11_003 పెళ్ళికి రండి – ఆనందం ఈవేళ

జోశ్యుల ఉమ, జోశ్యుల శైలేష్ ల స్వరకల్పన, ఉమా శ్యాంసుందర్ మరియు లక్ష్మి రామసుబ్రహ్మణ్యం గానంలో సరదాగా సాగే తెలుగు వారి పెళ్లిపాటల సంకలనం “ పెళ్ళికి రండి ” నుంచి మొదటి పాట ……

అమ్మాయిని పెళ్ళికూతుర్ని చేసేటప్పటి పాట ఆనందం ఆనందం ఈవేళ పిల్ల పెళ్ళికూతురాయె ఈవేళ నిను పెళ్ళికూతుర్ని చేసేటి శుభవేళ తోడ పెళ్ళికూతురితో మురిసేటి ఈవేళ ఆనందం…. నీ పెళ్ళిపనులింట ఉత్సాహమే నింప నీకు కానుకలిచ్చి ఎల్లరు దీవింప ఆనందం… ఆయురారోగ్యములతో పసుపుకుంకుమలతో నీవు కలకాలం వర్ధిల్లు ఆనందం ఇనుమడింప ఆనందం…