10_018

.

ప్రస్తావన

ప్రస్తుతం మనదేశం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ఎటు చూసినా కల్లోలం. ఎవరి బ్రతుకుకీ భరోసా లేదు. ఈరోజు ప్రక్కవారి వంతు అయితే రేపు మనదవుతుందేమో అనే భయం. ఎంతో ధైర్యవంతులుగా కనబడే వారు కూడా పిరికి వారైపోతున్నారు. ‘ నాకేం కాదు, నేను చాలా ఆరోగ్యవంతుణ్ణి. యోగా సాధన చేస్తాను. అన్నీ ఆరోగ్యకరమైన అలవాట్లే. పైగా కసరత్తులు చేస్తాను. రోజూ ఉదయం పది కిలోమీటర్లు నడుస్తాను. జలుబు, జ్వరం అంటే ఏమిటో ఎప్పుడూ తెలియదు. ’ అని ధీమాగా ఉన్నవారు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఊపిరి నిలబెట్టే ఆక్సిజన్ కరువై పోతోంది. మహమ్మారి నుంచి రక్షిస్తాయని అనుకుంటున్న టీకా లను కూడా కొరత పీడిస్తోంది. కరోనాను అరికట్టే మందు ఏదీ ఇంకా అందుబాటులోకి రాకపోయినా దానివలన వస్తున్న ఇతర రుగ్మతలను తగ్గించే మందులకు రెక్కలొచ్చేసి నల్లబజారుకి ఎగిరిపోతున్నాయి. ప్రభుత్వం స్వయంగా పంపిణీ చేస్తున్న టీకాల పరిస్తితి కూడా అదే ! ఇక ప్రైవేట్ ఆసుపత్రులు బిల్లులు చుక్కలు చూపిస్తుంటే, ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది కొందరు రోగి సమాచారం ఇవ్వడం నుంచి ప్రతి సేవకీ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక ప్రక్క కరోనా పీడిస్తుంటే, మరో ప్రక్క ఇలాంటి స్వార్థపరులు పీడిస్తుండటంతో సామాన్య ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కనీసం ప్రభుత్వాలైనా కరోనాకి ఉపయోగించే అత్యవసర ఔషధాల మీద, టీకాల మీద పన్నులు వేయకుండా ఉంటే సామాన్యులకు కొంతలో కొంత ఉపశమనం.    

మరో ప్రక్క దేశంలో సింహభాగం ప్రజలకు ఈ మహమ్మారి పుణ్యమాని జీవనోపాధి కరువైపోయింది. ఎక్కడో కొంతమంది మహానుభావులు తప్ప ఆ ప్రజల శ్రమ సాయంతో ఎదిగిన, ఎదుగుతున్న వారి యజమానులు గాని, వారి సేవలను పొందే పెద్దలు గాని… చాలామంది వారిని ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. సోనూ సూద్ లాంటి కొందరు తమ ఉన్నతికి కారణమైన సామాన్య ప్రజలను మర్చిపోకుండా తమలోని సహృదయతను చాటుకుంటున్నారు. దానికి కూడా స్వార్థం రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. నిజానికి ఈ చర్యల వలన సహాయం అందించడానికి ఉత్సాహం చూపిన వారిలో నిరుత్సాహం చోటు చేసుకునే ప్రమాదం ఉంది. కనుక సాయం చెయ్యకపోయినా ఫర్వాలేదు. చేస్తున్నవారికి స్వార్థ ప్రయోజనాలు అంటకట్టడం మంచిది కాదు. అలాగే అవకాశం ఉన్నవారు అవస్థలు పడుతున్న తోటి వారికి వీలైనంత సహాయపడండిడితే బాగుంటుంది. ఈ సమయంలో వైద్యులు, వైద్య సిబ్బందిని ప్రజలు దైవాలతో సమానంగా భావిస్తున్నారు. స్వార్థాన్ని తరిమేసి వారికి సేవలను అందిస్తే వారిలో ఆ భావం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎంత డబ్బు సంపాదించినా అందరి గుండెల్లో ఇంతటి స్థానం సంపాదించడం జరగని పని.

ఈ ప్రపంచానికి సంక్షోభాలు క్రొత్తేమీ కాదు. మన దేశానికీ క్రొత్త కాదు. వాటిని సమర్థంగా ఎదుర్కొనే మేధస్సు ప్రపంచంలోని అన్ని దేశాలలో ఉంది. అందుకే ఏ సంక్షోభమైనా తాత్కాలికమే ! త్వరలోనే ఈ సంక్షోభం కూడా అంతమవుతుంది. అయితే అప్పటివరకూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే నష్టాలను చాలావరకు తగ్గించవచ్చు.

ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి      

మనవి : ప్రతి పేజీలో క్రింద ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు.  

.

కృతజ్ఞతలు : ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి వివరాలు –

22. శ్రీ చాగంటి ప్రసాద్, హైదరాబాద్ – రెండు సంవత్సరాలు – ₹. 1000/-

23. శ్రీమతి వాణీమోహన్, చెన్నై – ఒక సంవత్సరం – ₹. 600/-

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి.  

ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.

.

మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించవచ్చును.

Please Subscribe & Support

మీ చందా Google Pay UPI id : sirarao@okaxis ( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )

or Click here –> paypal.me/sirarao

********************************************************

.

*********************************

Please visit

సాహిత్య శారదీయం – శిరాకదంబం పేజీ

1. బృహదారణ్యకం

2. మహా మత్స్య – ఉపనిషత్కథ

3. అగ్నిరూపం

4. అను ష్ఠానం

5. అగ్ని మీళే పురోహితం

**********************************

ప్రకృతి ఒడిలో ‘ బడి ‘ గురించి పరిచయ వీడియో. పూర్తి కథనం త్వరలో