11_004 అభిప్రాయకదంబం

                                                                  

                                                                11 _003 

 

“ పత్రిక ” గురించి…..

మీ నూతన సంచిక చాలా బాగుంది. అభినందనలు.

దసరా పండగలకి. మీకు శుభాశీస్సులు

మీ ఆయుధం,శిరాకదంబం అద్భుతమైన కదంబం గా వర్ధిల్లాలి. శుభాశీస్సులు

– వాణి

 

“ బంగరుతల్లి కనకదుర్గమ్మ ” గురించి…..

ఎంతో దైవికంగా ఉంది సుబ్బారావు బాబాయ్ గారు మీరు రాసిన ఈ అమూల్యమైన పాట..అంటే అద్భుతంగా శాంతి అక్క పాడారు. ఎంత బావుందో ఆ అమ్మ పాట..ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు మనందరి మీదా ఉండాలని ప్రార్ధిస్తున్నాను.

– లేళ్ళపల్లి శ్రీదేవిరమేష్, చెన్నై

“ పెళ్ళికి రండి – ఆనందం ఈవేళ ” గురించి….

ఉమా జోష్యుల ఆంటీ శైలేష్ గారు మీ బృందం పాడిన ఈ పెళ్ళి పాట వింటుంటే ఆనందంగా ఉంది. మీ బృందానికి హృదయపూర్వక అభినందనలు.

– లేళ్ళపల్లి శ్రీదేవిరమేష్, చెన్నై

“ పాకశాల 1 ” గురించి…….

శ్రీదేవి! పాకశాలలో మీరు చెప్పిన రెండు వంటకాలు ఆసక్తికరంగా ఉన్నాయి, ముఖ్యంగా పెసర పులిహోర! నేను తప్పకుండా ట్రయి చేస్తాను!

– Syamala Dasika

శిరాకదంబం పాకశాల లో రెండు వంటలు అద్భుతం.  ఆగ్రాపేటా చేసి చూస్తా.

– గుణోత్తమ,

గోపాలపురం, హైద్రాబాద్

 

బూడిదగుమ్మడి  హల్వా ” ఆగ్రా పేట “అద్భుతం.  

– సంధ్య గొల్లమూడి,

రచయిత, pure సంస్థ డైరెక్టర్, హైదరాబాద్

 

మీ వంటలు చాలా రోజుల నుండి చవిచూస్తున్నాము..

Face book లో..మీరు పాకశాల లో చేసిన వంటలు చూసాము..మీ వంటలు అద్భుతం..అభినందనలు💐

– బూరా దేవనందం,

రచయిత

 

శిరాకదంబం పాకశాల లో నువ్వు చేసిన రెండు వంటకాలు బావున్నాయి హృదయ పూర్వక  అభినందనలు శ్రీ 😍🌺

– మన్నెం శారద,

ప్రముఖ రచయిత్రి