10_019 ద్విభాషితాలు – నిజఫలం

Please visit this page

.

.

అతను…

మా ఇంటి ముందు బండి పై..

మామిడి ఆపిల్ ఫలాలను..

వరుసగా ఒక దానిపై మరొకటి…. సుందర నిర్మాణంలా పేర్చిన తీరు…

కళ్ళకు తీయని రుచులనందిస్తుంది.

.

సన్నని పదునైన కత్తితో…

అతను బొప్పాయిపండుపై  చెక్కును..

లాఘవంగా తీసి..

అరటి ఆకు ముక్కలో  అందిస్తుంటే..

ఓ ప్రకృతి సౌందర్యాన్ని…

దోసిళ్ళలో ప్రదర్శిస్తున్నట్లుంటుంది. నిమిషం నుంచుంటే కాళ్లు లాగి… సుఖాసనం కోసం వెతికే నాకు..

రోజును  రెండు కాళ్లమీదా మోసే అతని ఓర్పు…

ఓ పాఠం అవుతుంది.

.

కుటుంబం రోడ్డున పడకుండా.. తాను రోడ్డు మీద నిలబడి…

పండ్లను పైసలు గా మారుస్తూ… తన కుమారుని విద్యగా మలచిన అతని దార్శనికత…

నాకు ఆదర్శం అవుతుంది. ప్రయోజకుడైన తనయుడు..

తండ్రి ఋణం  తీర్చుకోడానికి.. నగరంలోని తన నివాసానికి…

అతన్ని  తీసుకుపోయినపుడు..

ఆ కళ్లలో అనంతమైన గర్వం..

తొంగిచూసింది.

అతనులేక మావీధి బోసిపోయినా.. అతనికి తగిన ఫలితం దక్కిందనుకొన్నాను.

.

కానీ…

నిన్న ఉదయం…

మా ఇంటి ముందు…

ఎప్పటిలాగే నిలబడి…

రెట్టించిన ఆనందంతో…

ఫలాల్ని బండి పై వరుసగా పేరుస్తూ  మళ్ళీ అతను!!

.

**************************

.