.
మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నా అందరికీ ప్రత్యక్ష దర్శనం లభించదు. అయితే రోజూ ప్రత్యక్ష దర్శన భాగ్యం కలుగజేసే దైవం సూర్యనారాయణుడు. అందుకే ఆయనను ప్రత్యక్ష దైవం అంటుంటాం. సూర్యుడు ప్రత్యక్ష దర్శనమే కాదు.. ప్రతి జీవికీ అవసరమైన ఎన్నో వరాలు కూడా ప్రసాదిస్తాడు. అందులో అతి ముఖ్యమైనది ఆరోగ్యం. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. సూర్యరశ్మి లో భూమి మీద ఉండే జీవులన్నిటికీ అవసరమైన పోషకాలు, రక్షకాలు ఎన్నో ఉంటాయి. ఇంకా వాతావరణ పరిస్థితులను కూడా సూర్యుడు ప్రభావితం చేస్తాడు. ఇంకొక ముఖ్యమైన వరం…. రోజులో సగం సమయం భూమికి కావల్సిన వెలుతురుని అందించేది సూర్యుడే. ఇలా ఎన్నో విధాలుగా భూమి మనుగడకు, భూమి మీద జీవం మనుగడకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణభూతుడవుతున్న దైవం సూర్యనారాయణుడు.
ఫిబ్రవరి 19 వ తేదీ రథసప్తమి సందర్భంగా……
.