11_008

.

ప్రస్తావన

.

ఆంధ్రులకు ఉద్యమ చరిత్ర చాలానే ఉందని చెప్పవచ్చు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న ఆంధ్రుల గురించి చరిత్ర చెబుతుంది. మారుమూలల పల్లెల నుంచి పెద్ద పట్టణాల వరకు పిల్లలు, యువకులు, వృద్ధులు అనే వయోబేధం లేకుండా పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా పాల్గొన్న చరిత్ర మనది. ఎందరో తమ ఆస్తులను, కుటుంబ జీవనాన్ని త్యాగం చేశారు. ఎన్నో కష్టాలకు ఓర్చి ఉద్యమానికి అంకితం అయిన వారెందరో. అలాగే సంవత్సరాల తరబడి సాగిన ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం లో కూడా అంతే దీక్షగా పాల్గొన్నారు. చివరికి పొట్టి శ్రీరాములు గారి బలిదానం కూడా ఆ ఉద్యమంలో ప్రధాన ఘట్టం. ఫలితంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సిద్ధించింది.

వీటి తర్వాత చెప్పుకోదగ్గ ఉద్యమం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు . ఆంధ్రప్రదేశ్ అంతా ఒక్కటై సాగిన ఈ ఉద్యమం మహోధృతంగా సాగింది. తమ హక్కును సాధించుకుంది. అయితే ప్రస్తుతం ఇది వేరే వాళ్ళ హక్కుభుక్తం కావడానికి సిద్ధం అవుతోంది. అప్పుడు విశాఖ ఉక్కు సాధన కోసం యావత్తు ఆంధ్ర జాతి ఒక్కటై నిలిచింది. ఇప్పుడు ఆ కర్మాగారంలో పనిచేసేవారు, భూమినిచ్చిన కొందరు మాత్రమే పోరాడుతున్నారు. కనీసం విశాఖ వాసులు కూడా ఇందులో భాగం కాకుండా నిర్లిప్తంగా ఉన్నారు.

తర్వాత దక్షిణాదిన హిందీ వ్యతిరేక ఉద్యమం వచ్చినా ఆంధ్ర ప్రాంతంలో అంతగా ప్రభావం చూపలేదు. బహుశా ఆంధ్రులకు హిందీ భాష పట్ల సానుకూల దృక్పథం ఉండడం కావచ్చు. కానీ తర్వాత వచ్చిన తెలంగాణ ప్రాంతంలో జై తెలంగాణ ’, అనంతరం ఆంధ్ర ప్రాంతంలో వచ్చిన జై ఆంధ్ర ఉద్యమాలు పెద్దయెత్తున సాగాయి. ఆంధ్ర ప్రాంతంలో ఆరునెలల పైనే సాగిన ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఉద్యోగులు, చివరికి పోలీసులు కూడా సహకరించారు. అప్పట్లో అందరి ఆకాంక్ష ఒకటే. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన. ఎంతో దీక్షతో, పట్టుదలతో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో సాగించిన రాజకీయానికి బలైపోయాయి. అయితే ఆ ఉద్యమాల తర్వాత రెండు ప్రాంతాల మధ్య సఖ్యత పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతం నుంచి హైదరాబాద్ కు వలసల జోరు పెరిగింది.

తర్వాత వచ్చిన తెలంగాణ ఉద్యమం కూడా అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేసి ఒకే మాట మీద నిలబెట్టి సాగించిన ఉద్యమం గానే చెప్పుకోవచ్చు.  అందుకే రాష్ట్ర సాధన సాధ్యమైంది.

ఆ సమయంలోనే ఆంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో ఒక ఉద్యమం నడిచినా అందులో ప్రజల భాగస్వామ్యం దాదాపుగా లేదని చెప్పవచ్చు.

అయితే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తుంటే ఇప్పటి తరం ఆంధ్రులలో అప్పటి పౌరుషం, ఆ పోరాట స్పూర్తి కొరవడ్డాయా అని అనిపించక మానదు. విశాఖ ఉక్కు ఉద్యమాన్ని నిబద్ధతతో నడిపించిన తెన్నేటి విశ్వనాధం వంటి నాయకులు, ప్రాణత్యాగానికైనా సిద్ధపడి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఇరవై రోజులకు పైగా చేసిన అమృతారావు వంటి నాయకులు, వారికి అండగా నిలిచిన యావత్తు ఆంధ్రజాతి ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కును సాధించి పెట్టారు. ఇప్పుడు అటువంటి ముందుండి నడిపించే చిత్తశుద్ధి గల నాయకులు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమేమో !


.

******************************************************************************************

.

 

కరోనా జాగ్రత్తలు పాటించండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.

ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి.

మనవి :శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు. 

కృతజ్ఞతలు

ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి. ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.


మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.

Please Subscribe & Support


మీ చందా Google Pay UPI id : sirarao@okaxis

( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

           

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )

or Click here –> paypal.me/sirarao

Please visit

సాహిత్య శారదీయం
– శిరాకదంబం పేజీ