.
ఎట్టున్న భూమిని ఇట్టు జేసినావు
చెట్టుసేమ లేని గుట్ట జేసినావు
.
పొలితీన్ తోని పశువుల పానాలు
కాలుష్యం తోని మనుషుల పానాలు
ఇట్టే లాగేసి, నగరీకమంటూ,నగుబాటు లేకుండా పేరెట్టినావు
ఎంత వెర్రి నీకురా ఓ మనిషి
చెట్టు, మట్టి తోనే నీ బతుకు.
గాలి, నీరు నీకిచ్చు ఆయుష్షు
.
హోరున సడులు జేసే యంత్రాలు
మందు మాకులేసి పెంచిన పైరులు
ఊరి చెరువులోన రసాయనాలు
ఊరు మధ్యనే కర్మాగారాలు
పచ్చని ధరణిని బీడు జేసినావు
నదులు, సెరువుల్ని కబ్జా జేసినావు
.
మొక్కని నీవు పెంచర, రేపు ఆశకి ఉతమివ్వర
గాలి కి నీటికీ కలుష మంటనీక
పెద్ద దైవమోలే ప్రేమించి చూడరా
అమ్మ వంటి అవని ఆనందిస్తాది
బతుకుని పెంచే భరోసా ఇస్తాది
నవ మాసాలే అమ్మ మోస్తది
నువ్వు ఉండే దాకా ధరణి మోస్తది
.
***************************************************