.
ప్రస్తావన
.
“ పుట్టిన వారు మరణించక తప్పదు ” అన్నాడు గీతాకారుడు. మానవ జీవితంలో సహజమైన, తప్పనిసరి అయిన మరణం గురించి చింతించడం తగదని కూడా హితవు చెప్పాడు. అయినా అంతకాలం మన మధ్యన ఉండిన వారు అకస్మాత్తుగా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారన్న విషయం గురించి బంధువులు, సన్నిహితులు వెంటనే జీర్ణించుకోలేరు. వారి మద్య ఉన్న సన్నిహితత్వం అందుకు అవకాశం ఇవ్వదు. అప్పుడు కొంతకాలం వరకు ఈ హితవులు వలన ఉపయోగం ఉండదు.
మానవ జీవితంలో మరణం అనివార్యమని తెలిసినా సునాయాస మరణాన్నే అందరూ కోరుకుంటారు. దురదృష్టవశాత్తూ ఇప్పుడు విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి బారిన పడ్డ చాలమందికి చాలా యాతనతో కూడిన మరణాన్ని ప్రసాదిస్తోంది. అదృష్టవశాత్తూ కోలుకున్న వారు కూడా నరకయాతన అనుభవించాకే కోలుకుంటున్నారు. ఊపిరి ఆడనివ్వదు. ఊపిరి నిలబెట్టే ఆక్సిజన్ సమయానికి దొరికితే సరే ! లేకపోతే నరకమే. నిర్లక్ష్యం చేస్తే కరోనా శరీరంలోని ఇతర అవయవాల మీద కూడా దాడి చేస్తోంది.
ఇది మనిషికి కరోనా వైరస్ చేసే హాని అయితే అంతకంటే పెద్ద వైరస్ మనిషి మస్తిష్కంలో పుట్టింది. అదే ప్రజలలో కరోనా భయాన్ని వ్యాపారం చేసి దోచుకోవడం. ప్రజలు కట్టిన పన్నులతో మనుగడ సాగిస్తున్న ప్రభుత్వాలు ఆ పన్ను ఆదాయంలో కొంతైనా ఖర్చు పెట్టి ప్రజల ప్రాణాల కాపాడే ఆలోచన చేయకుండా కరోనా టీకాల మీద, మందులు మొదలైన వాటి మీద పన్నులు వడ్డిస్తోంది. కనీసం ఈ ఉపద్రవం కొంత శాంతించేవరకైనా ధరలను నియంత్రించి, పన్నులను రద్దు చేస్తే ప్రజలకు కొద్దిగానైనా ఉపశమనం లభిస్తుంది. దీన్ని ప్రశ్నించే వారు ఎవరూ కనబడడం లేదు. ప్రశ్నించడం మన హక్కు అని కూడా ఎవరూ గుర్తించడం లేదు. ‘ ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా ’ అని సామెత. ప్రజా సంక్షేమం కోసం పని చెయ్యవల్సిన ప్రభుత్వాలు పన్నులతో ప్రజల నడ్డి విరుస్తుంటే ప్రైవేట్ వ్యాపారులు, వ్యాపారం కోసమే ఉన్న కార్పొరేట్ ఆస్పత్రులు వంటివి దోపిడీ చేయకుండా ఎలా ఉంటాయి ? వాటికి దారి చూపించినవి ప్రభుత్వాలయితే అవకాశం ఇచ్చింది మాత్రం మన అలసత్వమే. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ విపత్కర పరిస్థితుల్లో వ్యక్తి పూజలు, పార్టీల అభిమానాలు, రాజకీయాలు వంటివి ప్రక్కన పెట్టి కరోనా నిర్మూలన, ప్రజారోగ్య పరిరక్షణ మాత్రమే లక్ష్యంగా దేశ ప్రజలందరూ ఒక్కత్రాటి మీద నిలబడి పోరాడవలసిన తరుణం వచ్చేసింది. మనలోని అలసత్వాన్ని వదిలిపెట్టి నాణ్యమైన వైద్యం పొంది ఈ ఉపద్రవం నుంచి బయిట పడే ఆలోచన చెయ్యాలి.
ఈ కరోనా కారణంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ మహమ్మారి ఎందరికో నరకం చూపిస్తోంది. అలసత్వం వహిస్తే రేపు మనవంతు కూడా రావచ్చు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం సరైన పద్ధతి కాదు.
అన్నిటికంటే ముందు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా, అతి విశ్వాసంతో అనవసరంగా బయిట తిరిగి, ఉత్సవాల్లో, సమావేశాల్లో పాల్గొని మనకి మనమే నష్టం చేసుకుంటున్నాం. అందుకే…..
.
ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి
.
***********************************************************************************************************
మనవి : ” శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు.
***********************************************************************************************************
.
కృతజ్ఞతలు : ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి వివరాలు –
- శ్రీ చాగంటి ప్రసాద్, హైదరాబాద్ – – రెండు సంవత్సరాలు ₹. 1000/-
- శ్రీమతి వాణీమోహన్, చెన్నై – ఒక సంవత్సరం – ₹. 600/-
.
చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి.
ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.
.
మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించవచ్చును.
.
Please Subscribe & Support
.
మీ చందా Google Pay UPI id : sirarao@okaxis ( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.
అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.
వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com
.
‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –
.
.
Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )
or Click here –> paypal.me/sirarao
********************************************************
.
*********************************
Please visit
సాహిత్య శారదీయం – శిరాకదంబం పేజీ
**********************************
ప్రకృతి ఒడిలో ‘ బడి ‘ గురించి పరిచయ వీడియో…. పూర్తి కథనం త్వరలో…