10_007 బాలభారతం – పాపల్లారా !

కల్ల కపట మెఱుగనిపసిపిల్లల్లారా !

చిఱునవ్వులు చిందించేచిదానందమూర్తుల్లారా !

పాపల్లారా ! మాకనుపాపల్లారా !

మాయింటిదీపాల్లారా !

దైవస్వరూపుల్లారా !

                                    మనిషికి దేవుడు మన సిచ్చాడు !

                                    ఆమనసున మాయనిమమ తిచ్చాడు !

                                    మమతలు నిండినమనిషి దేవు డని

                                    మనసున నిలిచి పలికాడు !

మమతలు మఱచి మనసులు విఱిచి

మనిషి ఱాయిగా మారాడు !

మనసున నిలిచినదేవునిమాటే

మఱచి పశువుగా మారాడు !

                                    పశువుగ మాఱినమనిషికన్నను

                                   శిశువే మేలండీ !

                                   భూమిని స్వర్గం చేయా లంటే

                                   తగినవారు మీరేనండీ !

మంచిని పెంచుటె సంస్కారం !

మంచిని మఱచుట అపచారం ! 

మనసు మనసునూ మాలగ గ్రుచ్చుటె

మాధవదేవుని కుపచారం !

*************