11_003

.

ప్రస్తావన

.

.

పాఠకులకు, చందాదారులకు, శ్రేయోభిలాషులకు దసరా శుభాకాంక్షలు.

దసరా అంటేనే సరదా. సృష్టికి మూలంగా పూజలందుకునే అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ అయిన ఆదిశక్తిని అనేక రూపాలలో కొలుచుకునే పండుగ ఈ దసరా. నిజానికి మన పండుగల్లో సింహభాగం చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటాము. అందులో దసరా, దీపావళికి మరింత ప్రత్యేకత ఉంది. వీటిలో ప్రధాన పాత్రధారులు మహిళలే ! లోకాన్ని కాపాడటానికే వీరు తమ శక్తియుక్తుల్ని ఉపయోగించారు. ‘ అమ్మ ’లనిపించారు. స్త్రీ శక్తి ఏమిటో లోకానికి చాటారు.

పురాణాల్లోనే కాదు…. చరిత్రలో కూడా అవసరమైనపుడు ఆదిశక్తిగా విజృంభించి పోరాటం చేసిన వీర వనితలు ఎందరో మనకి కనిపిస్తారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో తమ కుటుంబాలని, సుఖసంతోషాలను, భోగభాగ్యాలను విడిచిపెట్టి రంగంలోకి దూకిన మహిళలు ఎందరో ఉన్నారు. కారాగారాలను కూడా తమ పోరాట వేదికగా చేసుకుని మరెందరినో తమ మార్గంలోకి రావడానికి స్పూర్తినిచ్చారు. స్త్రీలు అబలలు…… వీధి మొహం చూడకూడదు….. అనుకునే రోజుల్లోనే ఆ బంధనాలను ధిక్కరించి తాము అనుకున్నది సాధించడానికి ఏ సాహసం చెయ్యడానికైనా వెనుకాడని మహిళలు ఎందరో ! ఏ ఆధునిక సమాచార సౌకర్యాలు, ఆత్మరక్షణ సాధనాలు లేని రోజుల్లోనే మహిళలు ధైర్యంగా నిలబడ్డారు. అన్యాయాల మీద తిరగబడటానికి కావల్సింది శారీరిక బలం కాదు…. ఆత్మ విశ్వాసం ముఖ్యం అని నిరూపించిన వారెందరో !  

రాక్షసులు అప్పుడూ… ఇప్పుడూ… ఎప్పుడూ ఉన్నారు. వారి అఘాయిత్యాలు, ఘోరాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని రక్షణలు కల్పించినా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. ఎంతో అభివృద్ధి సాధించామనుకున్న ఈ రోజుల్లో కూడా స్త్రీల మీద జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తుంటే మహిళల్లో ఆ ఆత్మ విశ్వాసం కొరవడిందా అనే అనుమానం కలుగుతోంది. క్రొత్త క్రొత్త చట్టాలను ఎన్నిటినో రూపొందిస్తున్నా వాటి అమలులో చిత్తశుద్ధి కొరవడుతోందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కంచె చేను మేయడం మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. బాధితులకు అండగా నిలబడుతున్నాం అని చెప్పుకునే మీడియాలో వచ్చే కథనాలు బాధితుల కంటే నేరస్తులకి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటున్నాయని చెప్పుకోవచ్చు.

కాబట్టి ఏదైనా సంఘటన జరిగినపుడు ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూస్తూ కూర్చోవడం కంటే బాధితురాలికి ముందుగా కుటుంబం, సమాజంలోని ప్రతి మహిళా మద్దతుగా నిలబడాలి. అప్పుడే చట్టాలు, వ్యవస్థలు శక్తివంతంగా పని చేస్తాయి. మహిళలు ముఖ్యంగా యువతులు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా అప్రమత్తంగా ఉంటే మోసాలు, ఘోరాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి.

ఈ దసరా సందర్భంగా ఆ ఆదిశక్తిని స్ఫూర్తిగా తీసుకుని ఆత్మవిశ్వాసంతో మహిళలు ముందడుగు వెయ్యాలి.       

******************************************************************************************

.

 
 

కరోనా జాగ్రత్తలు పాటించండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.

ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి.

మనవి :శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు. 

కృతజ్ఞతలు

ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి. ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.


మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.

Please Subscribe & Support


మీ చందా Google Pay UPI id : sirarao@okaxis

( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

           

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )

or Click here –> paypal.me/sirarao

Please visit

సాహిత్య శారదీయం
– శిరాకదంబం పేజీ