10_016 ప్లవ రాశి ఫలాలు

 

మేషరాశి:

ఈ సంవత్సరమంతయు మంచిచెడు మిశ్రముగా ఉండును. ఆదాయమునందు వృద్ధి ఉండును, కాని ఖర్చుకూడ ఎక్కువగానే ఉండును. ఆరోగ్యము చికాకు పరుచును. కవులు, చిత్రకారులు, సంగీతనాట్యకళాకారులకు వారి ప్రతిభను ప్రదర్శించుకొనుటకు చక్కని అవకాశము లభించును. ప్లిు చదువులందు, ఆటపాటలందు చక్కని నైపుణ్యమును కనబరిచెదరు. సోదరులకు సంబంధించిన విషయముపట్ల దృష్టి సారించవలసి వచ్చును.  వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా దగ్గఱ ప్రయాణము చేయవలసి ఉండును. చెల్లెలి వివాహమై ఇల్లు వీడును. పిక్కకు, పాదముకు సంబంధించిన చికాకు ఉండును. నరముల ఒత్తిడికి లోనగుదురు. యుక్తవయస్సులో ఉన్నవారికి వివాహమునకు మంచి కాలము. వివాహమైనవారికి భార్యవలన ఖర్చు పెరుగును. విషజంతువువలన ప్రమాదముండును. వాహనము నడుపు సమయమున జాగరూకతతో ఉండవలెను. గురువులయొక్క, పెద్దలయొక్క కృప ఉండును. వృత్తివ్యాపారములో అభివృద్ధి చెందుటకు మంచి అవకాశము లభించును. ఆ విషయమున మీ స్నేహితులు గాని, మీకన్న వయస్సులో చాలా పెద్దవారైన వారుగాని మీకు సహాయము చేసెదరు. పరిపాలన, బంగారు వర్తకము, నటనవంటి రంగముందు ఉన్నవారికి శుభ సమయము. కాని పూర్వము చేసిన చెడ్డ పనులవలన కొందరికి న్యాయస్థానములందు శిక్ష పడును. వాటి పరిహారమునకై తీర్థయాత్రలు చేయుట మంచిది. కెంపు ధరించుటవలన మేలు కలుగును. ఆదిత్యహృదయము పఠించుట, శివుని, ఆంజనేయుని పూజించుట శుభము కలుగజేయును.

              2021 మార్చి 20 నుండి ఏప్రిల్‌ 19 వరకు: ఖర్చు ఎక్కువగా ఉండును. వ్యాపారము అభివృద్ధి చెందును. కానీ అప్పులు చేయవలెను. భార్య ఆరోగ్యవిషయమై శ్రద్ధ వహించ వలెను. భార్యాభర్త సంబంధమందు ఒడిదుడుకు ఉండును.

              2021 ఏప్రిల్‌ 20 నుండి మే 20 వరకు: చిన్నచిన్న ప్రయాణములు, వ్రాతకోతలు ప్రాముఖ్యము వహించును. ధనార్జనకు అనేక అవకాశము కనిపించును. కాని ఖర్చుగాని, అప్పుగాని ఇబ్బంది పెట్టవచ్చును. ఇంటియందు కొంత సామరస్యవాతావరణము ఉండునుగాని చిన్న చిన్న అనారోగ్యము దానిని పాడుచేయును.

              2021 మే 21 నుండి జూన్‌ 20 వరకు: గతనెల మధ్యనుండి ఇంటిలోని వాతావరణము చికాకుగానున్నది. అది ఈ నెలకూడా కొనసాగును. ఆదాయము బాగుండును. వ్యయము అవసరమైనవాటికి, ధర్మకార్యముకు ఖర్చు చేసెదరు.

              2021 జూన్‌ 21 నుండి జూలై 21 వరకు: మీకన్న వయస్సున పెద్దవారైనవారు మీకు సహాయము చేసెదరు. తీర్థయాత్రలు, దూరప్రయాణము చేయుదురు. ఆదాయమునందు ఒడిదుడుకు ఉండును. వృత్తివ్యాపారముందు అభివృద్ధి ఉండును.

              2021 జూలై 22 నుండి ఆగష్టు 22 వరకు: సొంత ఇల్లు ప్రయత్నము అవాంతరములతో ముందుకు సాగును. మీ ప్రయత్నము బట్టి ఇంటిలో సుఖసంతోషములు ఉండును. రాబడి విషయమున ఇబ్బందులు ఉండును.

              2021 ఆగష్టు 23 నుండి సెప్టెంబరు 22 వరకు: కుటుంబపరమైన ఖర్చులు ఉండును. రాబడిలో ఒడిదుడుకులు ఉండును. ఋణబాధ, రోగబాధ పీడించును. కొంతమందినుండి మాటలు పడుటవలన మనస్సు చికాకు పడును.

              2021 సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 22 వరకు: ఇంటిలోని వాతావారణము సుఖకరముగా ఉండదు. భార్యాభర్తలమధ్య విభేదములు కలిగి ఆరోగ్యము పాడగును.

              2021 అక్టోబరు 23 నుండి నవంబరు 21 వరకు: ఈ నెల ధనాదాయము బాగుండును. వివాహ ప్రయత్నములు ఫలించును. దూరప్రయాణములు చేయగలరు. ఆధ్యాత్మికసాధన చక్కగా సాగును.

              2021 నవంబరు 22 నుండి డిసెంబరు 20 వరకు: ఈ మాసము మీకు శుభమైన మాసము. అటు ఆధ్యాత్మికసాధన, ఇటు భౌతికమైన కార్యక్రమములు కూడ చక్కగా సాగును. చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నను అవి తేలిపోవును.

              2021 డిసెంబరు 21 నుండి 2022 జనవరి 19 వరకు: నూతనసంవత్సరములోనికి మీరు ఉత్సాహముగా ప్రవేశించెదరు. అనేక అవకాశములు మీ ముందు నిలుచును. ఇంటిలోని వాతావరణము సానుకూలముగా ఉండును. గృహనిర్మాణ ప్రయత్నములు, ఉద్యోగ ప్రయత్నములు ఫలించును.

              2022 జనవరి 20 నుండి ఫిబ్రవరి 17 వరకు: క్రొత్త రంగములలోనికి అడుగుపెట్టుటకు, క్రొత్త వ్యాపారములు ప్రారంభించుటకు మంచి సమయము. నూతన ప్రణాళికలతో మీరు ముందుకు వెళ్ళుటకు ధైర్యము చేసెదరు.

              2022 ఫిబ్రవరి 18 నుండి మార్చి 19 వరకు: వృత్తివ్యాపారములు అభివృద్ధి చెందును. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించును. ఆర్థికలాభము ఉండును. వివాహ ప్రయత్నములు సఫలమగును. వ్యయము ఎక్కువగా ఉండును.

 

వృషభరాశి:

              ఈ సంవత్సరమంతయు మీకు శుభముల పరంపర కొనసాగును. కాని వృత్తి వ్యాపారము లందు కొన్ని అనుకోని అవాంతరములు కలుగును. ఓపికతో వ్యవహరించినచో వాటిని మీరు దాటెదరు. కాని వాటి కారణమున ఆరోగ్యము దెబ్బ తినును. సంవత్సరము ప్రారంభమందు ఈ పరిస్థితి ఎక్కువగా ఉండును. తరువాత సర్దుకొనును.  కళాకారులు తమ తమ రంగము లందు క్రొత్త ఒరవడులను సృష్టించుటగాని, అవలంబించుటగాని జరుగును. ఇల్లు కట్టుబడికి గాని, ఇంటిని అధునాతనముగా తీర్చిదిద్దుటకు గాని, వాహనము సమకూర్చుకొనుటకుగాని ధనము వ్యయము చేయవలసి వచ్చును. పిల్లలు బుద్ధిమంతలు, తెలివైనవారు అయినను వారివలన చికాకులు కలుగును. వివాహప్రయత్నములు కలసి వచ్చును. భార్యవలన ధనము కలసివచ్చును గాని ఖర్చుకూడ ఉండును. ఔషధరంగమందు, పరిశోధనరంగమందు ఉన్నవారికి అన్నివిధముల లాభించెడి కాలము. ఉద్యోగస్థులు కోరిన చోటికి బదిలీపై గాని, పదోన్నతిపై గాని వెళ్లెదరు. సేవాకార్యక్రమములందు పాల్గొనుటవలన క్రొత్త పరిచయము లేర్పడి, అవి స్నేహముగా వృద్ధి చెందును. దానివలన సాంఘికజీవనమందు పురోభివృద్ధి ఉండును. దీర్ఘకాలము కొనసాగెడి ఉపయోగకరమైన కార్యక్రమమును ప్రారంభించెదరు. ఆధ్యాత్మికజీవనమునందు గురువుయొక్క సాన్నిధ్యము లభించును. అమ్మవారిని ఆరాధించుట మేలు కలిగించును. వజ్రము, నీలము ధరించుట మంచిది.

              2021 మార్చి 20 నుండి ఏప్రిల్‌ 19 వరకు:  ఇల్లు కొనుటకుగాని, మార్పు జేయుటకు గాని ఖర్చు ఉండును. శుభ కార్యముల కొఱకు బంగారము కొనుటకై ధనము వ్యయము చేసెదరు. ఏప్రిల్‌ మొదటి రెండువారములందు ఆరోగ్యవిషయమున జాగ్రత్తగా ఉండవలెను.

              2021 ఏప్రిల్‌ 20 నుండి మే 20 వరకు: ఈ నెల మొత్తము మీరు అభివృద్ధి చెందుటకు, వికాసము పొందుటకు అనేక అవకాశములు వచ్చును. ధనాదాయము బాగుండును. వ్యాపారము విస్తరించును. కాని అందుకొఱకు ఖర్చు చేయవలసి వచ్చును. కుటుంబమునందుకూడ ఖర్చు ఉండును.

              2021 మే 21 నుండి జూన్‌ 20 వరకు: ఈ మాసము అన్నివిధముగా మీకు బాగుండును. ఎక్కువగా శ్రమపడినచో మాత్రము ఆరోగ్యము దెబ్బతినును. ఆ విషయమై మీరు జాగ్రత్త వహించవలెను. ధనాదాయము బాగుండును.

              2021 జూన్‌ 21 నుండి జూలై 21 వరకు: వృత్తివ్యాపారముందు క్రొత్త అవకాశము వచ్చును. నూతన ఆలోచనకు, ప్రణాళికలకు రూపకల్పన జరుగును. కార్యాచరణ పొందును. అవి దీర్ఘకాము సాగునవిగా ఉండును. కాని భాగస్వాముతో చికాకులు ఉండును. ఇంటియందు వాడిగా, వేడిగా భిన్నాభిప్రాయములు వ్యక్తమగును.

              2021 జూలై 22 నుండి ఆగష్టు 22 వరకు: పుస్తకప్రచురణ, పత్రికారచనద్వారా ధనము సంపాదించెదరు. చిన్నవైనను, పెద్దవైనను ప్రయాణములు కలిసిరావు. ఇంటియందు శుభకార్యములు జరుగును.  ప్రణయవ్యవహారములకు దూరముగా ఉండుట మంచిది. వృత్తియందు బాధ్యత పెరుగును. 

              2021 ఆగష్టు 23 నుండి సెప్టెంబరు 22 వరకు: పిల్లలు ఆటపాటలలో ప్రతిభ చూపించెదరు. రచన, శిల్పము, యంత్ర నిర్మాణమువంటి వాటిలో మీ ప్రతిభను ప్రదర్శించు అవకాశము వచ్చును. ప్రణయవ్యవహారములందు చిక్కుకొందురు. మీకు వ్యతిరేకముగా ఉన్నవారుకూడ మీకు సహాయము చేయవలసివచ్చెడి పరిస్థితులు ఏర్పడును.

                2021 సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 22 వరకు: ఖర్చు ఎక్కువగా ఉండును. ఆరోగ్యము పట్ల శ్రద్ధ వహించవలెను. పని ఒత్తిడి ఉండును. చిన్న చిన్న ప్రయాణముల వలనకూడా ఆరోగ్యము దెబ్బతినును. మీరు అనుకున్నపనులు అనుకున్నవిధముగా జరుగవు. ఆ చికాకును జయించవలెను.

                2021 అక్టోబరు 23 నుండి నవంబరు 21 వరకు: ఈ మాసము మీరు కొంచెము శ్రమించవసిన మాసము. మీకు కావలసిన ధనము, ఇతర వనరులు ఉన్నను, పనులు జరుగుట యందు ప్రయాస పడవలసి వచ్చును. ఖర్చు ఎక్కువగును. వివాహప్రయత్నము వాయిదా వేయుట మంచిది.

               2021 నవంబరు 22 నుండి డిసెంబరు 20 వరకు: ప్రణయవ్యవహారము కొన్ని చిన్న చిన్న అడ్డంకులను దాటి వివాహమునకు దారి తీయవచ్చును. మీ పథకము, ప్రణాళికలు ఇతరుల మెప్పు పొందును. దూరప్రయాణము చేయగలరు. ఆధ్యాత్మికసాధన చక్కగా సాగును. ఆరోగ్యము మాత్రము జాగ్రత్తగా చూసుకొనవలెను.

             2021 డిసెంబరు 21 నుండి 2022 జనవరి 19 వరకు: దూరప్రయాణము, విదేశయానము సూచించ బడుచున్నవి. భార్య ఆరోగ్యము చికాకు పరచును. ఉద్యోగము నందు, వృత్తివ్యాపారముందు కొన్ని నష్టము చవిచూసెదరు. వివాహము వాయిదా వేయుట మంచిది. పోటీపరీక్షలందు విజయము లభించును. ఖర్చు నియంత్రించుకొనవలెను.

             2022 జనవరి 20 నుండి ఫిబ్రవరి 17 వరకు: ముందువెనుక ఆలోచించక ఖర్చు చేసెదరు. భాగస్వాముల వలన నష్టము కుగును. ఆరోగ్యముపట్ల శ్రద్ధ వహించ వలెను.

             2022 ఫిబ్రవరి 18 నుండి మార్చి 19 వరకు: రాబోవు క్రొత్త ఉగాది ముందు కొన్ని ముఖ్యమైన మార్పు చోటు చేసుకొనును. అవి చాల మటుకు మీకు ఉపకరించునవి అగును. దూరప్రయాణము, విదేశయానము చేయగలరు. విదేశీ ఉద్యోగములు లభించును. స్నేహితులు సహకరించెదరు. ఆధ్యాత్మికసాధన చక్కగా సాగును.

 

మిథునరాశి:

              ఈ రాశివారికి అనారోగ్యసమస్యలు కాని, ఋణబాధలుగాని చికాకు పరచును. మిత్రులనుకున్నవారు కూడ ఇబ్బందులకు గురిచేసెదరు. కాని అధికారములో ఉన్న కొంతమంది మిత్రుల సహకారము లభించుటవలన కొంత ఉపశమనము కలుగును. వారిలో కొందరు స్త్రీలు ఉందురు. భార్య ఆరోగ్యముకూడా చికాకు పరచును. అందుమూలమున ఖర్చుకూడ పెరుగును. కాని గురువు అనుగ్రహముచే పరిస్థితలు అన్నియు చక్కబడును. వ్యాపారములందు పెట్టుబడులు పెట్టు విషయమునగాని, ధనము మదుపు చేయు విషయమున గాని నష్టము చవిచూసెడి అవకాశమున్నది. మీ ఆలోచనలు, ప్రణాళికలు సక్రమముగానే ఉన్నను, బాహ్యమైన ఇతర కారణములవలన, మీ పోటీదారులవలన ఇబ్బందులు కలుగును. దానికి తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. ఉద్యోగములలో ఉన్న వారికి బదిలీలకు, పదోన్నతులకు అవకాశము కలదు. ఉద్యోగరీత్యా విదేశయానము చేయు అవకాశము ఉన్నది. ఉద్యోగార్థులకు విదేశములందు ఉద్యోగములు లభించగలవు. వివాహప్రయత్నము సఫలమగును. కొంతమంది కులాంతర, మతాంతర వివాహములు చేసికొనెదరు. పిల్లలు లలితకళలందు రాణించెదరు. సాయనవర్షలగ్నము ఈ రాశియందు పడుటవలన వీరిలో కొందఱికి జీవితములో ముఖ్యమైన చిన్నచిన్న మార్పులు చోటు చేసుకొనును. ఇది రాజకీయనాయకులు, కంపెనీ అధిపతుల విషయములో ఎక్కువగా కనిపించును. ఈ రాశివారు శివునిగాని, వేంకటేశ్వరునిగాని పూజించినచో సకల శుభములు కలుగును. నీలము ధరించవలెను.

              2021 మార్చి 20 నుండి ఏప్రిల్‌ 19 వరకు: స్నేహితుల సహకారము లభించును. ధనాదాయము బాగుండును. మీ మాటలలో విమర్శపాలు హెచ్చగును. దానిని నియంత్రించుకున్నచో మంచిది. లేనిచో అది ఆరోగ్యముపై ప్రభావముచూపును.  

              2021 ఏప్రిల్‌ 20 నుండి మే 20 వరకు: ఈ నెల ఆధ్యాత్మికసాధనమీద దృష్టి పెట్టుట మంచిది. దూరప్రయాణము, తీర్థయాత్రలు చేయగలరు. ఖర్చు ఎక్కువ గానే ఉండును. విలాసములకు, ఇంటికొఱకు ఖర్చు చేయుదురు.      

                 2021 మే 21 నుండి జూన్‌ 20 వరకు: వృత్తివ్యాపారములు అభివృద్ధి చెందును. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించును. ఇంటియందు సుఖకరమైన వాతావరణము ఉండును. ధననష్టము సూచించబడుచున్నది కనుక అనవసరమైన అప్పు, చేబదుళ్ళు చేయుట మంచిదికాదు. 

              2021 జూన్‌ 21 నుండి జూలై 21 వరకు: ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకొనవలెను. మూత్రసంబంధమైన వ్యాధులు రావచ్చును. గర్భిణులు జాగ్రత్తగా ఉండవలెను. ఉమ్మ నీరు సమస్యలు రావచ్చును. ఇతరవిషయములందు ఈ మాసము మీకు శుభముగా ఉన్నది.

              2021 జూలై 22 నుండి ఆగష్టు 22 వరకు: మీకుగాని, మీ ఇంటిలోవారికి గాని ఆరోగ్యము తేడా చేయును.  మీరు చేయు ప్రయత్నము ఎక్కువ శాతము ఫలించును. కాని ఇంటియందు ఆడువారిమూలముగా చిన్న చిన్న విభేదములు కలుగును. వృత్తివ్యాపారములందు అభివృద్ధి ఉండును.

              2021 ఆగష్టు 23 నుండి సెప్టెంబరు 22 వరకు: ఇంటిలో సందడి వాతావరణము ఉండును. మిత్రులు, బంధువులు వచ్చెదరు. చిన్న చిన్న విభేదములు ఉండును. పిల్లల కొఱకు, మీ అభిరుచుల కొఱకు ఖర్చు పెట్టెదరు. దూరప్రయాణములు, విదేశయానములు చేయు అవకాశమున్నది.

              2021 సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 22 వరకు: మీ ప్రణాళికకు సరైన రూపమునిచ్చినచో మీ ధనాదాయము బాగుండును. చాలా పనులు చేయవలెనని ఆలోచనలు చేయుదురు. కాని వానిలో కొన్ని సాధ్యము కానివని గుర్తించుట ముఖ్యము. ఆరోగ్యముపట్ల శ్రద్ధ వహించవలెను.

              2021 అక్టోబరు 23 నుండి నవంబరు 21 వరకు: ఖర్చు ఎక్కువగా ఉండును. వానిలో కొన్ని ప్రయోజనకరమైనవి ఉండును. పిల్లల ప్రతిభ ప్రదర్శించెదరు. వివాహప్రయత్నము ఫలించును. దూరప్రయాణము చేయుదురు. వృత్తివ్యాపారముందు స్థానచలనము ఉండును. 

              2021 నవంబరు 22 నుండి డిసెంబరు 20 వరకు: మీ మనస్సులో ఉన్న ఆలోచనను ఆచరణలో పెట్టుటలో ఇబ్బందులు కలుగును. ఖర్చులు ఎక్కువగును. మీ భాగస్వాములు, మీతోటి వారు మీమీద అధికారము చెలాయించుటకు ప్రయత్నము చేసెదరు. పిల్లల ఆరోగ్యముపట్ల శ్రద్ధ వహించవలెను. ఇంటికి సంబంధించిన విషయములకై అప్పు చేయవలసి వచ్చును.

              2021 డిసెంబరు 21 నుండి 2022 జనవరి 19 వరకు: గతనెలతాలూకు కాలసర్పప్రభావము ఈ నెలలో మీకు కనిపించును. ధనాదాయము బాగున్నను, అనేకరకములైన చికాకులను, ఖర్చులను, నష్టములను ఎదుర్కొందురు. ఉద్యోగస్తులకు స్థానచలనము ఉండవచ్చును.

              2022 జనవరి 20 నుండి ఫిబ్రవరి 17 వరకు: భార్యాభర్తలమధ్య చిన్న చిన్న విభేదములు వచ్చు అవకాశమున్నది. ఖర్చులు ఎక్కువగా ఉండును. ఆరోగ్యముపట్ల జాగ్రత్త వహించవలెను. వృత్తివ్యాపారములు అభివృద్ధి చెందును.

              2022 ఫిబ్రవరి 18 నుండి మార్చి 19 వరకు: వృత్తివ్యాపారములు బాగుగా సాగును. అనారోగ్యము, ఋణబాధలు ఉండును. ఆధ్యాత్మికసాధన చక్కగా సాగును. పిల్లలపై శ్రద్ధ పెట్టవలెను. వివాహప్రయత్నములు ఫలించును. దూరప్రయాణములు, విదేశయానములు సూచించబడుచున్నవి.

 

కర్కాటకరాశి:

              ధనము ఎందుకు ఖర్చగుచున్నదో తెలియకుండా ఖర్చగుచుండును. ఏదో ఒక ప్రయాణము తగులటయో, స్నేహితులను కలియుటకు మీరు వెళ్ళటమో, వారు మీ ఇంటికి వచ్చుటయో జరుగును. అందువలన ఖర్చు పెరుగును. పిల్లలకు సంబంధించిన విషయముందుకూడ ఖర్చు తగులును. ధనాదాయము బాగుగానే ఉన్నను, ఈ ఖర్చు మిమ్ములను ఇబ్బంది పెట్టును. ఆరోగ్యముపైనకూడ మీరు శ్రద్ధ పెట్టవలెను. మీకు గల కొన్నివ్యాధులు దీర్ఘకాలము పీడించును. అయినను శని అనుకూలముగా ఉండుటవలన మీరు భయపడవలసిన అవసరము లేదు. ఇతరవిషయములెట్లున్నను మీ ఆధ్యాత్మికజీవనమున చిత్రమైన పురోగతి ఉండును. దివ్యమైన దర్శనము, పెద్దల సాంగత్యము వంటివి లభించును. కాని వానిలో మీ భ్రమలు కొన్ని కలిసి ఉండును. ఆ విషయమున జాగ్రత్త పడవలెను. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయగలరు. మీరు చేపట్టు అన్ని కార్యములందు మీ మిత్రుల సహాయ సహకారము లభించును. నూతనమైన ఆలోచనలను చేయుదురు. సంవత్సరప్రారంభములో వివాహప్రయత్నములు కలిసి రావు. వృత్తి వ్యాపారములలో అభివృద్ధి ఉండును. సోదరులకు సంబంధించిన కొన్ని విషయములు చికాకు కలిగించును. విష్ణు సహస్రనామము పఠించుట, అమ్మవారిని పూజించుట మేలు కలిగిం చును. హనుమాన్‌ చాలీసా, సుందరకాండ పారాయణము వలన విశేష ఫలితములు పొందగలరు. వజ్రము, కెంపు ధరించుట మంచిది.

              2021 మార్చి 20 నుండి ఏప్రిల్‌ 10 వరకు: వ్యాపారాభివృద్ధికి అవకాశము లభించును. స్నేహితుల సహ కారముతో క్రొత్తపంథాను అనుసరించుటకు ప్రయత్నము చేయుదురు. ఖర్చును నియంత్రించుకొనవలెను. ఉగాది ముందు ఆరోగ్యముపై శ్రద్ధ వహించవలెను. న్యాయస్థానములందు విచారణ లున్నచో తీర్పులు మీకు వ్యతిరేకముగా వచ్చు అవకాశమున్నది.

              2021 ఏప్రిల్‌ 20 నుండి మే 20 వరకు: మనస్సున ఒత్తిడి ఉన్నచో ఆరోగ్యము చెడును. ఖర్చువిషయమై ఆందోళన పడెదరు. మీ రాబడి బాగుగానే ఉన్నను, రావలసిన ధనము ఆలస్యమగును. మీ స్నేహితులు మీకు సహాయము చేసెదరు. మీ ఆలోచనలు, ప్రణాళికలు ముందుకు సాగును.

              2021 మే 21 నుండి జూన్‌ 20 వరకు: ఈ మాసము మీకు కొంచెము చికాకుగా ఉండును. అది మానసికమైన నైరాశ్యము కావచ్చును, ఇతరులపట్ల మీకు కలిగిన రాగద్వేషములు కావచ్చును. వీటిని నియంత్రించుకొనవలెను. గురువు పాదపద్మములను ఆశ్రయించినచో చాంచల్యము సర్దుకొనును.

              2021 జూన్‌ 21 నుండి జూలై 21 వరకు: ప్రత్యేకముగా సమస్యలు ఏవీ లేకున్నను, మనస్సు ఎందుకో కొంత ఆందోళనతో నిండినట్లు ఉండును. రాబడి బాగుగానే ఉండును. సృజనాత్మకత మాత్రము కుంటుబడును. ఆరోగ్యము కుదురుగా ఉండును. వృత్తివ్యాపారములు వృద్ధి చెందును.

              2021 జూలై 22 నుండి ఆగష్టు 22 వరకు: మనస్సున ఆలోచనలు విపరీతముగా ఉండును. కొన్ని నిరాశా పూరితముగా ఉండును. మీ మీద మీకు సందేహము ఉండును. యోగము, ధ్యానము, మంత్రము, పూజ వంటి వాటి ద్వారా మనస్సును స్థిరపరచుకొనవలెను. ధనాదాయము బాగుండును. మీ కన్న చిన్నవారైన కుటుంబస్త్రీవలన సమస్యలు ఎదురగును.

              2021 ఆగష్టు 23 నుండి సెప్టెంబరు 22 వరకు: ఆధ్యాత్మికసాధన చేయువారికి ఇది మంచి సమయము. తీర్థయాత్రలు చేయుట, పెద్దలను, గురువులను దర్శించుట జరుగును. సహజముగా మీలో ఉన్న సంకోచమును విడిచి, సాహసోపేతమైన నిర్ణయములు తీసుకొనగలరు. ఇంటియందు శుభకార్యములు జరుగును. ఆరోగ్యముపై కొంత శ్రద్ధ పెట్టవలెను.

              2021 సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 22 వరకు: ఇంటిలో చికాకులు ఉన్నను, మొత్తము మీద మీకు ఈ నెల బాగుండునని చెప్పవలెను. వృత్తివ్యాపారము చక్కగా అభివృద్ధి చెందును. ఉద్యోగస్తులు కూడ శుభవార్తలు విందురు. ప్రేమవ్యవహారము ఉండును. ఆ విషయమున ఇంటియందు కొంత సానుకూత లభించును.

              2021 అక్టోబరు 23 నుండి నవంబరు 21 వరకు: మనస్సు ఉత్సాహకరమైన, ఉపయోగకరమైన ఆలోచన లతో నిండి ఉండును. మిత్రుల సహాయముతో కొన్నిటికి కార్య రూపమును ఇచ్చెదరు. ఆరోగ్యముపట్ల మాత్రము శ్రద్ధ వహించవలెను. ఇంటియందు పరిస్థితులు కొంచెము గందరగోళముగా నుండును.

              2021 నవంబరు 22 నుండి డిసెంబరు 20 వరకు: ఆర్థికపరమైన ఒత్తిడి ఉండును. అది మీ ఖర్చులు ఎక్కువగుట వలనకన్న మీవద్దనుండి సహాయము ఆశించెడివారు ఎక్కువగుట వలన జరుగును. మీ సమయమునంతటిని ఇతరులకొఱకు ఖర్చు పెట్టవలసి వచ్చును. అది మీ ఆరోగ్యముపై ప్రభావము చూపును.  వివాహప్రయత్నములు చేయవచ్చును.

              2021 డిసెంబరు 21 నుండి 2022 జనవరి 19 వరకు: ఈ నెల అనేకమందితో మీరు వ్యవహరించవలసి వచ్చును. వారిలో అన్నిరకములవారు ఉందురు. మంచివారు, చెడ్డవారు, నచ్చినవారు, నచ్చనివారు, మీకు బాకీ ఉన్నవారు, మీరు బాకీ పడినవారు, ఇంటివారు, బయటివారు అందరూ ఉందురు. కొంతమంది కారణముగా రాగద్వేషములు, కోపతాపములు పొందుదురు. కష్టనష్టములు చవిచూసెదరు. కాని వీటన్నిటిని భరించగలిగినచో మీకు వికాసము కలుగును.      

                 2022 జనవరి 20 నుండి ఫిబ్రవరి 17 వరకు: ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉండును. దానివలన ఆరోగ్యము పాడగును. వివాహప్రయత్నము సఫలమగును. ధనాదాయము బాగుండును. మీ ఖర్చులగురించిన ఆలోచనలుకూడ మీ ఆరోగ్యము మీద ప్రభావమును చూపును.

              2022 ఫిబ్రవరి 18 నుండి మార్చి 19 వరకు: మీ సహజమైన సంకోచము విడిచిపెట్టి, ధైర్యముతో, సాహసముతో పనులు చేయుదురు. ఆరోగ్యముపట్ల శ్రద్ధ వహించవలెను. వృత్తివ్యాపారములు బాగుగా సాగును. దూర ప్రయాణములు, విదేశయానములు, తీర్థయాత్రలు చేయగలరు. 

 

సింహరాశి:

              ఈ రాశివారికి గతసంవత్సరము కొన్ని మంచి అవకాశములు వచ్చినవి. ఈ సంవత్సరముకూడ అటువంటి పరిస్థితియే ఉన్నది. జీవితమున ముఖ్యమైన మార్పులు కొన్ని చోటు చేసుకొనును. వాటిని సక్రమముగా ఉపయోగించుకోగలిగిన వారికి మేలు కలుగును. ఆధ్యాత్మికసాధనలో ఉన్నవారికి ఉగాది సమయమునందు దీక్షలు తీసుకున్నచో మంచిది. వృత్తి వ్యాపారములలో ఉన్నవారికి చిన్న చిన్న ఒడిదుడుకులు కనిపించును. కాని అవి తీరుటకు మార్గముకూడ ఉండును. ఒత్తిడికి లోనైనచో మాత్రము ఆరోగ్యము దెబ్బతినును. రాబడియందుకూడ కొద్ది హెచ్చు తగ్గులుండును. ఋణదాతనుండి ఒత్తిడి ఎక్కువగును. సోదరులు వృద్ధి చెందుదురు కాని వారికొఱకు మీరు ఖర్చు పెట్టవలసిన అవసరము వచ్చును. పిల్లలకు చెడు సహవాసము పట్టకుండా జాగ్రత్త పడవలెను. ఇంటియందుకూడ ఖర్చుతో కూడిన సుఖమైన వాతావరణము ఉండును. విష్ణు సహస్రనామపారాణము చేయుట, ఆదిత్యహృదయమును చదువుట చేయవలెను. కెంపు ధరించుట మేలు చేయును. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు సముద్రతీరమున ఉన్న ఆలయములందుగాని, ఏకాంతప్రదేశములందుగాని సాధన చేసినచో శీఘ్రఫలితముండును. అట్లు చేయలేనివారు ధనరూపమునగాని, వస్తురూపమునగాని దానము చేయుటద్వారా, వైద్యసేవయందు పాల్గొనుటద్వారా శుభఫలితములను పొందగలరు.

                 2021 మార్చి 20 నుండి ఏప్రిల్‌ 20 వరకు: ఈ సంవత్సరమునకు ప్రతిబింబముగా ఈ మాసము ఉండును. అందువలన రాబడి యందు హెచ్చుతగ్గు, ఖర్చు అధికమగుట జరుగును. కాని సాధనలో ఉన్నవారికి ఆధ్యాత్మికవికాసము కలుగును. సృజనాత్మకరంగము, కళారంగమునందు ఉండువారు, బ్యాంకు వంటి ఆర్థికసంస్థలందు పనిచేయువారు, నిర్వహించువారు, వైద్యవృత్తిలో ఉన్నవారు, బంగారము, నగలు వ్యాపారులు అభివృద్ధి చెందుదురు. చేతిలో ఉన్న పని మానకుండానే వేరే విధమైన ఆదాయమార్గమును అన్వేషించుట మేలు కలుగ జేయును. ఉగాది ప్రాంతమునందు మీకు క్రొత్త అవకాశములు వచ్చును. పరిచయములు ఏర్పడును. కొన్ని ప్రయాణము తగును. ఇవన్నియు మీకు రాబోవుకాలమున మేలు చేయగలవు. మీ ఆరోగ్యముపట్ల, మీ భార్య ఆరోగ్యముపట్ల కొంత శ్రద్ధ వహించవలసి యుండును.

                 2021 ఏప్రిల్‌ 21 నుండి మే 20 వరకు: అనుకోని ఖర్చు ఉండును. అయినను రాబడి బాగుగానే ఉండును. వృత్తి వ్యాపారములందు అనేక అవకాశములు లభించును. భార్య ఆరోగ్యముపట్ల శ్రద్ధ వహించవలెను. వివాహప్రయత్నములు ఫలించును. పిల్లలకు చక్కని ప్రతిభ కనబరచెదరు.

              2021 మే 21 నుండి జూన్‌ 20 వరకు: మీరు నచ్చనివారివలన ఇబ్బందులు పడెదరు. వారు మీపై నిందలు వేయుదురు. అది మీ గృహవాతావరణముపైన కూడా ప్రభావము చూపును. అయినను,  మీ స్నేహితుల సహాయసహకారమువలన మీ ఇబ్బందులను అధిగమించెదరు. 

              2021 జూన్‌ 21 నుండి జూలై 21 వరకు: మనస్సు కొంత ఉత్సాహముతో పనిచేయును. సాహసము చేయుటకు వెనుకాడరు. పరిస్థితులు ఎట్లున్నను మనము ముందుకు వెళ్ళగమన్న ధైర్యము మనస్సులో ఉండును. అనవసరపు ఖర్చు ఉండును. స్నేహితుల సావాసము సరదాగా ఉండును. 

              2021 జూలై 22 నుండి ఆగష్టు 22 వరకు: రాబడి ఎక్కువ ఉండదు, వ్యయముమీద నియంత్రణ ఉండదు. మీ భాగస్వాములు చికాకు పెట్టెదరు. మీరు ఏ పనికొఱకు వెళ్ళినను ఎవరో ఒకరు అలసత్వముతో పనిచేయువారు మీ పనికి అడ్డుతగులుచుందురు. ఈ మాసము ఈ అనుభవమును దైవపరీక్షగా భావించి సహించినచో మంచిది.

             2021 ఆగష్టు 23 నుండి సెప్టెంబరు 22 వరకు: ఆరోగ్యముపట్ల శ్రద్ధ పెట్టవలసిన సమయము. ఖర్చులు ఎక్కువగా ఉండును. ఆదాయమునందు వృద్ధి ఉండును. క్రొత్త వ్యాపారములు ప్రారంభించు అవకాశము వచ్చును. ప్రభుత్వమునకు సంబంధించిన పనులు చేయుట జరుగును.

             2021 సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 22 వరకు: దూరప్రయాణము, విదేశయానము సూచించబడుచున్నవి. రచయితలు, విమర్శకులు, న్యాయవాదులు తమ ప్రతిభను ప్రదర్శించు అవకాశము లభించును. మీ భార్య సతాయించుచున్నట్లు అనిపించినను, ఆమె చెప్పు మాటలో సత్యమున్నదని గుర్తించినచో బాగుపడుదురు.

             2021 అక్టోబరు 23 నుండి నవంబరు 21 వరకు: సోదరులతో సంబంధబాంధవ్యము, ఆర్థిక వ్యవహారములు ప్రాముఖ్యము వహించును. చిన్న చిన్న విభేదములు కలుగ వచ్చును. సామరస్యముగా పరిష్కరించు కొనవలెను. స్టాక్‌ మార్కెట్ల వంటివాటిలో మీ ఊహలు నూటికి నూరుశాతము నిజమగును.

            2021 నవంబరు 22 నుండి డిసెంబరు 20 వరకు: మీ సృజనాత్మకతకు గుర్తింపు లభించును. కళాకారులు పేరు తెచ్చుకుందురు. పిల్లల చదువులో చక్కని ప్రతిభ చూపించెదరు. ఇంటియందు వాతావరణము ఉద్రిక్తతతో కూడి ఉన్నను, సామరస్యముగనే ఉండును.

           2021 డిసెంబరు 21 నుండి 2022 జనవరి 19 వరకు: ఈ మాసము మీరు పెట్టుబడులను పెట్టుటకు అనేక  అవకాశములను పొందుదురు. అవి మీ ధనాదాయమునకు సహాయము చేయును. కాని చిన్న ఖర్చులు ఎక్కువగా ఉండును.

           2022 జనవరి 20 నుండి ఫిబ్రవరి 17 వరకు: వ్యాపారము వృద్ధి చెందును. ప్రభుత్వమునకు సంబంధించిన పనులు చేపట్టెదరు. భాగస్వాములతో సామరస్యము బాగుండును. ఆదాయము బాగుండును. అయినను ఖర్చుపై నియంత్రణకు ప్రయత్నము చేయవలెను. మీ ఆరోగ్యము గాని, పిల్లల ఆరోగ్యము గాని కొంచెము చికాకు కలిగించును.          

           2022 ఫిబ్రవరి 18 నుండి మార్చి 19 వరకు: ఈ నెల మీకు కొంచెము శ్రమ, ప్రయాస ఉండును. పనులేవియు అనుకున్నట్టు సాగవు. వ్యాపారములో లాభములు వచ్చినను, వాటిని మరల వ్యాపారాభివృద్ధికి ఖర్చుపెట్టవలసి వచ్చును. కనుక ఖర్చు ఎక్కువ ఉన్నట్లు ఉండును.

 

కన్యారాశి:

              ఈ సంవత్సరము కొంత చికాకుతో గడుచును. మీ ప్రణాళికలను అమలుపరచుటందు, వృత్తివ్యాపారములందు ఎదురీత ఉండును. ధనాదాయముమాత్రము బాగుగానే ఉండును. ఆధ్యాత్మికసాధనకూడ బాగుగానే సాగును. అయినను పనులు మీరనుకున్నంత వేగముగా సాగక. ఏదో అడ్డుపడినట్లుగా నట్టుతూ ఉండును. మనస్సునందు కూడ ఆలోచనలు క్షణక్షణము మారుచు ఏదో ఒక విషయముపై కేంద్రీకృతము కాకపోవుటకూడ ఒక కారణము కావచ్చును. యోగము, ధ్యానము అభ్యసించినచో ఈ విషయములో మేలు కలుగును. యుక్తవయస్సులో ఉన్నవారికి వివాహప్రయత్నము ఫలించును. ప్రయాణములందుగాని, ఇతరవిధములుగా గాని, ప్రమాదములకు గురి అయ్యెదరు. ఆరోగ్యముపట్ల శ్రద్ధ వహించవలెను. వృత్తిపరముగాగాని, వ్యాపార పరముగాగాని కొంతకాలము ఇంటికి దూరముగా ఉండవలసి రావచ్చును. మహమ్మారి పరిస్థితులు చక్కబడినచో విదేశీప్రయాణములు చేయుదురు. స్నేహితులతోకలసి క్రొత్తగా వ్యాపారప్రయత్నము చేయుదురు. కానీ, అవి ఫలవంతమగుటకు మధ్యలో బాలారిష్టము దాటవలసి ఉండును. ఈ రాశివారికి అమ్మవారి పూజ మేలు చేయును. నిత్యము గాయత్రీ జపము చేయుట, లలితాసహస్రము చదువుట మంచిది. వజ్రము ధరించుట మేలు చేయును. ముత్యమును కూడ ధరించవచ్చును.

               2021 మార్చి 20 నుండి ఏప్రిల్‌ 19 వరకు: ఈ మాసము మీ ఆరోగ్యము పట్ల శ్రద్ధ వహించవలెను, ముఖ్యముగా ఉగాది ముందు వారమున. అయినను ఆధ్యాత్మిక సాధన చక్కగా సాగును. వృత్తివ్యాపారములందు స్నేహితుల సహాయ సహకారములు లభించును. కొంతమంది క్రొత్త వ్యాపారము;ఈ మొదలు పెట్టెదరు.  

              2021 ఏప్రిల్‌ 20 నుండి మే 20 వరకు: ఆరోగ్యముపై శ్రద్ధ పెట్టవలెను. కొన్ని అవాంతరమును, చిక్కులను ఎదుర్కొనవలసి ఉండును. అయినను గురువు అనుగ్రహము ఉండును. వృత్తివ్యాపారములందు చిన్న ప్రయాణముల ద్వారా కలసి వచ్చును. వివాహప్రయత్నములు ఫలించవు.

              2021 మే 21 నుండి జూన్‌ 20 వరకు:  ఈ నెల  మీకు స్నేహితువలన, ముందువెనుకలు ఆలోచించకుండా పెట్టిన పెట్టబడువలన నష్టము కలుగును. అయినను, ఆ నష్టమును పూరించు ఉపాయము మీకు తోచును. కొందరు స్నేహితులు, ముఖ్యముగా స్త్రీలు మీకు సహాయము చేసెదరు.

             2021 జూన్‌ 21 నుండి జూలై 21 వరకు: వివాహప్రయత్నములు చేయుటకు మంచి సమయము. స్నేహితుల వలన చికాకు ఉండును. అనవసరమైన ఖర్చు ఉండును. వాటిల్లో కొన్ని పంతము, పౌరుషముకారణముగా, వివాదము కారణముగా సంభవించినవై ఉండవచ్చును. 

            2021 జూలై 22 నుండి ఆగష్టు 22 వరకు: ఈ మాసము పనులు ముందుకు వెనుకకు వెళ్ళుచుండును. అయినను మీ వాక్చాతుర్యము, బుద్ధిబలము వలన ఇతరులతో స్నేహపూర్వకముగా వ్యవహరించెదరు. ఖర్చు విపరీతముగా ఉండి చికాకు పెట్టును.

             2021 ఆగష్టు 23 నుండి సెప్టెంబరు 22 వరకు: భార్యాభర్తలమధ్య చిన్న చిన్న అపోహలు ఉన్నను మొత్తము మీద ఈ మాసము మీకు బాగుండుననియే చెప్పవలెను. చాలా పనులు చేయవలెనని ప్రణాళికలు వేయుదురు. శ్రద్ధ పెట్టినచో వాటిలో చాల భాగము మీరు చేయగలరు కూడ.

            2021 సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 22 వరకు: ఈ నెల ధనము వచ్చుట, ఖర్చగుట అన్నట్లు ఉండును. అక్కడ సొమ్ము ఇక్కడ, ఇక్కడ సొమ్ము అక్కడ సర్దుబాటు చేయవలసి వచ్చును. స్నేహితులు కొంత సహాయము చేసెదరు. కాని ఈ ఒత్తిడి వలన ఆరోగ్యము దెబ్బ తినవచ్చును.

            2021 అక్టోబరు 23 నుండి నవంబరు 21 వరకు: ఆధ్యాత్మికమార్గములో ఉన్నవారికి చక్కని మాసము. సాధన చక్కగా సాగును. దివ్యదర్శనము పొందగలరు. గురువు సాన్నిధ్యము లభించును. ధనాదాయము బాగుండును. సోదరుల కొఱకు వ్యయము చేయవలసి ఉండును.

            2021 నవంబరు 22 నుండి డిసెంబరు 20 వరకు: ఇంటికి సంబంధించిన ఖర్చు ఉండును. కాని ధనా దాయము బాగుగానే ఉండును. వృత్తివ్యాపారములు అభివృద్ధి పొందును. ఉద్యోగమునందు చిన్న చిన్న చికాకులు ఉన్నను, వాటిని అధిగమించగలరు. 

            2021 డిసెంబరు 21 నుండి 2022 జనవరి 19 వరకు: అనేకమైన ప్రణాళికలు, పథకములు మీ మనస్సులో ఉండును. వాటిని కార్యాచరణలో పెట్టుటలో అనేక మార్పులు చెందును. ఇతరుల సలహాను అడిగినచో వాటి రూపమే మారిపోవచ్చును. కాని జరుగునది అదియే. ఈ మాసమంతయు పని కన్న పని ఎట్లు చేయవలెననెడి ఆలోచనతోనే గడచిపోవును.

            2022 జనవరి 20 నుండి ఫిబ్రవరి 17 వరకు: ఈ నెల ఖర్చు ఎక్కువగా ఉండును. మీ కొఱకు, మీ ఆరోగ్యముకొఱకు, మీ వృత్తివ్యాపారముకొఱకు ఖర్చు పెట్టెదరు. స్నేహితులకు కూడ చేబదుళ్ళు ఇవ్వవలసి వచ్చును. ఆదాయము బాగున్నను ఈ ఖర్చు మిమ్ము ఇబ్బంది పెట్టును.

             2022 ఫిబ్రవరి 18 నుండి మార్చి 19 వరకు: వివాహప్రయత్నములు ఫలించును. భాగస్వామ్యము ఫలవంత మగును. వ్యాపారాభివృద్ధికొఱకు అప్పు చేయవలసి వచ్చును. పిల్లల ఆరోగ్యముపట్ల శ్రద్ధ వహించవలెను.

 

తులారాశి:

              ఈ సంవత్సరము మీకు అన్నివిధముగా బాగుగానే ఉండును. పరిశోధనరంగము, దీర్ఘకాలము సాగెడి ప్రణాళికారంగమువంటి వాటిలో ఉన్నవారికి చక్కని అవకాశము ఉండును. శిల్పము, నాట్యము వంటి కళను అభ్యసించువారికి మంచికాలము. రవాణా, ప్రసారమాధ్యముకు చెందిన రంగములో ఉన్నవారికి ముఖ్యమైన మార్పువచ్చును. ఆరోగ్యము బాగుపడును. భౌతికమైన విషయములన్నీ బాగుండుటవలన ఆధ్యాత్మికమైన సాధన కుంటుపడు అవకాశమున్నది కనుక ఆ విషయమున జాగ్రత్త వహించవలెను. విదేశీప్రయాణములకు, దూరప్రయాణములకు అవకాశము వచ్చినను, కొన్ని ఇబ్బందులు, సమస్యలతో కూడినవై ఉండును. అనుకున్న దానికన్న ఎక్కువ ఖర్చు ఉండును. వృత్తి వ్యాపారము లందు స్థలములో మార్పు ఉండును. కొంతమంది తమ వృత్తి వ్యాపార రంగమును మార్చుకొనవచ్చును. ఈ మార్పులు అలవాటు పడువరకు కొంచెము చికాకుపరచవచ్చును. అధికారములో ఉన్న వారితో స్నేహమేర్పడుటగాని, మీరు చేయు వృత్తి వ్యాపారము లందు వారు సహకరించుటగాని జరుగును. మీ స్నేహితులలో కొందరు మంచి పదవులను పొందుటవలన కూడ మీకు సహకరించెదరు. మీరు చేయు సేవాకార్యక్రమములకు ప్రభుత్వము నుండి సహాయ సహకారములు లభించును. కాని కొందరు వాటికి అడ్డుపడుట చికాకు కలిగించును. శివారాధన, హనుమాన్‌చాలీసా పారాయణము, విష్ణుసహస్రనామము పఠించుట శుభమును కలుగ జేయును. నీలము, కెంపు ధరించుట మంచిది.

             2021 మార్చి 20 నుండి ఏప్రిల్‌ 19 వరకు: పని అలసటవలన, ఇంటిని చక్కగా అలంకరించి ఉంచుకొనవలెనను మీ తపనవలన ఎక్కువగా శ్రమించెదరు. దానివలన ఆరోగ్యము తేడా చేయును. ఆర్థిక ఇబ్బందులు ఉండును. అధికారులతో పరిచయము లేర్పడును. వివాహప్రయత్నముల ఫలించును.

              2021 ఏప్రిల్‌ 20 నుండి మే 20 వరకు: ఈ నెల శుభాశుభసమ్మిశ్రముగా ఉన్నను శుభములే ఎక్కువ గోచరించును. మీలోని ప్రతిభ, సృజనాత్మకత ఒక ప్రయోజనమును ఉద్దేశించి వికసించును. ధనాదాయము బాగుండును. పూర్వకర్మను అనుసరించి కొద్దిమంది మాత్రము ఎక్కువగా బాధపడెదరు,

              2021 మే 21 నుండి జూన్‌ 20 వరకు: వృత్తివ్యాపారములందు చికాకులు ఉండును. భాగస్వాములతో విభేదములు వచ్చును. స్థలమునందు మార్పులు ఉండవచ్చును. నూతన ఉద్యోగప్రయత్నములు ఫలించును. భార్యాభర్తల సామరస్యము దెబ్బతినును. పెద్ద సాంగత్యము లభించును.

              2021 జూన్‌ 21 నుండి జూలై 21 వరకు: వృత్తివ్యాపారములందు చికాకులు ఉండును. ధననష్టమునకు అవకాశమున్నది. స్నేహితుల సహాయమువలన కొంత నిలద్రొక్కు కుందురు. ఇంటి యందు సామరస్యవాతావరణమున్నను, ఎవరి పనులలో వారు మునిగి ఉన్నట్లు ఉందురు.

              2021 జూలై 22 నుండి ఆగష్టు 22 వరకు: ఈ మాసము మీకు సుమారుగానే గడచునుగాని మీలోని సహజమైన ఉత్సాహము లోపించును. ఇంటియందు కొందరి మూలముగా చికాకు ఉండును. మీ పనులు, వృత్తివ్యాపారములు మందకొడిగా సాగుచుండును.

              2021 ఆగష్టు 23 నుండి సెప్టెంబరు 22 వరకు: ఖర్చు ఎక్కువగా ఉండును. అవి అనేక రకములుగా ఉండును. వాటిని నియంత్రించుకొనవలెను.  ఇంటిలో కన్న బయట ఎక్కువ కాలము గడుపుదురు. అయినను మీ సౌకర్యములకు భంగము రాదు. కాని ఆరోగ్యము ఇబ్బంది పెట్టును.

              2021 సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 22 వరకు: చాలా పనులు చేయవలెనని మీరు ఆలోచించెదరు. ఎన్ని చేయుదురన్నది మీ ప్రయత్నముమీదనే ఆధారపడి ఉండును. ధనాదాయము బాగుగానే ఉండును. వివాహప్రయత్నము ఫలించును.  మీరు అనాలోచితముగా పెట్టిన పెట్టుబడులు మీకు నష్టము కలుగ చేయును.

              2021 అక్టోబరు 23 నుండి నవంబరు 21 వరకు: తీర్థయాత్రలకు, దూరప్రయాణములకు, విదేశయానములకు ధనము ఖర్చగును. మీరు ప్రారంభించిన కొన్ని పథకములు, ముఖ్యముగా ప్రభుత్వమునకు సంబంధమున్నవి, ఫలితమును ఇచ్చును. దానివలన ధనాదాయము బాగుండును.

              2021 నవంబరు 22 నుండి డిసెంబరు 20 వరకు: మీ ఆదాయవ్యయములు సమానముగా ఉండును. వ్యాపారము అభివృద్ధి చెందును. స్థిరాస్తులను సంపాదించగలరు. వాహనము కొనవచ్చును. వివాహప్రయత్నములు ఫలించును.

              2021 డిసెంబరు 21 నుండి 2022 జనవరి 19 వరకు: వృత్తివ్యాపారములందు చిన్న చిన్న మార్పులు చోటు చేసుకొనును. ఉద్యోగస్థులకు కూడ అంతర్గత బదిలీలవంటివి, విభాగము మారుట వంటివి ఉండును.  సోదరులతో చికాకు ఎదురగును. పిల్లలు కొంచెము మంకుగా ప్రవర్తించెదరు. 

              2022 జనవరి 20 నుండి ఫిబ్రవరి 17 వరకు: ఉద్యోగస్థులకు పని భారము ఉన్నను, గుర్తింపు లభించును. చిన్న చిన్న ప్రయాణములు చేయు వ్యాపారులకు, ఉద్యోగస్థులకు లాభదాయకముగా ఉండును. 

              2022 ఫిబ్రవరి 18 నుండి మార్చి 19 వరకు: మీ వృత్తివ్యాపారములందు మీ ఆలోచనలకు అనుగుణ ముగా మీరు చేయు మార్పుల కారణముగా ఈ నెల మీకు ఖర్చు ఎక్కువగును. ఇంటియందు బంధుమిత్రుల సందడి యుండును.

 

వృశ్చికరాశి:

              ఈ రాశివారికి ఈ సంవత్సరము ఇంటికి సంబంధించిన విషయములందు కొన్ని చికాకులు ఉండును గాని బయట పనులు చక్కగా జరుగును. ఆరోగ్యమును జాగ్రత్తగా చూసుకొనవలెను. పాత రోగములు తిరుగబెట్టును. క్రొత్తబాధలు మొదలగును. కాని మీ వృత్తివ్యాపారములందు ప్రతిభ చూపెదరు. ధనాదాయము సుమారుగా ఉండును. ఖర్చు ఉండును. వానిలో ఎక్కువభాగము అనవసరమైన విలాసములకు, ఆడంబరములకు పెట్టు ఖర్చులుండును. ఇంటిలో పెద్దవారు ఉన్నచో వారి ఆరోగ్యము కలవర పరచును. ముఖ్యముగా ఆడువారిది. మీలోని సృజనాత్మక మైన ప్రతిభ ఈ సంవత్సరమున వికసించను. పదోన్నతులు పొంద గలరు. ఉద్యోగస్థులకు బదిలీ విషయమున చికాకులు ఉండును. కోరిన చోటికి బదిలీ జరుగుట కష్టము. వివాహ ప్రయత్నములు ఫలించును. స్నేహితులవన కొంచెము ఇబ్బంది కలుగును. వారి ప్రేమవ్యవహారములవంటి వాటిలో మీరు తల దూర్చకుండుట మంచిది. అట్లే మీ ప్రణయవ్యవహారములందు వారి ప్రమేయము ఉన్నచో చికాకు కలుగును.  మీనాక్షి స్తోత్రమును, ఇంద్రాణీ స్తోత్రమును పఠించుట మంచిది. లలితాసహస్రము, మణిద్వీపవర్ణన చదివినచో మేులు కలుగును. వజ్రము ధరించవలెను.

              2021 మార్చి 20 నుండి ఏప్రిల్‌ 19 వరకు: ఈ నెల మీరు ఆధ్యాత్మికమైన సాధనమీద దృష్టి పెట్టినచో మేులు కలుగును. ఎవరైనా గురువు ఉన్నచో మంత్రదీక్ష పొందుట వంటివి చేయవచ్చును. లేదా ఆధ్యాత్మికమైన గ్రంథములు పఠించుట, ప్రవచనములు వినుట చేయవచ్చును. వృత్తి వ్యాపారములందు మంచి అవకాశములు భించును.            

                 2021 ఏప్రిల్‌ 20 నుండి మే 20 వరకు: సాధనలో ఉన్నవారికి పెద్ద సాంగత్యము లభించును. ఇతరులకు మనస్సున ఆందోళన, శారీరకముగా నిస్త్రాణ వంటివి ఉండును. భాగస్వాముతో విభేదములు ఉండును.  గురువుమీద, దైవము మీద భారము వేసి ముందుకు సాగినచో జయము కలుగును.

              2021 మే 21 నుండి జూన్‌ 20 వరకు: మీ ప్రతిభ, సృజనాత్మకత చక్కగా వికసించును. కానీ, మీ ప్రణాళికలను, ఊహలను కార్యాచరణలో పెట్టుటలో అనేక ఇబ్బందులు, అడ్డంకులు ఏర్పడును. తీవ్రప్రయత్నము అనారోగ్యమునకు దారితీసి, మీ పైన ఒత్తిడిని కలిగించును.

              2021 జూన్‌ 21 నుండి జూలై 21 వరకు: ఈ మాసము మీకు మంచిగా ఉన్నదో, చెడుగా ఉన్నదో తెలియ నట్లు ఉండును. ఏ పని ప్రారంభించవలెనన్నను మీ మనస్సున అనేక సందేహములు పుట్టును. వాటిని తొలగించుకొని పని ప్రారం భించినచో పనులు కొంత ముందుకు సాగును కాని మరల మీ మనస్సే మీకు ఆటంకములను సృష్టించును.

              2021 జూలై 22 నుండి ఆగష్టు 22 వరకు: ప్రయాణములు అంత కలిసి రావు. మీ ప్రయత్నములో లోపము లేకున్నను ఫలితము కొన్నిసార్లు మీరు ఆశించినట్లు ఉండదు. కాని వృత్తివ్యాపారములు అభివృద్ధి చెందును.  స్త్రీలమూలకముగా నిందలు పడుదురు. ఆ విషయమై జాగ్రత్త వహించవలెను.

              2021 ఆగష్టు 23 నుండి సెప్టెంబరు 22 వరకు: స్నేహితుల సహకారము వలన మీ ప్రణాళికలు చాలావరకు పట్టాలెక్కును. కాని ఆడంబరములకు ఖర్చు పెట్టుదురు. అందులో మీ భార్య పాత్రకూడ ఉండును. వాటిని తగ్గించుకొనవలెను.

              2021 సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 22 వరకు: వివాహప్రయత్నములకు అనుకూల సమయము. ఖర్చు ఎక్కువ ఉండును. ఆరోగ్యముపట్ల శ్రద్ధ వహించవలెను. ఉద్యో గస్తులకు అధికారుల నుండి ఇబ్బందులు ఎదురగును. భార్యా భర్తల మధ్య చికాకు ఉండును. వాదలను పెంచకున్న మంచిది.

              2021 అక్టోబరు 23 నుండి నవంబరు 21 వరకు: వృత్తివ్యాపారములందు అభివృద్ధి కనిపించును. మీరంగములలో ముఖ్యమైన పదవిని చేపట్టగలరు. ఖర్చులుండును. స్నేహితులవలన, మీ ఆలోచనలు, ప్రణాళికలవలన ఖర్చులు ఎక్కువగా ఉండును. వివాహప్రయత్నములు ఫలించును.

              2021 నవంబరు 22 నుండి డిసెంబరు 20 వరకు: ఆరోగ్యముపట్ల శ్రద్ధ వహించవలెను. వృత్తివ్యాపారములు  బాగుగానే సాగును. ధనాదాయము బాగుండును. అయినను ఏదో ఒక తెలియని చికాకు మిమ్మల్ని పీడిరచును. స్నేహితులవన చికాకులు ఉండును. భార్యకారణముగా, సోదరులకారణముగా ఖర్చులు ఉండును.

              2021 డిసెంబరు 21 నుండి 2022 జనవరి 19 వరకు: మీరు నడుము బిగించి కార్యాచరణలోనికి దిగవలా సిన మాసము. మీరెంత పని చేసిన అంత లాభము పొందదురు. ధనాదాయాము బాగుండును. ఇంటియందు వాతావరణము కొంచెము ముభావముగా ఉండును గాని, ఇబ్బందులేవీ ఉండవు.

              2022 జనవరి 20 నుండి ఫిబ్రవరి 17 వరకు: ఆధ్యాత్మికసాధనకు మంచి సమయము. గురువు అనుగ్రహము లభించును. దూరప్రయాణములు, విదేశయానములు చేయగలరు. కొన్ని ప్రయాణములు వృత్తి వ్యాపారములకు సంబంధించినవై ఉండవచ్చును. ఉద్యోగార్థులకు విదేశీ ఉద్యోగము లభించును.

              2022 ఫిబ్రవరి 18 నుండి మార్చి 19 వరకు: కుటుంబములో సభ్యులకు అనారోగ్యము ఉండును. వాహనము నడుపునప్పుడు జాగ్రత్త వహించవలెను. సోదరులతో సామరస్యము ఉండును. పిల్లలు చక్కని ప్రతిభ కనపరచెదరు. ధనాదాయములు బాగుండును.  వివాహప్రయత్నములు ఫలించును.

 

ధనూరాశి:

              ఈ రాశివారికి మొత్తము మీద  సంవత్సరము బాగుగా గడుచును. ఉగాది నుండి ఒకటి రెండు నెలలు భార్య అనారోగ్యము మాత్రము కొంచెము చికాకు పరచును. మీరు వేయు ప్రణాళికులు చాలావరకు కార్యరూపము దాల్చును, మంచి ఫలితములనుకూడ ఇచ్చును. వృత్తివ్యాపారములందు, ఉద్యోగములందు కొద్ది ఇబ్బందులను ఎదుర్కొనెదురుగాని, అవి నెమ్మదిగా తొలగిపోవును. సంవత్సరము ద్వితీయార్ధమునందు వివాహప్రయత్నము ఫలించును. ఇంటియందు చిన్న చిన్న చికాకులు ఉండును. అవి భార్యాభర్తలమధ్య అభిప్రాయభేదములవలన వచ్చును. మీకు గల ధనమునకు సంబంధించిన లావాదేవీలుగాని, అనారోగ్య పరిస్థితులు గాని అందుకు కారణము కావచ్చును. కాని వాటిని పట్టించుకొనక ముందుకు సాగుట ఉత్తమము. అవికూడ గాలి బుడగవలె నెమ్మదిగా పేలిపోవును.  విదేశములందు ఉద్యోగావ కాశములు లభించును. వృత్తిపరముగాగాని, వ్యాపార పరముగా గాని విదేశములకు వెళ్ళుట ఉండును. స్నేహితుల సహాయ సహకారములు లభించును. ఆధ్యాత్మికసాధన చక్కగా సాగును. ధార్మికమైన కార్యక్రమములలో పాల్గొను అవకాశము లభించును. ఆదిత్యుని, ఆంజనేయుని పూజించుట మీకు మేులు చేయును. విష్ణుసహస్రనామము పఠించుట ఉత్తమము. గురుచరిత్ర పారాయణము శుభము నిచ్చును. కుదిరినచో తీర్థయాత్రలకు వెళ్ళవచ్చును. కెంపు ధరించుటవలన శుభము కలుగును.

              2021 మార్చి 20 నుండి ఏప్రిల్‌ 19 వరకు: ఈ మాసము మీకు గాని, మీ భార్యకుగాని  కొద్దిగా అనారోగ్యపు చికాకు ఉండును. ఇంటియందు ఖర్చునకు సంబంధించిగాని, మీరు తీర్చవలసిన లేదా మీకు రావలసిన బాకీలకు సంబంధించి గాని ఒత్తిడి పెరుగును.  కాని ఇవన్నియు నెమ్మదిగా తొలగిపోవు నవే కనుక చింతించనవసరము లేదు

              2021 ఏప్రిల్‌ 20 నుండి మే 20 వరకు: భార్యాభర్తలమధ్య తగవు ఉండును.  ఈ గొడవలకారణముగా ఆరోగ్యము దెబ్బతినును. దీర్ఘవ్యాధులతో బాధపడువారు జాగ్రత్తగా ఉండ వలెను. వ్యాపారమునందు భాగస్వాములతోకూడ తీవ్రమైన విభేదములు ఉండును. వివాహప్రయత్నములు ఫలించవు.

              2021 మే 21 నుండి జూన్‌ 20 వరకు: పని ఒత్తిడి ఎక్కువగా ఉండును. తరుచు ప్రయాణములు చేయ వలసి ఉండును. దానివలన ఆరోగ్యము చెడును. ఈ విషయమున జాగ్రత వహించవలెను. అనేకమందితో పరిచయములు ఏర్పడును. అవి మీ వృత్తివ్యాపారములందు సహాయము చేయును.  వివాహ ప్రయత్నములు చేయవచ్చును.

              2021 జూన్‌ 21 నుండి జూలై 21 వరకు: ఆరోగ్యముపట్ల జాగ్రత్త వహించవలెను. ప్రయాణములు వాయిదా వేసుకొనుట మంచిది. పూర్వకర్మ చెడ్డగా ఉన్నవారికి బంధనాది యోగములు సూచించబడుచున్నవి. ఆ విషయమున జాగ్రత్త వహించవలెను. గురువును, దైవమును నమ్మినవారికి మాత్రము అనుగ్రహము లభించి, అట్టి కష్టమును సులభముగా దాటుదురు.  

              2021 జూలై 22 నుండి ఆగష్టు 22 వరకు: ఇంటియందు సామరస్య వాతావరణము ఉండును కాని భార్య ఆరోగ్యము చికాకు పెట్టును. భాగస్వాములవలన నష్టము చవి చూడవలసి వచ్చును. వ్యాపారస్తులు స్త్రీల కారణముగా మోస పోవుట, నష్టపోవుట జరుగును. అయినను మీ పూర్వపుణ్యములవలన దైవానుగ్రహము, గురువు అనుగ్రహము ఉండును.

              2021 ఆగష్టు 23 నుండి సెప్టెంబరు 22 వరకు: ఇంటిలోని సభ్యుల ఆరోగ్యముపట్ల శ్రద్ధ వహించవలెను. మీ ఆరోగ్యము వృత్తివ్యాపారములందు అభివృద్ధి కనిపించును. క్రొత్త అవకాశములు వచ్చును. స్నేహితులు, ఆడువారు సహాయము చేసెదరు. మనస్సు మందకొడిగా ఉండును.

              2021 సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 22 వరకు: అనవసరమైన సందేహములు, అపనమ్మకములు మిమ్ము పీడిరచును. అందువలన మీ సన్నిహితులతోను, స్నేహితులతోను విభేదములు కొని తెచ్చుకుందురు. మీ మంచి కోరి ఉపదేశము చేయు పెద్దలను మన్నించరు. ఈ విషయమున జాగ్రత్త పడవలెను.

              2021 అక్టోబరు 23 నుండి నవంబరు 21 వరకు: ఈ మాసము కొద్ది ఇబ్బందులను ఎదుర్కొందురు. అవి ఆర్థికము గావచ్చును, మీరంటే పడనివారు వేయు నిందలు గావచ్చును, అనారోగ్యము కావచ్చును.  స్త్రీల కారణముగా మీరు ఇబ్బందులకు గురి కాగలరు. పూర్వపు మీ అనాలోచిత చర్యకు ఇప్పుడు ఫలితము అనుభవించవసి వచ్చును.

              2021 నవంబరు 22 నుండి డిసెంబరు 20 వరకు: ఇది మీ జన్మమాసమే అయిననూ మీకు అంత బాగున్నట్టు ఉండదు. ఇంటియందు అనారోగ్యములు, ఖర్చులు ఉండును. కాని వీటినన్నిటిని పట్టించుకొనకుండా ఆధ్యాత్మికసాధనలో మునిగి నచో మంచిది. వృత్తివ్యాపారములు అభివృద్ధి పొందును.  తీర్థ యాత్రలు చేయుట మంచిది. గురువు అనుగ్రహము ఉండును.

              2021 డిసెంబరు 21 నుండి 2022 జనవరి 19 వరకు: మీ అమ్మగారి ఆరోగ్యముగురించి కొంత చింత పడవలసి వచ్చును. ఆవిడనుండి ఆస్తులుకూడ పొందుదురు. ఈ నెల రాబడి అధికముగా ఉండును. ఖర్చులు కొన్ని ఉన్నను, అవి  అవసరమైనవే అయి ఉండును. మీ ఆరోగ్యముపట్ల కూడ మీరు శ్రద్ధ వహించవలెను. చిన్న ప్రయాణములు మీకు లాభిం చును.

              2022 జనవరి 20 నుండి ఫిబ్రవరి 17 వరకు: పిల్లలవిషయమై శ్రద్ధ పెట్టవలసి వచ్చును. వారి కొఱకు ఖర్చు చేయవలసి వచ్చును. ఇంటియందు సామరస్యపూర్వకమైన వాతావరణము ఉండును. ధనాదాయము బాగుగానే ఉండును గాని, తీర్చవలసిన బాకీల ఒత్తిడి కూడా ఉండును. దూర ప్రయాణములందు ఇబ్బందులు ఎదురగును.

              2022 ఫిబ్రవరి 18 నుండి మార్చి 19 వరకు: ఇంటియందు వాతావరణము సానుకూలముగా ఉండును. ఉద్యోగస్థులకు, వ్యాపారులకు మంచి సమయము. మీ పనులను సులభముగా చేసుకుందురు. వివాహప్రయత్నము ఫలించును. చిన్న చిన్న నష్టములు వచ్చినను  సులభముగా అధిగమించెదరు.

  

మకరరాశి:

              ఈ సంవత్సరము ప్రారంభములో మీకు కొద్దిగా వ్యయభారము ఉండును. జూన్‌ నాటికి ఆ భారము కొంత తీరును గాని, పూర్తిగా తీరినట్లు కాదు. అందువలన మీరు చేయు ప్రయత్నములు పరుగులు పెట్టక, నెమ్మదిగా సాగును. ఆరోగ్యము చికాకు పెట్టును. కంటిజబ్బులు, గుండెజబ్బులు రావచ్చును. కాని ప్రమాదకరపరిస్థితి ఉండదు. భార్య ఆరోగ్యముకూడా చికాకు కలిగించును. సోదరులవలన కొంత నష్టము, కొంత లాభముగా ఉండును. సొంతఇంటి ప్రయత్నముచేయువారికి ఖర్చు ఎక్కువ ఉండును. వృత్తివ్యాపారములు లాభించును. స్థలము మార్పు లాభించవు. ఉద్యోగస్థులకు బదిలీవలన ఇబ్బందులు కలుగును. వివాహప్రయత్నములు ఫలించవు. భార్యాభర్తల అన్యోన్యము దెబ్బతినును. పిల్లలు చక్కని ప్రతిభ కనపరుచుదురు.  దూరప్రయాణములు, విదేశయానములు లాభించవు.  స్నేహితులవలన ఖర్చు ఉండును. వారి ఋణములకు మీరు పూచీ ఉండవలసి వచ్చును. దానివల న కొన్ని చికాకులు కుగును. లితాసహస్రము,లక్ష్మీ అష్టోత్తరము, శ్రీసూక్తము, కనకధారాస్తవము వంటి స్తోత్రములు పఠించుట, పారాయణ చేయుట మంచిది. వజ్రము, నీలము ధరించవచ్చును.

              2021 మార్చి 20 నుండి ఏప్రిల్‌ 19 వరకు:  వ్యాపారవిస్తరణకు,  క్రొత్త రంగములోనికి ప్రవేశించుటకు మంచితరుణము. ఎక్కువగా శ్రమపడుటవలన, ఒత్తిడికి లోనగుట వలన ఆరోగ్యము చెడును. దంపతులమధ్య కీచులాటలు ఉండును. ఆదాయము బాగుగానే ఉండును కాని, స్నేహితుల కారణముగను, అనారోగ్యముల కారణముగను ఖర్చు ఉండును.

              2021 ఏప్రిల్‌ 20 నుండి మే 20 వరకు: కొందరికి అనుకోకుండా అతిత్వరగా వివాహములు కుదురుట, జరుగుట సంభవించును. కాని అట్టి వివాహములలో కొద్ది నెలల లోనే భార్యాభర్తలమధ్య విభేదము కలుగు ప్రమాదమున్నది  వధూ/వరులగురించి పూర్తిగా వివరములు తెలుసుకుని మాత్రమే ముందుకు వెళ్ళవలెను. ఈ నెల ఖర్చుకు  తగిన ధనము సమకూరు చుండును.  మీ శత్రువులబలము కొద్దిగా హెచ్చుగా ఉండును.

              2021 మే 21 నుండి జూన్‌ 20 వరకు: భాగస్వాములతో విభేదములు ఉండును. భార్యాభర్తలమధ్య కీచులాటలు వచ్చును. ధనాదాయము బాగుండును. కాని మీ చుట్టు ఉన్న పరిస్థితులను కొందరు ఉపయోగించుకొని, మీకు వ్యతిరేకముగా పనిచేయుదురు.  స్నేహితులలో కొందరు మీ నమ్మకమును నిలబెట్టుకొనరు, ముఖ్యముగా మీతో ఆర్థిక లావా దేవీలు ఉన్నవారు.

              2021 జూన్‌ 21 నుండి జూలై 21 వరకు: వివాహప్రయత్నములు వాయిదా వేసుకొనుట మంచిది. భాగ స్వాములతో విభేదములు వచ్చును. దానివలన నష్టము చవి చూసెదరు. స్నేహితువలన కొంత నష్టము కలుగును. ప్రేమ వ్యవహారములలో చిక్కుకుందురు. అవి కొన్ని పెళ్ళివరకు దారి తీయునుగాని, తొందరపడినచో తరువాత ఇబ్బందు ఎదు రగును. కనుక జాగ్రత్త వహించవలెను.

              2021 జూలై 22 నుండి ఆగష్టు 22 వరకు: మనస్సున తెలియని ఆందోళన, నిరాశ ఉండును. మీరు చేయు ప్రయత్నములు ఫలించవేమోనను భయము వెంటాడును. దానికి తగినట్లే శరీరమునందు ఉష్ణము, తలనొప్పి వంటి బాధలు మిమ్ము నిరుత్సాహపరచును. ఈ మాసము జరుగుచున్న విషయమును కేవలము పరిశీలించుచు గడిపినచో మంచిది.

              2021 ఆగష్టు 23 నుండి సెప్టెంబరు 22 వరకు: ధనాదాయము స్థిరముగా ఉండును. వ్యాపార విస్తరణగురించి ఆలోచనలు చేసెదరు. కుటుంబసభ్యులు, స్నేహితులు సహకారమువలన అవి కార్యాచరణ పొందును. పెద్దల ఆశీర్వాదమున్నచో ఫలవంతమగును.

              2021 సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 22 వరకు: ఇది మీకు మంచి మాసము. ఖర్చులున్నను, రాబడి స్థిరముగా నుండును. ఉద్యోగస్థులకు పనియందు గుర్తింపు లభించును. వృత్తివ్యాపారములు అభివృద్ధి చెందును.  స్నేహితులు సహకరించెదరు. ఇంటియందు పండుగవాతావరణము ఉండును. కాని ఆరోగ్యము మాత్రము జాగ్రత్తగా చూసుకొనవలెను.

              2021 అక్టోబరు 23 నుండి నవంబరు 21 వరకు: ఈ మాసము మీకు శుభకరమైన మాసమని చెప్పవచ్చును. వివాహప్రయత్నములు, విదేశప్రయాణములు ఫలించును. పోటీపరీక్షలలో ఉత్తీర్ణత పొందుదురు. ఉద్యోగావ కాశములు బాగున్నవి. స్థానచలనము ఉండవచ్చును.

              2021 నవంబరు 22 నుండి డిసెంబరు 20 వరకు: ఈ మాసము మీకు ఆధ్యాత్మికముగాను, లౌకికముగాను కూడా బాగుండును. మనస్సున వికాసము ఉండును. చక్కని రచనలు మొదలైనవి మీ నుండి రాగలవు. మీఆరోగ్యముపట్ల, భార్య ఆరోగ్యముపట్ల మాత్రము శ్రద్ధ పెట్టవలెను. దూర పయాణములందు ఖర్చులు ఎక్కువగా ఉండును.

              2021 డిసెంబరు 21 నుండి 2022 జనవరి 19 వరకు: వివాహప్రయత్నములు ఫలించును. భాగస్వాములతో సంబంధములు ఉపయుక్తకరముగా ఉండును. ఈ నెల మీకు అనేక అవకాశము లభించును. మీ వృత్తివ్యాపారములలో మార్పు జరుగు నిర్ణయములు కొన్ని తీసుకుందురు. ధనాదాయము స్థిరముగా ఉండును. చాలామంది మీ నాయకత్వము కొఱకు ఎదురు చూచుచుందురు.

              2022 జనవరి 20 నుండి ఫిబ్రవరి 17 వరకు: ఇంటికి సంబంధించిన ఖర్చులు ఉండును. వృత్తివ్యాపారములందు అభివృద్ధి ఉండును. ధనాదాయము బాగుండును కాని కుటుంబసభ్యుల ఆరోగ్యముకొఱకు ఖర్చులు పెట్టవలసి వచ్చును. ఋణబాధలు కూడా ఉండును.

              2022 ఫిబ్రవరి 18 నుండి మార్చి 19 వరకు: వివాహప్రయత్నములు ఫలించును. ఇంటికి సంబంధించిన వ్యవహారములు, స్నేహితులకు సంబంధించిన విషయములు ఈ నెల మీకు ముఖ్యమగును. ధనాదాయము బాగున్నను, తీర్చవలసిన బాకీలు ఉండును. అందువలన అప్పు చేయవలసి రావచ్చును.

 

కుంభరాశి:

              ఈ రాశివారికి ఈ సంవత్సరము శుభసమయమని చెప్పవచ్చును. కొద్దిగా ఆర్థికమైన ఇబ్బందులను ఎదుర్కొన్నను, ధనాదాయ అవకాశములు బాగుండుటవలన కలవరపడ నవసరము లేదు. రాబడి, వ్యయములపై దృష్టి పెట్టి ఉంచినచో చాలు. కుటుంబములో సభ్యుల సహకారము ఉండును.  విదేశ యానమునకు అవకాశములు లభించును. అవి వృత్తి, వ్యాపార పరముగా చేయు ప్రయాణములు కావచ్చును. ఉద్యోగమునకై పరీక్షులు వ్రాసినచో, ఫలితము అనుకూలముగా వచ్చును. వివాహప్రయత్నములు కలసివచ్చును. ఆరోగ్యముపై శ్రద్ధ పెట్టవలసి ఉండును. పనిలోగాని, చదువులోగాని, ఇతరత్రాగాని ఒత్తిడి చెందినచో అనారోగ్యమునకు గురి అయ్యెదరు. వృత్తివ్యాపారములలో క్రొత్త ఆలోచనలు చేయగలరు. వాటిని కార్యాచరణలో పెట్టుటలో కొద్దిగా ఖర్చు, ఇబ్బందులు ఎదురైనను, రాబోవు కాలములో ఫలితము అనుకూలముగా ఉండును. స్నేహితుల సహకారము ఉండును.  మీ ఆధ్యాత్మికజీవనము చక్కని వికాసముతో సాగును. మీ గురువు మీకు దర్శనమిచ్చుట, ఉప దేశము చేయుట జరుగును. ఆధ్యాత్మికమైన, ధార్మికమైన కార్యక్రమములలో మీరు పాల్గొనెదరు. తీర్థయాత్రలు చేయుదురు. విష్ణుసహస్రము పఠించుట, హనుమాన్‌ చాలీసా పఠించుట, అమ్మవారిని ఆరాధించుట చేయవలెను. వజ్రము, కెంపు, నీము ధరించవచ్చును.

              2021 మార్చి 20 నుండి ఏప్రిల్‌ 19 వరకు: ఆధ్యాత్మికవికాసమునకు మంచి సమయము. తీర్థయాత్రలు చేయుదురు. పెద్దల సాంగత్యము భించును. కడుపునకు, కళ్ళకు, కాళ్ళకు సంబంధించిన అనారోగ్యము చికాకు పెట్టును. కుటుంబసౌఖ్యము ఉండును. ఇంటిలో సామరస్యము ఉండును.

              2021 ఏప్రిల్‌ 20 నుండి మే 20 వరకు: కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకొనును. ధనాదాయము బాగుండును. చాలాకాలము సాగెడి లేదా నిలిచి ఉండెడి పథక ములు, ప్రణాళికలు ప్రారంభించగలరు. సహజముగనే వాటికి కొంత వ్యతిరేకత ఎదురగును. కాని మీలో ఉన్న పట్టుదలకు పదును పెట్టి, విడువకుండా ప్రయత్నము చేసినచో మేులు కలుగును. 

              2021 మే 21 నుండి జూన్‌ 20 వరకు: ధనాదాయము బాగుండును. మీ ప్రణాళికలు, పథకములు సఫలమగును. కాని  పని ఒత్తిడి ఆరోగ్యమును దెబ్బతీయును. ఉద్యోగస్తులకు పై అధికారుల సహాయసహకారములు లభించవు. లలితకళలను, జపతపములను సాధనముగా చేసికొని  మీలోని సృజనాత్మకతను నమ్మి, ముందుకు సాగవలెను.

              2021 జూన్‌ 21 నుండి జూలై 21 వరకు: ధనాదాయము బాగుండును. స్నేహితులు సహకరించుదురు. భాగస్వాములతో విభేదములు వచ్చును. భార్యాభర్తల అన్యోన్యము చెడును. ఉద్యోగప్రయత్నములకు ఆటంకములు కలుగును. కొంతమంది ఉద్యోగములు కోల్పోవు ప్రమాదమున్నది.

              2021 జూలై 22 నుండి ఆగష్టు 22 వరకు: ఈ మాసము మీకు  ఒకప్పుడు ఆదాయము హెచ్చుగాను, మరొక ప్పుడు వ్యయము హెచ్చుగాను ఉండును. డబ్బు వచ్చును, ఖర్చగును, వచ్చును, ఖర్చగును. అది ఒక చక్రమువలె జరుగును. ఇంటిలో వాతావరణము చికాకు కలిగించును. కాని సామాజి కముగా పేరు ప్రతిష్ఠు పొందుదురు. మీ పనులకు గుర్తింపు లభించును.

              2021 ఆగష్టు 23 నుండి సెప్టెంబరు 22 వరకు: మీ ప్రయత్నలోపము ఉండదు, ధనాదాయము బాగుండును కాని అనేక ప్రతికూలతను, ప్రతిబంధకములను ఎదుర్కొనవలసి వచ్చును. సులభముగా జరుగవలసిన పనులు సంక్లిష్టముగా తయారగును. కాని కొన్ని కష్టతరమనుకున్న పనులు దైవాను గ్రహమున అతి సులభముగా జరిగిపోవును. 

              2021 సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 22 వరకు: ఆదాయము బాగుండును. పిల్లలు ప్రతిభ కనపరచెదరు. రచయితలకు, సంగీతకారులకు గుర్తింపు లభించును. భాగస్వాములు మోసము చేయుటగాని, ప్రభుత్వమునుండి నోటీసులు అందుటగాని జరుగును. స్థానచలనముండును.

              2021 అక్టోబరు 23 నుండి నవంబరు 21 వరకు: ఇంటియందు సుఖకరమైన వాతావరణము ఉండునుగాని, కొంత అనారోగ్యబాధలు ఉండును. మీరు చేపట్టిన పనులు చాలాకాలము నిలచునవై ఉండును. ఆర్థికముగాకూడా వెసులు బాటు కలుగును. ఉద్యోగప్రయత్నములు ఫలించును. ప్రభుత్వ ఉద్యోగములు రావచ్చును. స్థానచలనము ఉండవచ్చును.

              2021 నవంబరు 22 నుండి డిసెంబరు 20 వరకు: మీ ప్రయత్నమువలన ధనాదాయములు బాగుండును. వృత్తివ్యాపారములందు అభివృద్ధి కలుగును.  వివాహప్రయత్నములు ఫలించును. స్నేహితులద్వారా కొన్ని సంబంధములు కుదురును. పిల్లల ఆరోగ్యము చికాకు పరచును. ఎదురుచూడని కొన్ని ఖర్చులు మీదపడు అవకాశము ఉన్నది.

              2021 డిసెంబరు 21 నుండి 2022 జనవరి 19 వరకు: ఈ నెల మీకు అనుకోని ఖర్చులు  తగును. వాటిలో కొన్ని మీరు తీర్చవలసిన బాకీలు,  మరికొన్ని పిల్లల గురించి, మీ అభిరుచులగురించి, ఇంటిగురించి ఉండును. తీర్థయాత్రల వంటివాటికి కూడ ఖర్చులగును.

              2022 జనవరి 20 నుండి ఫిబ్రవరి 17 వరకు: వివాహసంబంధములు కుదురును. భార్యవైపువారు మీకు సహాయము చేయుదురు. ధనాదాయము బాగుండును. ఇంటికి సంబంధించి ఖర్చులు ఉండును. వృత్తికి, వ్యాపారమునకు సంబంధించిన కొన్ని నిర్ణయములు సాహసముతో తీసుకుందురు.

              2022 ఫిబ్రవరి 18 నుండి మార్చి 19 వరకు: ఈ నెల మీకు ఆదాయవ్యయములగురించి ఆలోచించుటతోనే సరిపోవును. రాబడి ఎంత ఉండునో ఖర్చులు కూడ అంతే ఉండును. కొన్ని ఖర్చులను పెట్టుబడులుగా భావించ వచ్చును. వ్యాపారాభివృద్ధికి పెట్టుబడి పెట్టెదరు. దాని కొఱకు అప్పు చేయవచ్చును. ఆరోగ్యముపట్ల శ్రద్ధ వహించవలెను. రచనా వ్యాసంగముపట్ల ఆసక్తిగవారు దానిపై దృష్టి పెట్టుట మంచిది.

 

మీనరాశి:

              ఈ సంవత్సరము ప్రతివిషయములోను మీకు మంచిచెడులు కలిసి ఉన్నట్లు ఉండును.మొదటగా మీ ఆలోచనలు, ప్రణాళికలు చక్కని మార్గములో ఏ సందేహము లేని విధముగా ఉండును. కాని వాటిని ఆచరణలో పెట్టుటలో ఎదుటి వారి సహాయసహకారములు లభించవు. దానివలన మీకు చికాకు కలుగును. ఇంటియందైనను, కార్యాలయమునందైనను, ఇతర విషయములందైనను ఇట్లే ఉండును. మీరెంత చక్కగా  ప్రణాళిక వేసుకున్నను, అనవసరపు ఖర్చులు, అనుకోని ఖర్చులు  మీ పథకములను తలక్రిందులు చేయును.   మీ చికాకులవలన ఇంటిలో వాతావరణము ప్రశాంతతను కోల్పోవును. వృత్తి వ్యాపారములందు, ఉద్యోగస్థులకు కూడ ఖర్చులు ఎక్కువగా ఉండును. స్నేహితులను ఆదుకొనుటయందు, సేవాకార్య క్రమములు, ధార్మికకార్యక్రమము లందు కూడ మీకు ఖర్చు ఎక్కువగానే ఉండును. ఈ ఖర్చు ఒత్తిడి వలన ఆరోగ్యము దెబ్బతినును.  దూరపుబంధువులను కలుసుకుందురు. ఆధ్యాత్మికసాధన నికడగా చేసినచో మనస్సు లోని లోపలి పొరు విచ్చుకొనును. హనుమాన్‌ చాలీసా పఠించుట, అమ్మవారిని ఆరాధించుట మేులు చేయును. పగడమును, ముత్యమును ధరించవచ్చును.

              2021 మార్చి 20 నుండి ఏప్రిల్‌ 19 వరకు: ఈ నెల మీకు అనుకోని ఖర్చులు ఉండును. చిన్నవి, పెద్దవి ప్రయాణములు తగును. ఆరోగ్యముపట్ల శ్రద్ధ వహించవలెను. ఇంటియందు చిన్న చిన్న చికాకులు ఉండును. ఉద్యోగములు మారవచ్చును. లేదా స్థానచలనము ఉండును. సేవాకార్యక్రమములందు పాల్గొందురు. . ధనాదాయము బాగుగానే ఉండుట మీకు శుభసూచకముగా ఉండును.

              2021 ఏప్రిల్‌ 20 నుండి మే 20 వరకు: రాబడి, వ్యయము జోడుగుఱ్ఱమువలె పరుగులెత్తును. చిన్న ప్రయాణములు లాభించును. ఏప్రిల్‌ చివరి వారములో ఇంటిలో వాతావరణము చికాకు పరచును. ఆ తర్వాత పిల్లలు చికాకు పెట్టెదరు. నెల చివరలో కొంచెము తెఱిపిన పడుదురు.

              2021 మే 21 నుండి జూన్‌ 20 వరకు: ఈ మాసము మీకు శుభాశుభమిశ్ర మాసముగా చెప్పవలెను. అనేక అవకాశములు లభించును. వాటిని ఉపయోగించుకొనవలెను. ఇంటియందుమాత్రము కుటుంబసభ్యుల ఆరోగ్యము చికాకు పరచును. వివాహప్రయత్నము, ఉద్యోగప్రయత్నము ఫలించును. పిల్లలవిషయమై కొంత ఆందోళన ఉండును.

              2021 జూన్‌ 21 నుండి జూలై 21 వరకు: లౌకికమైన విషయములు సుఖముగా, హాయిగా సాగుటవలన మీ ఆధ్యాత్మికసాధన కుంటుపడును. మనస్సు మరల మరల బాహ్యవిషయములవైపుకు మరులుచుండును. మీరు సంకల్పించి చేయు ప్రయత్నములన్నియు సఫలమగును. వృత్తివ్యాపారములు బాగుగా సాగును. ఇంటియందు వాతావరణము ఉత్సాహ భరితముగా ఉండును. 

              2021 జూలై 22 నుండి ఆగష్టు 22 వరకు: వృత్తివ్యాపారములు బాగుగా సాగును. ఉద్యోగమునందు గుర్తింపు ఉండును. ఇంటియందు ఏదో ఒక హడావిడి ఉండును. పిల్లలు ప్రతిభ ప్రదర్శించెదరు. కాని వారివలన కొన్ని చికాకులు కూడ కలుగును. భాగస్వాములు, భార్య, సోదరులు, స్నేహితులు సమస్యు సృష్టించెదరు. ఖర్చు పెరుగును.

              2021 ఆగష్టు 23 నుండి సెప్టెంబరు 22 వరకు: ఏ పని తలపెట్టినను దానిని ప్రోత్సహించువారికన్న వ్యతిరేకించువారు, సందేహించువారు ఎక్కువగా ఉందురు. వారిలో స్నేహితులుకూడ ఉందురు. కాని వారి మాటలు విన్నచో,  ఖర్చులు ఎక్కువగును. కనుక మీరు అనుకున్నది అనుకున్నట్లుగా చేయుట మంచిది. నష్టమేమి వచ్చినను, మీరే బాధ్యత వహించవచ్చును.

              2021 సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 22 వరకు: మీ సృజనాత్మకత మీకు ఆదాయమును తెచ్చి పెట్టును. అనగా రచనలకు, ఇతరములకు పారితోషికములు, పురస్కారములు లభించును. కాని ఆరోగ్యమును జాగ్రత్తగా చూసుకొనవలెను. పని ఒత్తిడి ఉండును. తరచు ప్రయాణములు చేయవలసి వచ్చును. ఖర్చుకూడ ఎక్కువగానే ఉండును.

              2021 అక్టోబరు 23 నుండి నవంబరు 21 వరకు: కవులు, రచయితలు చక్కని ప్రతిభ చూపించగలరు. అతిగా శ్రమపడుటవలన ఆరోగ్యము దెబ్బతినును. కొద్దిమంది తీవ్రమైన సాధన చేయుటవలన కూడా ఆరోగ్యము దెబ్బతినును. ఇంటిలోనివారి ఆరోగ్యముకూడా తేడా చేయును. కనుక జాగ్రత్త వహించవలెను. వృత్తివ్యాపారములు అభివృద్ధి చెందును.

              2021 నవంబరు 22 నుండి డిసెంబరు 20 వరకు: ఇంటియందు వాతావరణము సామరస్యముగా ఉండును. ఆధ్యాత్మికసాధన చక్కగా సాగును. దీక్షలు స్వీకరించగలరు. వివాహప్రయత్నములు ఫలించును. వృత్తివ్యాపారములు బాగుగా సాగును. స్నేహితువలన, సోదరువలన కొద్దిగా ఇబ్బందులు పడుదురు. ఖర్చులు ఎక్కువగా ఉండును.

              2021 డిసెంబరు 21 నుండి 2022 జనవరి 19 వరకు: వృత్తివ్యాపారములు అభివృద్ధి చెందుటకు అవకాశములు వచ్చును. మీ స్నేహితులు మీకు సహకరించుటకు కొన్ని ఆలోచనలు, సూచనలు చేసెదరు.  కాని వానిలో కొన్ని నష్టపరచునవి ఉండును. ధనాదాయము బాగుండును.  వివాహ యత్నము ఫలించును.

              2022 జనవరి 20 నుండి ఫిబ్రవరి 17 వరకు: వృత్తివ్యాపారములందు అభివృద్ధి ఉండును. ఉద్యోగులకు గుర్తింపు లభించును. ధనాదాయము బాగుండును. ఖర్చులుకూడ ఎక్కువగానే ఉండును. ఇంటికి సంబంధించినవి, వ్యాపారమునకు సంబంధించినవి, మొహమాటములకు పోయి ఇచ్చునవి మొదలగు ఖర్చు ఉండును. అందువలన మీ ప్రణాళికలు ఆచరణలో పెట్టుట ఆలస్యమగును. ఆరోగ్యము పట్ల శ్రద్ధ వహించవలెను.

              2022 ఫిబ్రవరి 18 నుండి మార్చి 19 వరకు: ఆదాయము బాగుండును. వ్యయముకూడ దానికి తగి నట్లుగానే ఉండును.  వివాహప్రయత్నములు ఫలించును. వృత్తి వ్యాపారములందు, స్నేహితులకు, ఇంటికి అధికముగా ఖర్చులు చేసెదరు. సృజనాత్మకమైన పనులయందు దృష్టి పెట్టినచో మంచి ఫలితము సాధించెదరు. ఆరోగ్యముపట్ల శ్రద్ధ వహించవలెను.

2021లో భారతదేశము, ఆంధ్రరాష్ట్రము, ప్రపంచము

              2021 సంవత్సరములో వచ్చు తెలుగు సంవత్సరము ప్లవనామ సంవత్సరము. ప్లవ మనగా తెప్ప అని ఒక అర్థము. ఈ సంవత్సరము ప్రపంచమును కష్టముల కడలిని దాటించునని ఆశించుదుము. ప్లవనామసంవత్సరమున సాయన జగల్లగ్నము సింహము, వర్షలగ్నము వృషభము అయినవి. ఈ సంవత్సరమున ఉగాది మంగళవారమున వచ్చుటచే రాజు కుజుడైనాడు. రాజు క్రూరగ్రహము కనుక దేశమునందు ఉత్పాతము, అగ్నిభయుము, విద్రోహచర్యులు  ఉండును. ఈ ప్లవసంవత్సరమును మంటతో కూడిన అగ్నిగా వర్ణించుటవలనకూడా అగ్నిప్రమాదములు, యుద్ధప్రమాదములు, ఉగ్రవాదచర్యులు ఉండును. ఈ సంవత్సరమునకు సంవత్సరాధిపతి బుధుడు. అందువలన వర్షములు ఎక్కువగా కురియును. జనము రోగములబారిన పడుదురు అని శాస్త్రవచనము. నవనాయకులు, ఉపనాయకులలో పాపు ఎక్కువగా ఉండుటవలనకూడా ప్రపంచమునకు కష్టములింకను తీరవని అర్థము.

              సాయన జగలగ్నమును పరిశీలించగా భారత దేశమునకు సంబంధించి లగ్నాధిపతి నవమమందు ఉండుట వలన ఈ దేశమునకు ఋషులు, పెద్ద అనుగ్రహములు ఉండునని తెలియుచున్నది. దేశమునకు వచ్చు కష్టములేవైనను జనులు ఆధ్యాత్మికశక్తిచేత దూరమగునని భావించవచ్చును. కాని భారతదేశరాశి అయిన మకరమునకు ఇది అష్టమము కనుక ఆర్థిక, ఆరోగ్యాదిరంగములందు దేశమున కష్టములింకను తీరవు. రాబడి తక్కువ ఉండును. వ్యయము ఎక్కువగా ఉండును. గృహ నిర్మాణములు, పంటలు, తోటలు, నీటిపారుదల మొదలగువాని కొఱకు, రక్షణ, సైనికరంగముకొఱకు ధనము వ్యయము చేయ వలసి వచ్చును. ఆదాయవ్యయములమధ్య అంతరము మాత్రము అధికముగానే ఉండును. మనతో స్నేహసంబంధమున్న దేశములకు సహాయము చేయుటకు కూడ ధనవ్యయము జరుగును. ఆరోగ్యరంగమునకు ప్రాధాన్యము లభించును. ప్రజల ఆరోగ్యము కొఱకు నూతనపథకము ప్రవేశపెట్టబడును. వాటికొఱకు వార్షికాదాయవ్యయపత్రము (బడ్జెట్‌) నందు ఎక్కువ ధనము కేటాయించుట జరుగును. శత్రుదేశములు, మనతో స్పర్ధ వహించు దేశములు తమ వక్రదృష్టిని మనపైన ప్రసరించుటచే దేశమునందు అల్లర్లు చెలరేగును. యుద్ధప్రమాదములు ఉండును. పొరుగుదేశముకు దాస్యము చేయు రాజకీయపక్షమువలన అల్లర్లు చెలరేగును. దేశమునందు నూతన ప్రదేశములో ఆయిల్‌, గ్యాస్‌ లభించును. శాస్త్రసాంకేతికరంగ ములు అభివృద్ధి చెందును. ఉద్యోగకల్పనకూడ ఉండును. ప్రయివేట్‌, కార్పొరేట్‌ రంగములు ఆధునికవిజ్ఞానమును అమలు పరచుటలో ముందుండును. వినోద పరిశ్రమయందు అనేక మార్పులు వచ్చును. మిత్రదేశములు కొన్ని ఘర్షణకు దిగును. దేశమునందు అంతర్గతముగా రాష్ట్రము కూడ కేంద్రముతో ఘర్షణ పడును. ఆదాయపంపకమునందు విభేదములు వచ్చును. అధికవర్షములు ఉండును కాని పంటనష్టము కూడా ఉండును. న్యాయవ్యవస్థపై నిందలు పడును. కానీ ధర్మము రక్షించ బడును. అంతరిక్షపరిశోధనలో విజయము కలుగును.

              ఆంధ్రరాష్ట్రము: తెలంగాణము: తెలుగురాష్ట్రములు రెంటియందు కూడ వ్యయభారములు, ఋణభారములు హెచ్చుగా ఉండును. ప్రభుత్వములు విద్యా,వినోద, ఆరోగ్య,జలపథకముల పేరున అమితముగా ఖర్చు పెట్టును. పొరుగురాష్ట్రములతో పోరు ఉండును. బ్యాంకులు మొదలైన ఆర్థికసంస్థలనుండి అప్పులు తెచ్చుకొనును. కొన్ని చట్టవ్యతిరేకమైన ఆర్థికలావాదేవీలు బయటపడును. రాజకీయపక్షములు అంతర్గతముగా కలహించుకొనును. పంటలు పండినను రైతులకు ధర గిట్టుబాటు కాదు. మొత్తము మీద తెలుగురాష్ట్రములకు ఇది గడ్డుసంవత్సరమని చెప్పవలెను.

              ప్రపంచము: ప్రపంచమున ఉగ్రవాద చర్యలు, యుద్ధభయములు, అగ్నిభయములు ఉండును. సాంకేతికత అభివృద్ధి చెందును. అమెరికాదేశము అంతర్గతముగా కలహముతో ఇబ్బంది పడును. కాని ఆర్థికముగా పుంజుకొనును. ఇంగ్లాండు. జర్మనీ, డెన్మార్క్‌, ఫ్రాంస్‌, ఇటలీ దేశములు కొంత అభివృద్ధి చెందును. ఆస్ట్రేలియా, ఐర్లండ్‌, జార్జియా దేశములు విదేశీయులను ఆకర్షించును.

ప్లవనామసంవత్సరం

అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్‌?

అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్‌??

              ఎల్లప్పుడు అగ్నిజ్వాలలతో కూడినవాడు, చీకటిని పోగొట్టువాడు, మేకమీద కూర్చొన్నవాడు, నాలుగు చేతులున్నవాడు, రెండు తలలు గలవాడు అయిన ప్లవ మనే పేరుగల అగ్నికి నమస్కరిస్తున్నాను.