10_019 ఆనందవిహారి

Please visit this page

.

.

 

అమెరికాలోని చికాగో నగరంలో వైభవోపేతంగా అంతర్జాల వేదికపై జరిగిన “ వీణ సంప్రదాయాలు 2021 ”

.

అమెరికాలో సప్తవీణా ప్రదర్శనగా ఆరంభమై నేటికి శతవీణానాద ప్రవాహాన్ని చికాగో సంగీత వేదికల మీద ప్రదర్శనలు సాగిస్తూ, 33 సంవత్సరాలుగా అమెరికా గడ్డపైన మన భారతీయ శాస్త్రీయ సంగీత, నృత్య, సాహిత్య సాంప్రదాయాలకు వేదిక కల్పిస్తున్న శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( సప్నా ) తమ 17వ అంతర్జాతీయ వీణ ఉత్సవాలను ఈ సంవత్సరం ఏప్రిల్ 30, మే 01, 02 తేదీలలో అంతర్జాల వేదిక పైన నిర్వహించింది. 

.

సంగీత సాహిత్య వీణా గానరవళి “ రాగ యోగ – రాగ చికిత్స ” పేరుతో నిర్వహించిన “ వీణ సంప్రదాయాలు 2021 ” కార్యక్రమం మొదటిరోజు ఏప్రిల్ 30వ తేదీ శనివారం భారత కాలమానం ప్రకారం ఉదయం గం. 7.30 ని. ల నుండి గం. 10.30 ని. ల వరకు జరిగింది. మూడురోజుల కార్యక్రమానికి డా. శారదాపూర్ణ సంచాలన నిర్వహించారు. 

.

సప్నా వ్యవస్థాపకులు డా. శ్రీరామ్ శొంఠి దీప ప్రజ్వలన, స్వాగతోపన్యాసాలతో కార్యక్రమం ప్రారంభించారు.  డా. శారదాపూర్ణ శొంఠి స్వాగత వచనాలు పలికి సంస్థ ఆదర్శాలను వివరించారు. 1997 లో డా. శారదాపూర్ణ స్థాపించిన వేదవిద్యా పీఠం విద్యార్థిని షీలా కౌశిక్ వేద పఠనం చేశారు. 

.

వీణ ఉత్సవ కార్యక్రమాలను డా. షెల్లీ కుమార్ పరిచయం చేశారు. ఆనాటి కార్యక్రమంలో తొలి కచేరీ గా భారత దేశం నుంచి డా. మాధురీదేవి రామవరపు తన వీణతో అలరించారు. విశాఖపట్టణం నుంచి వారి శిష్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికాలోని చికాగో నగరానికి చెందిన రమ గురుపల్లి గారి వీణా వాద్య కచేరీ, వారి శిష్యుల ప్రదర్శన రెండవ కార్యక్రమం గా జరిగింది. 

.

ఆనాటి మూడవ కార్యక్రమం చికాగో వీణా విదుషీ భవ్య బెహతా గారి వీణ కచేరీ,  వీరి శిష్యుల ప్రదర్శనతో సాగింది. దక్షిణాఫ్రికా కు చెందిన డా. అర్చన శ్రీధర్ వీణ కచేరీతో ఆనాటి కార్యక్రమాలు ముగిశాయి. 

 

 

.

మే 01వ తేదీ రెండవ రోజు యథావిధిగా దీప ప్రజ్వలన, స్వాగత వచనాలు, వేద పఠనం, కార్యక్రమ పరిచయం అనంతరం అమెరికా కు చెందిన ‘ శ్రీకళాపూర్ణ ’ సరస్వతి రంగనాథన్ వీణ కతేరీ, వారి శిష్యుల ప్రదర్శనతో ఈ కార్యక్రమం మొదలయింది.  

 

 

 

.

ఆనాటి రెండవ కార్యక్రమంగా విఖ్యాత కళాకారిణి, చికాగో నగర వాసిని గురు ‘ శ్రీకళాపూర్ణ ’ రాజేశ్వరి పరిటి గారి వీణ కచేరీ జరిగింది. వారి శిష్యులు కూడా ఇందులో పాల్గొన్నారు.

.

ఆనాటి కార్యక్రమంలో మూడవ కచేరీ అమెరికాలోని టెక్సాస్ కి చెందిన విద్వాన్ & విదుషీ శ్రీనివాస్ & ఉమ ప్రభల గారల వీణ కచేరీ. అనంతరం జరిగిన పానల్ – చర్చా కార్యక్రమం డా. షెల్లీ కుమార్, డా. శారదాపూర్ణ నిర్వహించారు. ఈ చర్చా సమావేశాలు గత 17 సభలలో ముఖ్య భాగంగా వీణ విద్య విషయాలనందిస్తూ ఆసక్తి పెంచుతున్నాయని చర్చలో భాగంగా శారదాపూర్ణ తెలిపారు.

.

మూడవరోజు, చివరిరోజైన మే 02వ తేదీన యథావిధిగా దీప ప్రజ్వలన, స్వాగత వచనాలు, వేద పఠనం, కార్యక్రమ పరిచయం అనంతరం భారత దేశానికి చెందిన ‘ శ్రీకళాపూర్ణ ’ డా. ఈమని కళ్యాణి గారి వీణ కచేరీ జరిగింది. 

.

ఆనాటి రెండవ కార్యక్రమంగా అమెరికాకు చెందిన ‘ శ్రీకళాపూర్ణ ’ డా. జయశ్రీ ప్రసాద్ గారి కచేరీ జరిగింది. వారి శిష్యులు కూడా పాల్గొన్నారు. 

 

 

.

భారత దేశానికి చెందిన డా. సుమ సుధీంద్ర గారి వీణ కచేరీతో ఆనాటి కార్యక్రమాలు దిగ్విజయంగా ముగిశాయి. 

.

బ్రహ్మశ్రీ డా. కాశీనాధుని మహేశ్వర ప్రసాద్ గారికి ‘ శ్రీకళాపూర్ణ ’ పురస్కారం మరియు సత్కారం, భారత దేశానికి చెందిన ఆచార్య భాష్యకారాచార్యులు విక్కిరాల గారికి ‘ నవ రస నటనా ధురీణ ’ బిరుద ప్రదాన కార్యక్రమ అనంతరం నిర్వాహకుల వందన సమర్పణతో మూడు రోజుల “ వీణా సంప్రదాయాలు 2021 ” కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి.

 

 

 

.

***************************************************************************

.