10_019 తో. లే. పి. – మద్దాళి ( కిన్నెర ) రఘురాం

Please visit this page
.

.

హైదరాబాద్ నగరంలో సాంస్కృతిక రంగంలో పేరొందిన ప్రముఖులలో ఒకరు శ్రీ మద్దాళి రఘురామ్ గారు. కాగా ‘ కిన్నెర ’ రఘురామ్ గా ఆయన అందరికీ చిర పరిచితులు. సంగీతం, సాహిత్యం ఆయనకు అభిమాన విషయాలు కావడంతో ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని సభాముఖంగా సన్మానించి, తద్వారా సరస్వతీసేవలో తరించారు. రఘురామ్ గారు కిన్నెర వ్యవస్థాపక కార్యదర్శిగా గత 40 సంవత్సరాలకు పైగా వ్యవహరిస్తూ, విశిష్ట కార్యక్రమాలను అనేకం రవీంద్రభారతి, తదితర కేంద్రాలలో విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. అలుపెరుగని బాటసారి ఆయన… ఆయన తలపెట్టి నిర్వహించే అనేకానేక కార్యక్రమాల్లో ఆయనకు తన స్నేహ హస్తాన్ని అందిస్తూ చేదోడువాదోడుగా ఉంటూన్న వ్యక్తి మరెవరో కాదు !… ఆయనకు సహధర్మచారిణి, ప్రసిద్ధ నాట్య కళాకారిణి అయిన డా. శ్రీమతి ఉషాగాయత్రి… సాహితీసేవ విషయప్రస్తావనకి వస్తే కిన్నెర పబ్లిషర్ గా 2014 నాటికి దాదాపుగా 105 గ్రంధాలను రఘురామ్ ప్రచురించారు.

.

1980 లో కిన్నెర పబ్లికేషన్స్ స్థాపించబడింది. 

అంతేకాదు.. కిన్నెర చిత్ర నిర్మాతగా పదిమంది తెలుగు ప్రముఖుల జీవిత చరిత్రపై  డాక్యుమెంటరీ చిత్రాలను నిర్మించి, మూడు నంది అవార్డులను కైవసం చేసుకున్నారు. ఈయన వ్రాసిన ” వెన్నెల కన్నీరు ” కవితా సంపుటి 1981 లో ఆవిష్కరించబడింది..

.

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా, 2012 లో ఆవిష్కృతమైన 1200 మంది రచయితల బయోడేటాలతో కూడిన ‘ తెలుగు రచయితల డైరక్టరీ ‘ కి రఘురామ్ సంపాదకత్వం వహించారు. 99వ గ్రంధంగా ‘ తెలుగు కిరణం ‘ విడుదల అయింది. ప్రముఖ చిత్రకారుడు శ్రీ చంద్ర  బొమ్మలతో 102 వ గ్రంధంగా విడుదల అయిన పుస్తకం ‘ తెలుగు ప్రముఖులు ‘. ఇక 104 వ గ్రంధంగా విడుదల అయిన పుస్తకం ‘ తెలుగువారి గుండెల్లో గుమ్మడి ‘

2014 లో సెప్టెంబరు మాసంలో 106 వ గ్రంధంగా విడుదలైన పుస్తకం ‘ అక్కినేని అభిమానిగా ‘.

.

అక్కినేని జన్మదినాన్ని పురస్కరించుకొని అక్కినేని స్వర్ణ కంకణ ప్రదానం జరుగుతూ ఉండేది. చాలాకాలం కొనసాగిన ఈ కార్యక్రమం ముగింపుకి వచ్చి, 2013లో చివరి కార్యక్రమంగా కిన్నెర సంస్ధ నిర్వహణలో ఈ స్వర్ణ కంకణాన్ని ప్రముఖ సాహితీమూర్తి డా. శ్రీ ఓలేటి పార్వతీశం గారికి ప్రదానం చేయడం జరిగింది.

.

1998 ప్రాంతాల్లో రవీంద్రభారతిలో గానకోకిల శ్రీమతి పి. సుశీల గారిని కిన్నెర  సంస్ధ సన్మానించడం జరిగింది. నాటి కార్యక్రమానికి నేను కూడా హాజరయ్యాను. కార్యక్రమాన్ని అంతా వీడియో తీసారు. ఆ వీడియో కాపీ కోసమని శ్రీ రఘురామ్ గారిని సంప్రదించడం జరిగింది. అందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ నాకు ఉత్తరాన్ని వ్రాసారు. ఆయన ఆనాడు వ్రాసిన ఆ ఉత్తరమే ఈనాటి తోక లేని పిట్ట. దయచేసి ఆ తోకలేని పిట్ట‌‌‌ ను వీక్షించి,  మీ అమూల్య స్పందనను పోస్టు చేయండి.

.

.

<><><>***ధన్యవాదాలు~ నమస్కారములు***<><><>