—
తెలుగు వారి పండుగలలో పెద్ద పండుగ సంక్రాంతి.
మన పండుగలన్నీ సంప్రదాయం ప్రకారం సామాజికాంశాలతో బాటు ఆథ్యాత్మికాంశాలు కూడా కలగలసి ఉండడం జరుగుతుంది.
సంక్రాంతి నాలుగు రోజుల పండుగగా చెప్పుకోవచ్చును. మొదటి రోజు భోగి, రెండవరోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ, నాలుగవరోజు ముక్కనుమ గా జరుపుకుంటారు.
భోగి మంట అంటే మన భోగముల యొక్క మంట అని పెద్దలు చెబుతారు. భౌతికంగా పనికిరాని వస్తువులను భోగి మంటలో దహనం చేసినట్లే మన కోరికలను జ్ఞానాగ్నికి ఆహుతి నిచ్చి పునీతులమవ్వడమే ఈ భోగిమంట అంతరార్థంగా చెప్పవచ్చును.
సంక్రాంతి రోజున ఋతువులన్నిటికీ అధిపతి అయిన సూర్యుని అర్చించడం సంప్రదాయం. మనకి కావల్సిన పంటలు చక్కగా పండడానికి, ఋతుక్రమం సక్రమంగా జరగడానికి కారణమైన సూర్యభగవానునికి కృతజ్ఞత ఈ పండుగ అంతరార్థంగా చెప్పుకోవచ్చును.
కనుమ రోజు ప్రయాణములు మొదలైనవి నిషిద్ధము. అంతవరకు చేసిన సంకల్పములు అన్నీ స్థిరపరుచుకుని పునీతులమయ్యే రోజు.
ముక్కనుమ ను పశువుల పండుగ అని కూడా అంటారు. ఆరోజు పశువులను, వాహనములను శుభ్రం చేసి అలంకరించి పూజించడం సంప్రదాయం.
ఈ నాలుగురోజుల పెద్దపండుగలోని అంతరార్థాలను వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు….. గతంలోని ఈ క్రింది వీడియోలో……