.
అన్నలం ! తమ్ములం !
ఆత్మబంధులం మనం !
.
తార లెన్ని ఉన్నా
ఆకాశం ఒక్కటే !
మనుషు లెంద ఱున్నా
మనదేశం ఒకటే !
.
అన్నాదమ్ముల
మెందఱ మున్నా
కన్నతల్లి ఒక్కతే !
మనకన్నతల్లి ఒకతే !
.
‘ బలుబులు ’ వే ఱైనా
వెలు గంతా ఒకటే !
మనుషులు వే ఱైనా
మనలో వెలు గొకటే !
.
రేకు లెన్ని ఉన్నా
ఉన్నపూవు ఒకటే !
ఎన్నిమతా లున్నా
ఉన్నదేవు డొకడే !!
.
హిందువు మనవాడే !
ముస్లిము మనవాడే !
హిందూ ముస్లిం క్రైస్తవ పార్శీ
లందఱు మనవారే !
.
మనసులలో క్రీనీడలు పోతే
మనుషుల మందఱ మొక టౌతాము !
మనిషీ మనిషీ చేయి కలిపితే
మహినే స్వర్గము చేస్తాము !
ఈమహినే స్వర్గము చేస్తాము !
.
******************