10_010 ద్విభాషితాలు – నో వైరస్

.

పెదవి చివర నవ్వుకు ..

గ్రహణం పట్టింది.

.

మాట మూగవోయి..   

గోడల మధ్య.. మూల్గుతోంది .

.

మనిషి నిర్మించిన ప్రపంచం..

మంచం పట్టింది.

.

ప్రకృతి ఒడిలో..

స్వేచ్ఛ మాత్రం..

రెక్కలు విప్పుకొని ఎగురుతోంది!

.

***************************************