11_008 బాలభారతి – చింకి గొడుగు

 

 

నీలినీలపుఆకాశం

విప్పినగొడుగల్లే వుంది !

చుక్కలు నిండిన ఆకాశం

చిల్లులగొడు గై పోతుంది !

 

 

                      గొడుగులు కుట్టేసాయిబుగారికి

                        ముడుపు సరిగా ముట్టదొ యేమో !

                  ఉదయం అతికినటాకా లన్నీ

                    ఒక్క పూటకే విడిపోతున్నవి !

 

 

 

వర్షాకాలం సాయిబుగారికి

పని రద్దీగా ఉంటుంది !

టాకా లేయనిమింటిగొడుగులో

యేకధారగా ఒకటే వర్షం !

పగలూ రాత్రీ ఒకటే వర్షం !

 

 

                                                ఎండకు వానకు పనికిరాని దిది

                                                యెందుకు చిరుగులగొడుగు ?

                                                ఇంతపిసరు వర్షం వస్తేనే

                                                ఇవతల అవతల ఒకటే మడుగు !

 

 

పాతచింతకాయ్‌పచ్చడీ అయితే

పథ్యానికి పనికొస్తుంది !

తాతలనాటిదె అయినా చిరిగిన

పాతగొడుగు పనికొస్తుందా ? 

 

 

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾