అనగనగా ఒకలేడి ఉన్నది !
అందా లోలికేకన్ను లున్నది !
అడవిని నీటిని త్రాగేటప్పుడు
అది తననీడను చూచుకొన్నది !
తనందానికి తానే మురియుచు
మనస్సులో నిటు తలచుకొన్నది !
‘ వంపుసొంపుల నా కొమ్ములలో
వాడనివీడనిఅందా లున్నవి !
సన్నగ కీసగ ఉండే కాళ్ళే
ఉన్న అందమునుచెఱచుచున్నవి !
నీటిని త్రాగేలేడిని నవ్వుల
వేటకా డొకడు చూచాడు !
వాటముగా ఆలేడి నేయగా
వాడి బాణమును వదిలాడు !
కంగా రై ఆ పిరికిలేడి తన
కాలికొలది పరుగెత్తింది !
చెట్టులు పుట్టలు దాటుచుండగా
నట్టడవిని పొద అడ్డింది !
చిలవలు పలవలు వేసినకొమ్ములు
చిక్కుకొన్న వొకముళ్లడొంకలో !
పరుగెత్తుట కిక కాళ్ళు రాక అది
ఒరిగిపోయినది చూచునంతలో !
అందము చెఱచిన వనుకొనుకాళ్లే !
ప్రాణము కాపాడినవి !
అందమైన వనుకొన్నకొమ్ములే
ప్రాణము తీసినవి !
——- ( 0 )——–