11_007AV

.

ప్రస్తావన

.

 

“ జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |

తస్మాదపరిహార్యే உర్థేన త్వం శోచితుమర్హసి || ”   

“ పుట్టినవానికి మరణం తప్పదు; మరణించినవానికి పుట్టుక తప్పదు; తప్పించుకోవడానికి వీలులేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు. ” అంటాడు గీతాకారుడు.

ఈ సత్యం అందరికీ తెలిసినా, కావల్సిన వ్యక్తులను మరణం దూరం చేస్తే తట్టుకోవడం, తేరుకోవడం కష్టమే. తాత్కాలికంగా మనుష్యుల మధ్య ఉండే ఆత్మీయతానురాగాలు, సంబంధ బాంధవ్యాలు కొంతకాలం వరకు పల్చటి తెరలాగా అడ్డుపడతాయి.

 కొంతమంది తమ కోసమే పుడతారు, తమకోసమే జీవిస్తారు, చివరికి తమకోసమే మరణిస్తారు. కానీ కొందరు మాత్రం తమ చుట్టూ ఉన్నవారి శ్రేయస్సు కోసం, వారి సమస్యలను తీర్చడానికి, వారికి ఆనందం కలిగించడానికి జీవిస్తారు. అందుకోసం తమ జీవితాలను క్రొవ్వొత్తి లాగా కరిగించేసుకుంటారు.

ఈమధ్య కరోనా వలన అయితేనేమి, ఇతర కారణాల వలన అయితేనేమి ఎంతోమంది ఆత్మీయులను, ప్రముఖులను కోల్పోతున్నాము. ఇటీవల జరిగిన విషాదాల్లో మొదటిది ‘ శిరాకదంబం ’ పత్రిక సంపాదక వర్గ సభ్యుడు, హితైషి, స్నేహశీలి జి‌.బి.‌వి. శాస్త్రి హఠాన్మరణం. తరచుగా, ముఖ్యంగా క్రొత్త సంచిక విడుదల చేసిన వెంటనే ఆమూలాగ్రం చదివిన తర్వాత ఫోన్ చేసి ఆప్యాయంగా పలకరించి, ఆ సంచికలోని ప్రతి అంశాన్ని గురించి విశ్లేషించి, తగిన సూచనలను, సలహాలను ఇస్తూ, ప్రోత్సాహాన్నిస్తూ ముందుకు నడిపించిన మార్గదర్శి.

ఆయన స్నేహశీలత కు ఒక ఉదాహరణ. 1975-78 లో ఒకే తరగతిలో కలిసి చదువుకొన్న సహాధ్యాయులందరూ తమ తమ ఉద్యోగాల్లో, వృత్తుల్లో స్థిరపడి, తీరిక లేకుండా గడుపుతున్న తరుణంలో దాదాపు 35 సంవత్సరాల తర్వాత ఎంతో శ్రమించి సుమారు 90 మంది గురించి ఆరా తీసి వారి చిరునామాలు, వివరాలు అన్నీ సేకరించి… అందర్నీ తమ చదువుల తల్లి ఒడి అయిన ఊరిలో, అదే కళాశాలలో కలిపి ఒక ఉత్సవాన్ని నిర్వహించిన మంచి మిత్రుడు శాస్త్రి. ఆ స్నేహబృందానికి అప్పటి గురువుల సూచనల మేరకు ‘ అభిజ్ఞ ’ అనే పేరు పెట్టి 2013 నుంచి ఇప్పటివరకు నిరాఘాటంగా ఆ స్నేహలత వాడిపోకుండా కాపాడడమే కాక, ఈ బృందంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా ముందుండి మిత్రులందరినీ ఒక త్రాటి మీద నడిపించి మిత్ర బృందం తరఫున వారిని ఆదుకున్న ఉదాత్త హృదయుడు. ప్రస్తుతం ఆ స్నేహకదంబాన్ని కలిపి ఉంచిన దారం తెగిపోయింది. అంతటి స్నేహశీలి, సౌజన్యమూర్తి మరొకరు దొరుకుతారా ?

తెలుగు భాషకు క్రొంగొత్త నడకలు నేర్పిన సాహితీ మూర్తి ‘ సిరివెన్నెల ’ సీతారామశాస్త్రి. ఆయన కలం నుండి జారువాలిన ‘ గంగావతరణం ’ తో విశ్వనాథ్ గారి ఆశీస్సులతో ‘ జననీ జన్మభూమి ’ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు సీతారామ శాస్త్రి. అయితే అది సినిమా కోసం వ్రాసిన గీతం కాదు. ‘ సిరివెన్నెల ’ చిత్రంలో తొలిసారిగా సినిమా కోసం పాటలు వ్రాసారు. ఈ పాటలు తెలుగు చిత్రసీమలో అజరామరంగా నిలిచిన కొద్ది పాటలలో స్థానాన్ని పొందాయి. అందుకే ఆయన ఇంటిపేరు కూడా మారిపోయింది.

తెలుగు సినీ గీతాలను నిశితంగా పరిశీలిస్తే సాహిత్య విలువలు కలిగి ఉన్న పాటలు, మాధుర్యం కలిగిన పాటలు మాత్రమే చిరస్థాయిగా మిగిలి ఉన్నాయని చెప్పవచ్చు. అవి మృగ్యమైన పాటలు కొంతకాలం మాత్రమే వినిపించి కనుమరుగైపోతుంటాయి. ఎవరు అవునన్నా, కాదన్నా ప్రేక్షకులు మంచి సాహిత్యం, సంగీతంలో మాధుర్యం మాత్రమే కోరుకుంటారు. అందుకే అవి తర తరాలకు నిలిచి ఉంటాయి. అలాంటి సాహిత్యం అందించిన కవులు, రచయితలు క్రిందటి తరం వరకు చాలమందే ఉన్నారు. చిత్రసీమలో ఇప్పటివరకు ఒక కవి రాజ్యమేలుతూ ఉండగానే మరో కవి ప్రవేశించి మొదటి కవి స్థానాన్ని భర్తీ చేస్తూ వచ్చారు. కానీ ‘ సిరివెన్నెల ’ తర్వాత అంత పాండితీ ప్రకర్ష ప్రదర్శించగల కవి మరొకరున్నారా అంటే ప్రశ్నార్థకమే ! చూడాలి. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో !

ఇలా అనేక ప్రశ్నలను మిగిల్చి, వాళ్ళు వచ్చిన పని పూర్తయిందనుకొని హఠాత్తుగా వెళ్ళిపోయిన స్నేహపాత్రుడు మన శాస్త్రికి, సాహితీ మూర్తి సిరివెన్నెల కి ‘ శిరాకదంబం ’ నివాళులు అర్పిస్తోంది.     

.

******************************************************************************************

.

కరోనా జాగ్రత్తలు పాటించండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.

ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి.

మనవి :శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు. 

కృతజ్ఞతలు

ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి. ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.


మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.

Please Subscribe & Support


మీ చందా Google Pay UPI id : sirarao@okaxis

( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

           

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )

or Click here –> paypal.me/sirarao

Please visit

సాహిత్య శారదీయం
– శిరాకదంబం పేజీ