10_008 మార్గశీర్షమ్

——————————————–

“ మాసానాం మార్గశీర్షోః ” అని కృష్ణుడు చెప్పాడు. మృగశిరా నక్షత్రములో చంద్రుడు ఉండగా పౌర్ణమి వస్తుంది గనుక ఈ మాసానికి మార్గశీర్షము అని పేరు వచ్చింది. ఇది చంద్రమానము ప్రకారము చెప్పుకుంటాము. సూర్యమానము ప్రకారము సూర్యుడు ధనూ రాశిలో సంచరించే దినములు ఈ మార్గశీర్ష మాసముతో కలుస్తాయి. ఈ ధనుస్సంక్రమణం జరిగినపుడు గోదాదేవి రచించిన ‘ తిరుప్పావై ’ పఠించడం, కాత్యాయనీ వ్రతం చేయడము జరుగుతుంది. ఈ మాసములోనే ఏకాదశినాడు గీతాజయంతి, పౌర్ణమి రోజున దత్తాత్రేయ జయంతి, సుబ్రహ్మణ్య షష్టి వంటి పర్వదినాలు వస్తాయి.

ధనుస్సంక్రమణం అంటే ఏమిటి ? దాని విశిష్టత ఏమిటి ? వంటి విశేషాలు తెలియజేస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు….. ఈ క్రింది వీడియోలో……