10_014

ప్రస్తావన

మానవాళిని కబళించడానికి మరోసారి వస్తోంది మహమ్మారి కరోనా వైరస్. ఇది మానవ కల్పితమా ? సహజసిద్ధంగా పుట్టుకొచ్చిందా ? మన నిర్లక్ష్యం వలన అభివృద్ధి చెందిందా అనే చర్చని ప్రక్కన పెడితే మన అలవాట్లు, జీవనశైలి మొదలైన వాటిని సమూలంగా మార్పులు చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది ఈ రెండో దశ కరోనా.

గత తరాలు తీసుకున్న జాగ్రత్తలు. ప్రకృతి పరిరక్షణ, సేంద్రీయ వ్యవసాయం వంటివి ఆరోగ్యవంతమైన జీవనశైలికి చాలావరకు కారణాలయ్యాయని చెప్పుకోవచ్చు. అవసరం మేరకే ఉత్పత్తి కూడా ఒక కారణం కావచ్చు. అప్పట్లో ఆశ ఉండేదేమో గానీ అత్యాశ ఉండి ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పట్లో కూడా వ్యాపారస్తులు, వ్యాపారాలు ఉండేవి. అయితే వ్యాపారం ఒక వృత్తి గా మాత్రమే ఉండేది. కానీ తరువాతి కాలంలో క్రమంగా ఆశ పెరిగి అత్యాశ అయింది.

ప్రజల జీవనశైలి కూడా మార్పులు చెందింది. ఒకప్పుడు ఎంత దూరమైనా నడిచి వెళ్ళేవారు. కాశీ మజిలీ కూడా నడకలోనే. తర్వాత సైకిల్ వచ్చింది. వేగం పెరిగింది. అప్పట్లో సైకిల్ ఉండటమే గొప్పగా ఉండేది. తర్వాత మోటార్ సైకిల్, స్కూటర్లు ఆ స్థానాన్ని ఆక్రమించాయి. కార్లు కేవలం ఉన్నత స్థాయి వారికే పరిమితమై ఉండేవి. ఇప్పుడు బ్యాంక్‌లోన్‌ల పుణ్యమా అని మధ్య తరగతి వారు కూడా కారు కొనుక్కుంటున్నారు. నడక, సైకిల్ తొక్కడం వలన వ్యాయామం జరిగి ఆరోగ్యం బాగుండేది. మోటార్ సైకిల్, స్కూటర్, కార్ల కాలం వచ్చేసరికి వ్యాయామం తగ్గిపోయింది. చిన్నపాటి దూరానికి కూడా నడక తగ్గించేశారు. దీనివలన పోషకాలు, వ్యాధి నిరోధకత తగ్గిపోవడమే కాకుండా వాతావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం కూడా పెరిగిపోయి మరింత అనారోగ్యకారకమవుతున్నాయి.

బాక్టీరియాలు, వైరస్‌లూ అప్పుడూ ఉన్నాయి…. ఇప్పుడూ ఉన్నాయి. అప్పుడు మనకి ఉన్నది వాటిని తట్టుకునే శక్తి. ఇప్పుడు లేనిది ఆ శక్తే. దీనికి ముఖ్యమైన కారణాలు జీవన శైలిలో వచ్చిన మార్పులు, పర్యావరణంలో, వాతావరణంలో వచ్చిన మార్పులు. గతంలో కూడా కరోనా లాంటి మహమ్మారులు వచ్చాయి. అయితే అవి ప్రపంచమంతా చుట్టేయలేదు. ఏవో కొన్ని దేశాలలోనూ, కొన్ని ప్రాంతాలలోను మాత్రమే ప్రభావం చూపాయి. అయితే గత సంవత్సర కాలంగా ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అంతటినీ వణికిస్తోంది.

ఆఫ్రికా, ఆసియా దేశాలలో కంటే శుభ్రతలో చాలా ముందు ఉంటామని చెప్పుకునే ఐరోపా, అమెరికా దేశాలలో ఈ మహమ్మారి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. చాలామందిని బలి తీసుకుంది. అస్సలు శుభ్రత అనేది ఉండదని తేలికగా చూసే దేశాలే ఈ మహమ్మారిని తట్టుకుని నిలబడ్డాయి. పైగా మన దేశం మరింత ముందడుగు వేసి ప్రపంచానికంతటికీ ఈ మహమ్మారిని తట్టుకునే వజ్రాయుధాన్ని అందించింది. అందుకే అన్నారు అతి సర్వత్ర వర్జయేత్ అని. అతి శుభ్రం కూడా ప్రాణాంతకమే ఒక్కొక్కసారి. అభివృద్ధిలోనూ, సాంకేతికత లోనూ, నాగరికత లోనూ ముందున్నామని చెప్పుకునే దేశాల పరిస్థితి ఇది. అందుకే అన్నిటిలోనూ అధికులమని గర్వం పనికిరాదని మన పెద్దలు చెబుతారు.

కానీ మనం మనవైన పద్ధతులని, అలవాట్లనీ కొనసాగించకుండా పాశ్చాత్య దేశాలను అనుకరించడానికి ప్రయత్నించడం వలన కొంతవరకైనా ఈ మహమ్మారి ప్రభావం చూపించింది. అయితే ప్రజలు వెంటనే అప్రమత్తం అయి కొంతకాలమైనా శుభ్రత పాటించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చెయ్యడం వలన ప్రభావం కొంత తక్కువే అయిందని చెప్పవచ్చు. కానీ తగ్గుముఖం పట్టిందని తెలియగానే మళ్ళీ మామూలు స్థితిలోకి వెళ్లిపోవడం చూస్తున్నాం. అది మళ్ళీ క్రొత్తగా కోవిడ్ క్రొత్త రూపాన్ని ఆహ్వానించడమే. జీవన సమరం కోసం తప్పనిసరి అయినా, జీవన శైలి మార్చుకోవడం అంతకంటే ముఖ్యమని అందరూ గమనించాలి.  

**********************************      

కృతజ్ఞతలు : ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి.  

ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.

మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించవచ్చును.

Please Subcribe & Support

మీ చందా Google Pay UPI id : sirarao@okaxis ( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

 

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )

or Click here –> paypal.me/sirarao

********************************************************

*********************************

Please visit

సాహిత్య శారదీయం – శిరాకదంబం పేజీ

1. బృహదారణ్యకం

2. మహా మత్స్య – ఉపనిషత్కథ

3. అగ్నిరూపం

4. అను ష్ఠానం

5. అగ్ని మీళే పురోహితం

**********************************

ప్రకృతి ఒడిలో ‘ బడి ‘ గురించి పరిచయ వీడియో. పూర్తి కథనం త్వరలో