—
అవిరళ కృషితో, పట్టుదలతో సాధన చేసి ఆనతి కాలంలోనే తిరువాయూరులోని త్యాగరాజ ఆరాధనోత్సవంలో పాల్గోనగలిగారు. ఆ సమయంలోనే ఉచ్చారణ విషయంలో నిరసనలు ఎదుర్కొన్నారు. ఛాందసులు కొందరు ఆయన పాశ్చాత్య ఉచ్చారణను ఆక్షేపించారు. అయినా పట్టుదలతో తన ఉచ్చారణను సరి చేసుకున్నారు. చాలా కచేరీలు చేశారు. అనేక రికార్డులు వెలువరిచారు. భాగవతార్ బిరుదు కూడా అందుకున్నారు.
డిసెంబర్ 06వ తేదీ కర్ణాటక సంగీత విద్వాంసుడు జాన్ బి. హిగ్గిన్స్ వర్థంతి సందర్భంగా ఆయనకు స్వర నీరాజనం అర్పిస్తూ…….