10_015 హోళికా పూర్ణిమ

.

ఫాల్గుణ మాసపు పూర్ణిమకు “ హోళికా పూర్ణిమ ” అని పేరు. దీనినే ‘ హోలీ ’ అనే పేరుతో పండుగగా జరుపుకుంటాము. దీనికే ‘ కామదహనము ’ అని కూడా పేరు. ఈ పండుగ జరుపుకోవడానికి కారణంగా చెప్పుకునే కొన్ని పురాణ గాథలలో ఒకటి – ప్రహ్లాదుని విష్ణుభక్తిని సహించలేక అతని తండ్రి అనేక క్రూరమైన శిక్షలకు గురి చేస్తాడు. దేనికీ ప్రహ్లాదుడు చలించకపోవడంతో తన సోదరి అయిన హోళికతో ప్రహ్లాదుడిని తన ఒడిలో ఉంచుకొని అగ్నిలో కూర్చొనమని అంటాడు హిరణ్యకశిపుడు. హోళికకు ఉన్న వరం వలన అగ్ని ఆమెను ఏమీ చేయలేదు. కానీ చిత్రంగా ఇప్పుడు మాత్రం హోళిక దహనం అయిపోతుంది. ప్రహ్లాదుణ్ణి విష్ణువు కాపాడడంతో క్షేమంగా బయిటకు వస్తాడు.

మరొక కథనం ప్రకారం – తపస్సులో మునిగి వున్న శివుడి దృష్టిని సంసారం బంధనాల వైపు, కోరికల  వైపు మళ్లించి తపస్సును భగ్నం చెయ్యడం కోసం నియోగించబడిన మన్మథుడిని తన మూడవ నేత్రం తెరచి దహనం చేస్తాడు మహాశివుడు. అందువలన ఈరోజుకు ‘ కామ దహనం ’ అనే పేరు వచ్చింది. ఈ పండుగను మనదేశంలోని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో జరుపుకుంటారు.

.

హోలీ కి సంబంధించిన మరిన్ని విశేషాలను ఈ క్రింది వీడియో లో డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు అందిస్తున్నారు….