మానవ జీవన పరిణామ క్రమంలో గత యాభై సంవత్సరాల ( అర్థ శతాబ్ది ) కాలానికి ముందు, తర్వాత గా విడదీసి విశ్లేషిస్తే దాదాపు అన్ని రంగాలలో పెను మార్పులు సంభవించాయి. అది కూడా చాలా వేగంగా అని చెప్పవచ్చు.
ప్రాచీన కాలంలో మానవుడికి ప్రయాణ సాధనం తన కాళ్ళే. తరువాత క్రమంగా జంతువులని మచ్చిక చేసుకుని ప్రయాణ సాధనాలుగా ఉపయోగించాడు. తరువాత బళ్ళు తయారు చేసుకున్నాడు. అక్కడినుంచి మరింత వేగంగా ప్రయాణం చెయ్యడానికి యంత్రాలను తయారుచేసుకున్నాడు. ఫలితంగా కార్లు, బస్సులు, రైళ్లు, విమానాలు, ఓడలు వంటి ఎన్నో వాహనాలు వచ్చాయి.
ఆయా వాహనాలు కూడా అవసరాన్ని బట్టి వేగం, సౌకర్యాలను పెంచుకుంటూ పోయాయి. అర్థ శతాబ్ది క్రితం బస్సు బయిల్దేరడానికి ఇప్పటిలా ఒక బటన్ నొక్కితే బయిలు దేరే పరిస్థితి ఉండేది కాదు. బస్సు ముందు వైపు ఉండే రేడియేటర్ దగ్గర ఒక ఇనుప కడ్డీ పెట్టి తిప్పితే ఇంజన్ పనిచేసేది. తర్వాత బ్యాటరీ తోడు రావడంతో ఆ కష్టం తప్పింది.
ఇలాగ ప్రతి రంగంలో మార్పులు రావడం 19, 20 శతాబ్దులలో ప్రారంభమైనా గత అర్థ శతాబ్దిలో చాలా వేగవంతమైందని చెప్పవచ్చు. నలుపు తెలుపు లోనే సినిమాలు చూడడానికి అలవాటయిన ప్రేక్షకులకు రంగులు పరిచయం అయ్యాయి. సినిమా స్కోప్ లు, పెద్ద తెరలు వచ్చాయి. ట్రిక్ ఫోటోగ్రఫి పేరుతో స్క్రీన్ మీద మాయాజాలం చెయ్యడానికి ఛాయాగ్రహక దర్శకుడితో బాటు ఇతర విభాగాల వారు కూడా చాలా శ్రమించవలసి వచ్చేది. కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్ల అభివృద్ధి జరిగి అంతకు పదింతలు మాయాజాలం సులువుగా తయారవుతోంది. ఫిల్మ్ పోయి డిజిటల్ పద్ధతి వచ్చి చాలా సమయాన్ని, ఖర్చుని ఆదా చేసింది. ప్రదర్శన కూడా చాలా సులువుగా అవుతోంది. ఒకప్పుడు గ్రామఫోన్, మట్టి ( గ్రాఫైట్ ) రికార్డులలో పాటలు వినే దశనుండి టేప్ రికార్డర్లు, సిడి లు, డివిడి లు, మ్యూజిక్ ప్లేయర్లు వంటి ఎన్నెన్నో ఆవిష్కరణలు జరిగి ప్రస్తుతం మొబైల్ ఫోన్లలోనే పాటలు వినడం, సినిమాలు చూడడం వంటివెన్నో చెయ్యగలుగుతున్నాము. దేశ విదేశాల వార్తలను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ చూడగలుగుతున్నాము. ఫోన్ల ప్రస్థానం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాగ అన్ని రంగాలలో చాలా వేగంగా అభివృద్ధి జరుగుతోంది.
ఒకప్పుడు అమెరికా వెళ్లడమే ఒక అద్భుతం. అలాంటిది ఇప్పుడు అమెరికా వెళ్ళిరావడమంటే ప్రక్క రాష్ట్రానికి వెళ్ళి వచ్చినట్లే. అంతగా ప్రయాణ సౌకర్యాలు వచ్చాయి. ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళతో మాట్లాడాలంటే చాలా కష్టపడవలసి వచ్చేది. ఇప్పుడు వీడియో కాల్ లో వాళ్ళని చూస్తూ మాట్లాడుకోవచ్చు. ప్రపంచం చాలా చిన్నదై పోయిందా అనిపించే విధంగా పరుగెడుతోంది సాంకేతిక అభివృద్ధి. మూడు దశాబ్దాల క్రితం విదేశీ వస్తువులంటే చాలా అపురూపం. నల్ల బజారు లోనే దొరికేవి. కొనడానికి, వాడడానికి కూడా భయపడేవారు. ఇప్పుడు స్వేచ్చా విపణి. ఏ దేశం సరుకైనా మన దేశంలో కూడా బహిరంగ మార్కెట్లో దొరుకుతోంది.
ఇంత అభివృద్ధి ఇంత వేగంగా జరిగి మనిషి సౌకర్యవంతంగా బ్రతికే పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ మనిషిలో మానవత్వం కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చెందిందా అంటే అనుమానమే ! సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలోని మనుష్యులు దగ్గర అవుతున్నారు. అదే సమయంలో అనేక క్రొత్త క్రొత్త మోసాలు పుట్టుకొస్తున్నాయి. కొంతమంది తమకు కావల్సినవి అమర్చుకోవడానికి కష్టపడటానికి ఇష్టపడటం లేదు. తమ మేధస్సుని ప్రపంచానికి పనికి వచ్చే పనులు చెయ్యడానికి ఉపయోగించకుండా ప్రజల్ని మోసగించి, ఏమార్చి సులువుగా డబ్బు సంపాదించడానికి ఉపయోగిస్తున్నారు. ఇంతకుముందు మెయిల్ ఐడి లను, ఫేస్‌బుక్ లాంటి మాధ్యమాల ఖాతాలను హాక్ చేసేవారు. దానికి సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరి. ఇప్పుడు అది లేని వాళ్ళు కూడా క్రొత్త మార్గం కనుక్కున్నారు. అదే ఫేక్ ఖాతాలు. ముఖ్యంగా ఫేస్‌బుక్ లో ఇప్పుడు ఈ బెడద చాలా తీవ్రం అవుతోంది.
ప్రపంచం సాంకేతికంగా ఎంత ప్రగతి సాధిస్తోందో మనిషి మేధ అంత కుంచించుకు పోతోందేమో అనిపిస్తోంది. మారణహోమం సృష్టించే వాటి మీద కొన్ని దేశాలు, కొంతమంది శాస్త్రవేత్తలు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ప్రతి దానికి విరుగుడు ఉంటుందనే విషయం ఎవరూ గుర్తు పెట్టుకోవడం లేదు. శత్రువు మీద క్రొత్త ఆయుధంతో దాడి చేస్తే, తిరిగి అంతకంటే శక్తివంతమైన ఆయుధాన్ని కనుగొని దాడి చేసే అవకాశం ఉందనే విషయం గమనంలో పెట్టుకుంటే మారణహోమం ఉండదేమో ! మనిషి తన మేధస్సును మానవాళి పురోగతికి, వికాసానికి ఉపయోగిస్తే ప్రపంచమంతా శాంతి సౌభాగ్యాలతో విలసిల్లుతుంది.
.
కృతజ్ఞతలు : ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ఇప్పటికే ‘ శిరాకదంబం ’ చందాదారులుగా చేరిన… క్రొత్తగా చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి వివరాలు –
19. శ్రీ&శ్రీమతి దుర్గ-శ్రీనివాస్ డింగరి, అమెరికా – జీవితకాలం – $. 150/-
.
చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి.
ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.
.
మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించవచ్చును.
Please Subscribe & Support
మీ చందా Google Pay UPI id : sirarao@okaxis ( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.
అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.
వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com
‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –
Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )
or Click here –> paypal.me/sirarao
********************************************************
*********************************
Please visit
సాహిత్య శారదీయం – శిరాకదంబం పేజీ
**********************************
ప్రకృతి ఒడిలో ‘ బడి ‘ గురించి పరిచయ వీడియో…. పూర్తి కథనం త్వరలో…