10_013

.

ప్రస్తావన

రాజుల కాలంలో రాజు చెప్పిందే శాసనం. చెప్పిందే చట్టం. రాజ్యంలో ఇతరులెవరికీ ఎదురు మాట్లాడేహక్కు ఉండేది కాదు. సర్వాధికారాలు రాజు వద్దనే ఉండేవి. ఇష్టమైన వారిని చేరదీయవచ్చు. లేని వారిని శిక్షించవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే పరిపాలిస్తుంది. ఆ ప్రభుత్వాధినేతలు, వారికి సహాయపడే ప్రభుత్వ యంత్రాంగం ప్రజల తరఫున, ప్రజల కోసం పని చేస్తుంది.

అందుకే “ ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు నిర్వహింపబడే పరిపాలనయే ప్రజస్వామ్యం ” అన్నారు అబ్రహాం లింకన్. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలదే అత్యున్నతమైన, అంతిమమైన అధికారం.

ప్రభుత్వాన్ని నడిపే పాలకులు కేవలం ప్రజల తరఫున, ప్రజల కోసం పరిపాలన సాగించే ప్రతినిధులు మాత్రమే ! ప్రజలకు కావలసిన సౌకర్యాలు, దైనందిక జీవితం ప్రశాంతంగా, ఏ లోటు రాకుండా జీవించే విధంగా పరిపాలన నిర్వహించవలసి ఉంటుంది. ప్రజల కున్న హక్కులు, బాధ్యతలతో బాటు ప్రజలను పాలించే ప్రభుత్వం అనుసరించవలసిన పద్ధతులు, విధానాలను మన రాజ్యాంగం నిర్దేశించింది.

ఎన్నో శతాబ్దాల పాటు రాచరికంలో, పరాయి దేశస్థుల పాలనలో మ్రగ్గిపోయిన భారత జాతి దశాబ్దాల పాటు పోరాడి తెచ్చుకున్న స్వాతంత్ర్యం…. ఏడు దశాబ్దాల తర్వాత అయినా ఆ స్ఫూర్తిని నిలబెట్టుకుంటోందా అనేది జవాబు లేని ప్రశ్న. శతాబ్దాల రాచరికం వాసనలు ఇంకా మనలో మిగిలిపోయాయనిపిస్తుంది. పాలకులు అంటే సర్వాధికారులే అనే భావన అటు పాలకులలోనూ, ఇటు ప్రజలలోనూ ఇంకా పోలేదు. ప్రజలు తమకు సేవ చేయడానికి తమలో కొందరిని ఎన్నుకున్నారన్న స్పృహ నాయకులకు ఉన్నట్లుగా అనిపించదు. ఓటేసి గెలిపించి ప్రభుత్వంలోకి పంపించినది తమకు సేవ చెయ్యడానికే గానీ తమ మీద పెత్తనం చెలాయించడానికి కాదు అనే భావన ప్రజలలో కూడా లేదనే అనిపిస్తుంది.

ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న అధికారులు, ఉద్యోగులు రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాలకు, నియమాలకు లోబడి రూపొందించిన చట్టాలను, విధి విధానాలను అనుసరిస్తూ ప్రజలకు సేవ చెయ్యడానికి జీతాలు, వేతనాలు ఇచ్చి పెట్టుకున్న వారు. అయితే అటు ప్రభుత్వాధినేతలలో గాని, యంత్రాంగంలో గాని, ఇటు ప్రజలలో గాని  ఈ స్పృహ లోపించింది.

అసలు ప్రభుత్వంలో ప్రజాసేవకులే గాని ‘ నాయకులు ’ ఉంటారా ? పాలకులను ‘ నాయకులు ’ అని అనవచ్చా ? అని ఆలోచిస్తే ‘ నాయకులు ‘ ఒక రాజకీయ పార్టీ కో, ఒక సమూహానికో ఉండడం సహజం. కానీ ప్రజలందరికీ వారు నాయకులా అంటే కాదనే చెప్పాలి. వారు మెజారిటీ ప్రజలు తమ తరఫున ప్రభుత్వాన్ని నిర్వహించడానికి ఎన్నుకొన్న ‘ పాలకులు ‘ మాత్రమే అని చెప్పవచ్చు. ఆ పాలకులు ప్రజాహితం కోసమే పని చెయ్యాలి.

ప్రభుత్వ యంత్రాంగం లో ‘ అధికారి ’ అనే మాట కూడా సరైనది కాదేమో అనిపిస్తుంది. అధికారం నుంచి వచ్చిన మాట అది. నిజానికి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారులు గాని, ఉద్యోగులు గాని ప్రజల కోసం, ప్రజలకు కావల్సిన పనులు చేసిపెట్టడానికి నియమించబడిన వారు. చట్టాలు, న్యాయసూత్రాలను అనుసరిస్తూ ఇవన్నీ చెయ్యాలి. తమ స్వార్థ ప్రయోజనాలకోసం గాని లేదా ఎవరో ఒక వ్యక్తి లేదా సంస్థ ప్రయోజనాల కోసం గాని ప్రజలు తమికిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరచకూడదు. ఒక అధికారి తన క్రింద పని చేసే ఉద్యోగులకే ‘ అధికారి ’ గానీ, ప్రజలకు కాదని గ్రహించాలి. తాము రాజ్యాంగానికి, చట్టానికి, న్యాయానికి… అంతిమంగా ప్రజలకు జవాబుదారులు గానీ కొందరు నాయకులకు, స్వార్థపర శక్తులకు జవాబుదారులు కాదని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న పాలకులు గతి తప్పినప్పుడు హెచ్చరించి సరైన దారిలో నడిపించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నవారికి ఉంటుంది.

రాచరికపు వాసనలు, వలస పాలకుల ప్రభావం నుంచి మన జాతి పూర్తిగా బయిటపడాలి. మనం ఎన్నుకొన్న నాయకులు మన కోసం పని చెయ్యాలి గానీ తమ స్వార్థం కోసం కాదని గ్రహించాలి. అలాటి స్వార్థపరులను మరోసారి ఎన్నుకోకపోవడమే కాదు సరైన నాయకుడిని ఎన్నుకోవడం కూడా చాలా ముఖ్యం. అలాగే ప్రభుత్వ యంత్రాంగం మన సేవకులే గాని, మన మీద పెత్తనం చెలాయించడానికి నియమించలేదని గ్రహించాలి.

లేకపోతే శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలు రాశులుగా పోసి అమ్మేవారని, రాజ్యమంతా సుభిక్షంగా ఉండేదని, ప్రజలు సుఖ శాంతులతో నిర్భయంగా జీవించేవారని చెప్పుకునే మాటలు చరిత్రలోనే మిగిలిపోతాయి. ఆరోజుల్లో ఇవన్నీ ఆలోచించడానికి, చెయ్యడానికి రాజులుండేవారు. ఇప్పుడు ప్రజలే ఆలోచించాలి, చేయించాలి. అప్పుడే మళ్ళీ స్వర్ణయుగం వస్తుంది. అదే స్వాతంత్ర్య సమర స్పూర్తికి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు సార్థకత.        

**********************************           

కృతజ్ఞతలు : ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

1. శ్రీమతి డి. వి. శారద, హైదరాబాద్ – జీవితకాలం – ₹. 10,000/-

2. శ్రీ & శ్రీమతి నూలు విజయకుమార్, అనకాపల్లి – రెండు సంవత్సరాలు – ₹. 2000/- ( 2 )

3. శ్రీ దశిక రామకృష్ణ & శ్రీమతి శ్యామల, అమెరికా – జీవితకాలం – ₹. 10,000/-

4. శ్రీమతి భమిడి కమలాదేవి, తణుకు – రెండు సంవత్సరాలు ₹. 1000/-

5. శ్రీమతి రాజవరం ఉష, హైదరాబాద్ – ఒక సంవత్సరం – ₹. 600/-

6. శ్రీ & శ్రీమతి పి. వి. రమణశర్మ, తిరువణ్ణామలై – రెండు సంవత్సరాలు – ₹. 2000/- ( 2 )

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి.  

ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవిత కాలం :

భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.

మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించవచ్చును.

Please Subscribe & Support

మీ చందా Google Pay UPI id : sirarao@okaxis ( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )

or Click here –> paypal.me/sirarao

********************************************************

**********************************

Please visit

సాహిత్య శారదీయం – శిరాకదంబం పేజీ

1. బృహదారణ్యకం

2. మహా మత్స్య – ఉపనిషత్కథ

3. అగ్నిరూపం

4. అను ష్ఠానం

5. అగ్ని మీళే పురోహితం

**********************************

ప్రకృతి ఒడిలో ‘ బడి ‘ గురించి పరిచయ వీడియో. పూర్తి కథనం త్వరలో