10_005 నమామి వెంకటేశ…

 

ఎద నిండ నింపుకుని ఎలుగెత్తి పిలువగా

ఏడు కొండల మీద ఎంకన్ననార్తిగా

కనుల ముందరె కాంచగ

అభయ హస్తములతోడుగ

కలవరపడుతున్నది మది కొండనెక్కగ

కరుణనిండిన నేత్రములను కావగ

ఆనతినియ్యవయ జాగును చేయక

హోరెత్తు నీ నామ సంకీర్తనముల

తరియింతును నీ మంగళ పదముల

కరుణించుము నన్ను వేగిరముగ

ఇక వేచి చూడ నా వల్ల కాదయా

గోవిందా గోవింద

**********************************