10_021

.

ప్రస్తావన

పాఠకుల ఆదరణ, ప్రోత్సాహం తో ‘ శిరాకదంబం ’ అంతర్జాల పత్రిక ప్రారంభించి ఈ ఆగష్టు 15 వ తేదీకి పది సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఒక దశ పూర్తి చేసుకుని క్రొత్త దశాబ్దం లోకి అడుగు పెడుతోంది. అంతర్జాల పత్రికలు అప్పుడప్పుడే ప్రాముఖ్యత సంతరించుకుంటున్న సమయంలో, అది కూడా ఉద్ధండులైన రచయితల సహకారంతో మహారాజపోషకుల దన్నుతో కొన్ని మాత్రమే పత్రికలు అంతర్జాలంలో కనిపిస్తున్న రోజుల్లో మొదలైన ఈ ప్రస్థానం ముద్రణ రంగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పత్రికలను మరపించే విధంగా ఎన్నో పత్రికలు అంతర్జాలంలో విహారం చేస్తున్న ఈ రోజుల వరకు ‘ శిరాకదంబం ’ ప్రస్థానం కొనసాగింది…… కొనసాగుతూనే ఉంటుంది. ఈ దశాబ్ద కాలంలో ప్రారంభమయిన ఎన్నో అంతర్జాల పత్రికలు కొద్ది రోజులు మాత్రమే కనిపించి మాయమైనా కొన్ని మాత్రమే తమ ప్రయాణాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నాయి. అందులో ఒకటి ‘ శిరాకదంబం ’ అని గర్వంగా చెప్పగలం.  

ప్రారంభం నుంచీ అంతర్జాలంలో క్రొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంది శిరాకదంబం. పెద్దల కోసమే కాదు. పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. రాబోయే కాలంలో మరిన్ని నవ్యమైన, వైవిధ్యమైన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రణాళికలు రచించడం జరుగుతోంది. రసజ్ఞులైన పాఠకుల, శ్రేయోభిలాషుల సహకారంతో విజయవంతంగా నిర్వహించగలమని పూర్తి నమ్మకం. 

పాఠకులే పత్రికకు నిజమైన శ్రేయోభిలాషులు. అందుకే దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న ‘ శిరాకదంబం ’ గురించి పాఠకుల స్పందనను ఆహ్వానిస్తున్నాం. మీ స్పందనను వీలైనంత క్లుప్తంగా, మీ పేరు, ఇమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ వంటి వివరాలతో జూలై చివరి లోగా పంపించండి. వార్షికోత్సవ సంచికలో ప్రచురించడం జరుగుతుంది.

మనవి :  అనివార్య కారణాలు, ముఖ్యంగా సాంకేతిక సమస్యల వలన జూలై నెల 01 వ తేదీకి సంచిక వెలువడలేదు. అందుకు క్షంతవ్యులం. ఇకపైన యథావిధిగా క్రమం తప్పకుండా వెలువడుతుందని హామీ ఇస్తున్నాం.

కరోనా ఇప్పుడు మూడో దశలోకి ప్రవేశిస్తోందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దాని ప్రభావం ఎలా ఉన్నా, రెండో దశలోని అనుభవంతో ఈసారి మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ కరోనా ప్రభావం వలన మన జీవనోపాధికి ఎంతగానో ఇబ్బంది ఏర్పడుతోందన్నది నిజం. కానీ కొంతకాలం ఆ ఇబ్బందిని భరించి పూర్తి జాగ్రత్తలు తీసుకుంటే ఈ కరోనా నుంచి త్వరగా బయిట పడవచ్చేమో ! కొంతకాలం ఇబ్బందిని భరించడానికి ఇష్టపడకపోతే దీర్ఘకాలం ఈ కరోనాతో మరింత భయంకరమైన పోరాటం తప్పదనేది నిపుణుల అంచనా. ఇలా సంవత్సరాల తరబడి భయంతో, ఒత్తిడితో బతకడం కంటే కొద్ది రోజుల పాటు మనల్ని మనమే నియంత్రించుకోవడం ఉత్తమం అని అందరం గ్రహించి స్వీయ నియంత్రణకు సిద్ధమవుదాం. తద్వారా రాబోయే కొత్త మహమ్మారి ముప్పు నుంచి మాత్రమే కాక ఈ కరోనా పీడ శాశ్వతంగా వదిలించుకునే ప్రయత్నం చేద్దాం.

.

ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి

.

******************************************************************************************

 మనవి :శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు. 

******************************************************************************************

.

 కృతజ్ఞతలు : ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి.  

ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.

.

మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.

.

Please Subscribe & Support

.

మీ చందా Google Pay UPI id : sirarao@okaxis ( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

.

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

.

.

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )

or Click here –> paypal.me/sirarao

********************************************************

.

*********************************

Please visit

సాహిత్య శారదీయం – శిరాకదంబం పేజీ

1. బృహదారణ్యకం

2. మహా మత్స్య – ఉపనిషత్కథ

3. అగ్నిరూపం

4. అను ష్ఠానం

5. అగ్ని మీళే పురోహితం

**********************************

ప్రకృతి ఒడిలో ‘ బడి ‘ గురించి పరిచయ వీడియో. పూర్తి కథనం త్వరలో