అమెరికా లో 33 సంవత్సరాలుగా భారతీయ సంస్కృతి, సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తున్న శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( సప్నా ) ఆధ్వర్యంలో నవంబర్ 20వ తేదీన శ్రీ శిరిడి సాయి మందిరం లో జరిగిన ” అన్నంచార్య అభయ శ్రీనివాస గాన సుధ ” నుంచి దృశ్యకదంబం….
డిసెంబర్ 2వ తేదీ సాయింత్రం హైదరాబాద్, చిక్కడపల్లి త్యాగరాజ గానసభ కళా లలిత కళావేదిక లో మహిత సాహితీ సంస్థ, త్యాగరాజ గాన సభ సంయుక్తంగా‘ సప్తపర్ణి కథలు ’ పుస్తకావిష్కరణ జరిగింది. మహిత సంస్థ కార్యదర్శి, రచయిత్రి స్వాతి శ్రీపాద సభకు అధ్యక్షత వహించారు.అమెరికాకు చెందిన డా. శొంఠి శారదాపూర్ణ రచించిన ” సప్తపర్ణి కథలు ‘ పుస్తకాన్ని ప్రముఖ కవి, రచయిత విహారి ఆవిష్కరించారు. ఆ సభలో ఇంకా తమిరిశ జానకి, శిష్ట్లా మాధవి తదితరులు పాల్గొన్నారు.