కురిసి
మై మఱపించేచెలికాడా !
పరుసవేది నీగళమును తాకిన
ప్రతిభాషా బంగారం !
నీవు ధరించేప్రతిపాత్రా
కళాసరస్వతిమణిహారం !
నీనవ్వులలో వెన్నెల వుంది !
నిండుమనసులో వెన్నెల వుంది !
వెన్నెల లంటే నీ కిష్ట మని
వెన్నెలవీణలు నీ కిస్తున్నా !
ఈవెన్నెలవీణలలో
నవరాగం పలికించు !
స్వరరహస్యవేదీ ! బాలూ !
చిరంజీవి వై దీపించు !
( ‘ కోనసీమ కవికోకిల ’ డా. వక్కలంక లక్ష్మీపతిరావు గారు 1993వ సంవత్సరంలో తన పుస్తకం “ వెన్నెల వీణలు ”
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారికి అంకితం చేసిన సందర్భంలో….. )
**********************************