11_008 ద్విభాషితాలు – ఎంతదూరం 11_008 December 15, 2021 వెలుగు చీకట్లు…ఒకదానివెంట ఒకటి తరుముతూ ఉంటాయి.బరువులు ఒక్కటొక్కటిగా పెరుగుతూ ఉంటాయి.వేల మైళ్ళ ప్రయాణం.మార్గాలన్నీ అంతుచిక్కనివే!ఎవరు ప్రయాణిస్తారు నీతో ?ఎదురయ్యే కొత్త సవాళ్లు మాత్రమే! ఏదో నక్షత్రం….సుదూర గగనం నుంచి..స్నేహహస్తం చాచి..నీకు దిక్సూచిగా ఉంటూనే ఉంటుంది.స్ఫూర్తివంతమైన సంగీతం..నీకు తోడుగా ఉంటూనే ఉంటుంది.నీకు తెలియవలసింది.. ఒక్కటే !నడవడం!ఆఖరి గమ్యం వరకూ!ఆఖరి స్వరం వరకూ! 👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾
Nice