11_004

.

ప్రస్తావన

.

తెలుగు భాషకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది పద్య సాహిత్యం. అందులోనూ శతక పద్య సాహిత్యం. తేలికైన పదాలలో కూడిన పద్యాలు దీని ప్రత్యేకత. పండితుల కోసం ఛందస్సు మీద ఆధారపడిన పద్యాలు ఒక ప్రక్క ఉండగా పామరులకు కూడా సులభంగా అర్థమయ్యే విధంగా రూపొందించిన పద్య సాహిత్యంలో శతక పద్యాలది అగ్రస్థానంగా చెప్పవచ్చు. ఎన్నో శతకాలు వచ్చాయి. కొన్ని భక్తి ప్రధానంగా ఉంటే, ఇతర విషయాల మీద కొన్ని రచనలు వచ్చాయి. అయితే ఎక్కువగా సాంఘిక దురాచారాల మీద యుద్ధం ప్రకటించినట్లు అనిపిస్తే మరికొన్ని మంచి మార్గాన్ని సూచించేవిగా, కర్తవ్య బోధ చేసేవిగా ఉంటాయి. కొన్ని మెత్తగా చెబితే మరికొన్ని కొంచెం కటువుగానే చెబుతాయి. అనేక నానుడులు, సామెతలు వీటిలో దొర్లుతూ ఉంటాయి. ఏమైనా శతక పద్యాలు తెలుగు వారి జీవితాల్లో భాగంగా ఉండేవి.

.

మానవ జీవన గమనంలో ఇటీవలి కాలంలో వేగంగా వచ్చిన / వస్తున్న మార్పులకు తెలుగు గడ్డ కూడా లోనయింది. మిగిలిన ప్రాంతాల వాళ్ళతో పోలిస్తే కొండొకచో ఎక్కువగానే ప్రభావితమైందని అనుకోవచ్చు. వాళ్ళు ఆధునిక జీవనశైలిని అనుసరిస్తూనే వాళ్ళ భాషని, సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు వారు మాత్రం ఆధునిక జీవన శైలి, పర భాషా వ్యామోహం పెంచుకుంటూ పోతున్నారు. తమ పిల్లలను తెలుగుకు దూరం చేస్తున్నారు. ఇంట్లో కూడా పరభాష మాట్లాడటమే ఆధునికత అనే భ్రమలో ఉన్నారు. ఇలాగే కొనసాగితే కొంతకాలానికి తెలుగు భాష కనుమరగయ్యే ప్రమాదముందని మాతృభాషా ప్రేమికులు భయపడుతున్నారు. పరిస్థితులు గమనిస్తే అది నిజమే అనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది పిల్లలకు మన తెలుగు భాష తెలియని పరిస్థితి. పద్యాలు అంటే అర్థం కాదు. పిల్లల్లో ఎక్కువమంది ఇష్టపడి వినే సంగీతం సినిమా సంగీతమే. అందులో భారతీయ సంగీత బాణీలు ఉంటే ఇష్టపడరు. పాశ్చాత్య సంగీత బాణీలు, అర్థం కాకుండా ఉండే సాహిత్యం ఉంటేనే వారు వినే పరిస్థితి. తెలుగులో ఒక వాక్యం కూడా సరిగా చదవలేని పరిస్థితి. చాలామంది పిల్లలు అక్షరాలను గుర్తు కూడా పట్టలేరు. ఇక ఒత్తులు, సంయుక్తాక్షరాలను గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఒకప్పుడు ఆకాశవాణి, దూరదర్శన్ లు వాడే భాష ప్రామాణికంగా తీసుకునే పరిస్థితి. ఇప్పుడు వాటిలో కూడా భాష పైన శ్రద్ధ ఉండటంలేదు. ఇక ప్రైవేట్ టీవీ ఛానల్స్ గురించి చెప్పనవసరం లేదు.

.

ఇటువంటి పరిస్థితుల్లో తెలుగు భాషను కాపాడుకోవడానికి, ముందు తరాలకు భాషతో బాటు సాహిత్యాన్ని కూడా అందించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఎన్నో అధ్యయనాలు, చర్చలు జరుగుతున్నాయి. ఈ బాధ్యత తెలుగు వారైనా వారందరూ తీసుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు మాతృభాష నేర్పించడం, వాళ్ళతో తెలుగులోనే మాట్లాడటం, వాళ్ళకి మన సాహిత్యాన్ని, సంస్కృతినీ పరిచయం చెయ్యడం చాలా ముఖ్యం. మనదైన భాష ను కాపాడుకుంటేనే మనకి ఉనికి. పరాయి భాష ఎప్పటికీ పరాయి భాషే. అవసరానికి వాడటం వరకు ఫర్వాలేదు. కానీ దాన్ని స్వంతం చేసుకోవాలనుకునే కోరిక కల గానే మిగిలిపోయే అవకాశాలే ఎక్కువ. ఇటు మన భాషకు కూడా దూరమవుతారు.

.

తెలుగు భాష ను, సాహిత్యాన్ని ముందు తరాలకు అందించే విషయంలో తెలుగు రాష్ట్రాలలో ఉన్నవారి కంటే ప్రవాసాంధ్రులు ముందంజలో ఉన్నారని చెప్పవచ్చనుకుంటాను. తెలుగు నేర్పే బడులు నిర్వహించడం, తెలుగు పండుగలు సామూహికంగా చేసుకోవడం, మన సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నాలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాలలో తెలుగు పీఠాలు కూడా ప్రారంభించారు. గత సంవత్సరం జరిగిన అమెరికా ఎన్నికలలో బ్యాలెట్ కాగితంలో తెలుగులో సూచనలు ముద్రించడం తెలుగు వారందరూ గర్వించదగిన విషయం.

.

తెలుగు వారి సాహిత్య ప్రక్రియలలో ముఖ్యమైనదైన శతక సాహిత్యాన్ని మన పిల్లలకు పరిచయం చేయాలనే సంకల్పంతో “ శతక పద్య పఠన పోటీ ” లను ‘ శిరాకదంబం ’ నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించిన విధివిధానాలను, నిబంధనలను త్వరలో ప్రకటించడం జరుగుతుంది. పాఠకులు, శ్రేయోభిలాషులు, మిత్రులు సహకరించగలరని ఆశిస్తున్నాము.         

.

******************************************************************************************

.

 

 

 

కరోనా జాగ్రత్తలు పాటించండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.

ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి.

మనవి :శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు. 

కృతజ్ఞతలు

ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి. ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.


మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.

Please Subscribe & Support


మీ చందా Google Pay UPI id : sirarao@okaxis

( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

           

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )

or Click here –> paypal.me/sirarao

Please visit

సాహిత్య శారదీయం
– శిరాకదంబం పేజీ