‘ శిశుర్వేత్తి పశుర్వేత్తి…. ’ సంగీతం గురించి ఇంతకంటే మంచి వివరణ దొరకదేమో ! సంగీతానికి పరవశించని ప్రాణి ఈ సృష్టిలో ఉండదేమో ! సంగీతమంటే బోర్ అనే వారు కూడా సినిమా పాటలు వినడం మనం చూస్తూ ఉంటాము. మన శాస్త్రీయ సంగీతమైనా, పాశ్చాత్య సంగీతమైనా, లలిత సంగీతమైనా, జానపద సంగీతమైనా, ఆధునిక సంగీతమైనా….. ప్రక్రియ ఏదైనా అది సంగీతమే ! అనుభూతి చెందే మనసుంటే సృష్టిలో ప్రతిదీ సంగీతమే ! చంటిపాప ఏడుపు, లయబద్ధంగా ఊగే ఉయ్యాల, పక్షుల కిలకిలారావాలు, చివరికి వీధిలో అమ్ముకునే చిరు వ్యాపారి కేకలో కూడా సంగీతం వినిపిస్తుంది.
భారత దేశానికి సంబంధించినంత వరకూ ప్రధానంగా రెండు శాస్త్రీయ సంగీత పద్ధతులున్నాయి. ఒకటి ఉత్తర భారత దేశానికి చెందిన హిందూస్థానీ సంగీతం, దక్షిణాదికి చెందిన కర్ణాటక సంగీతం. సహజంగా శ్రమ జీవులైన పల్లె జనపదులు పాడుకునే సంగీతం ‘ జానపద సంగీతం ‘.
కర్ణాటక సంగీతాన్ని సుసంపన్నం చేసిన మహా విద్వాంసులు, వాగ్గేయకారులు ఎందరో ఉన్నారు. వారిలో ‘ సంగీత త్రిమూర్తులు ’ గా పిలుచుకునే త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్ లు. ఇందులో త్యాగరాజు లెక్కకు మిక్కిలి కీర్తనలను రచించి స్వరపరచినట్లుగా మనందరికీ తెలుసు. తెలుగు వాడైన త్యాగరాజు, తమిళ ప్రాంతంలో నివసించినా తన మాతృభాషలోనే చాలా భాగం కీర్తనలను రచించి తెలుగు భాషకు ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టాడు. కర్ణాటక సంగీతానికి తెలుగు భాషే అనువైనదని అనుకునేలాగా చేశాడు.
ఆ మహానుభావుని వర్థంతి సందర్భంగా ఆయన సమాధి స్థలమైన తిరువాయూరు లో ప్రతి సంవత్సరం పెద్ద యెత్తున ‘ ఆరాధనా కార్యక్రమం ’ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. చిన్న పెద్దా అనే తేడా లేకుండా విద్వాంసులందరూ కలసి త్యాగరాజ కీర్తనలు…. ముఖ్యంగా పంచరత్న కీర్తనలు ఆలపించడం ఆనవాయితీ.
కర్ణాటక సంగీతంలో వీణా వాయిద్యానికి విశేషమైన స్థానం ఉంది. సరస్వతీదేవి కి ఇష్టమైన వాయిద్యంగా పేర్కొంటారు. ఎందరో గొప్ప గొప్ప వీణా విద్వాంసులు కర్ణాటక సంగీత చరిత్రలో ఉన్నారు. ‘ వీణ ’ నే ఇంటిపేరు గా చేసుకుని తన వాయిద్యంతో యావత్తు సంగీత ప్రియులను పరవశింపజేసిన గొప్ప విద్వాంసుడు చిట్టిబాబు. ఆయన ఇంటి ఏదైనా ‘ వీణ చిట్టిబాబు ’ గానీ అందరికీ తెలుసు. వీణ పై కేవలం కీర్తనలను పలికించడమే కాదు…. అనేక ప్రయోగాలను కూడా చేశారు. వేదం పలికించడం, కోయిల కూత, లలిత గీతాలను పలికించడం, ఇండో జాజ్ సంగీతం వంటి ఎన్నో ప్రయోగలను చేశారు. అంతకుముందే కొందరు విద్వాంసులు వీటిలో కొన్ని ప్రయోగాలను చేసినా చిట్టిబాబు వీణానాదానికి వచ్చినంత కీర్తి మరే కళాకారునికి రాలేదనే చెప్పవచ్చు. ‘ వీణ ’ నే తన జీవితంగా చేసుకొన్న చిట్టిబాబు చిన్న వయసులోనే సంగీత ప్రపంచాన్ని వదలి వెళ్ళిపోవడం విషాదం.
ఇటువంటి మహానుభావులు ఇప్పుడు మన మధ్య లేకపోయినా వారు వదలివెళ్లిన సంగీతం మన మధ్యనే ఉంది…. ఉంటుంది. వారిని అడుగడుగునా గుర్తు చేస్తూనే ఉంటుంది. వీరందరూ మన సంపద. వీరిని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం.
**********************************************************
కృతజ్ఞతలు : ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
1. భమిడి కమలాదేవి, తణుకు
2. రాజవరం ఉష, హైదరాబాద్
చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి.
ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవిత కాలం :
భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.
మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించవచ్చును.
Please Subscribe & Support
మీ చందా Google Pay UPI id : sirarao@okaxis ( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.
అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.
వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com
‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –
Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )
or Click here –> paypal.me/sirarao
********************************************************
**********************************
Please visit
సాహిత్య శారదీయం – శిరాకదంబం పేజీ
**********************************
ప్రకృతి ఒడిలో ‘ బడి ‘ గురించి పరిచయ వీడియో…. పూర్తి కథనం త్వరలో…