.
సఖీ !
నేనెవరో… ఎందుకు జీవించాలో..
తెలియలేదు !
.
నువ్వు కనిపించావు.
కలిసి నడిచాను.
.
శబ్దమయ జీవనంలో…
కలలు పంచుకోవడానికి..
కబుర్లు చెప్పుకోడానికి..
ప్రేమించుకోవడానికి..
కలిసి పాడుకోవడానికి..
నింపుకోడానికి…
ఒక్క నిశ్శబ్ద క్షణం దొరకలేదు !
.
ఇప్పుడు…
నిశ్శబ్దంతో సావాసం.
అంతులేని విశ్రాంతవాసం !
.
పూవు జార్చే మంచు బొట్టు..
ఆకుపై మెరిసే వెండి కిరణం..
నువ్వు లేని నాకేసి జాలిగా చూసి…
ప్రాణం విడిచాయి !
.
********