10_013 భీష్మ ఏకాదశి

.

మహాభారతంలో భీష్మునికి ప్రముఖమైన స్థానం ఉంది. మాఘ శుద్ధ అష్టమి భీష్ముడు నిర్యాణం చెందిన రోజు. కనుకనే ఆరోజు భీష్మాష్టమి గా పిలువబడుతోంది. ఆ తర్వాత వచ్చే ఏకాదశి, ద్వాదశి తిథులను కూడా భేష్ముని పేరు మీద భీష్మ ఏకాదశి, భీష్మ ద్వాదశి అని పిలువబడుతున్నాయి.

మహాభారతంలో భీష్మునికి అంత ప్రాధాన్యం రావడానికి ప్రధానమైన కారణం శ్రీకృష్ణుడు, భీష్ముడు…. ఇద్దరూ అష్టమ గర్భ సంజాతులే. గంగాదేవిని శంతనుడు వివాహం చేసుకున్న తర్వాత ఈ దంపతులకు ఏడుగురు సంతానం కలిగారు. అయితే ఒక్కొక్కరినీ గంగాదేవి నదిలో విసిరి వేస్తుంది. ఎనిమిదవ సంతానమైన భీష్ముని విసిరి వేయకుండా ఉండటానికి కారణం ఈ ఎనిమిదిమంది సంతానం పూర్వకాలంలో అష్టవసువులు. వారిలో చివరి వాడైన భీష్ముని భార్య కామధేనువుని కోరుకోవడంతో అష్టవసువులు ఆ కామధేనువు ని అపహరించి తెస్తారు. దానివలన వారు మానవులుగా భూలోకంలో జీవించమని శాపం పొందుతారు. అయితే మొదటి ఏడుగురు ఎనిమిదవ వాని ప్రేరేపణ వలన దొంగతనం చేశారు కాబట్టి పుట్టిన వెంటనే మోక్షం కలిగేటట్లుగా శాప విమోచనం పొందుతారు. కానీ ఎనిమిదవ వాడైన భీష్ముడు మాత్రం దీర్ఘకాలం జీవించవలసి వస్తుంది.     

ఇంకా అనేక విశేషాలను వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు….. గతంలోని ఈ క్రింది వీడియోలో……  

.