11_009AV

.                                       ప్రస్తావన

క్రొత్త సంవత్సరం ఎప్పుడూ ఆశలు రేపుతూనే ఉంటుంది. గడిచిన సంవత్సరంలోని చెడు అనుభవాలను తలుచుకుని రాబోతున్న సంవత్సరమైనా మంచిగా గడవాలనేది ప్రధానమైన ఆశ. అది సహజం. ఆ ఆశే మనిషిలో నూతనోత్సాహం నింపుతుంది. ఆ ఉత్సాహం నుంచి సంబరాలు వస్తాయి. ఏ సాంప్రదాయంలో చేసినా క్రొత్త సంవత్సరారంభం పండుగే. అవునన్నా, కాదన్నా ఆంగ్లేయుల పాలన ద్వారా అనేక విదేశీ సంప్రదాయాలు మన జీవితంలో భాగమైపోయాయి. దైనందిన జీవితంలో అనేక ఆంగ్ల పదాలను మనం ఉపయోగిస్తూనే ఉంటాం. చదువు రాని పామరుడు కూడా ఇప్పుడు కొన్ని పేర్లు తెలుగులో చెబితే అర్థం కానంతగా, అవి తెలుగు పేర్లే అని నమ్మేటంతగా చొచ్చుకుపోయాయి. వేషభాషల్లో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు పాంట్, షర్ట్ సహజమై పోయింది. పంచెకట్టు అరుదైపోయింది. ప్రస్తుతం సంప్రదాయ వస్త్రధారణ ప్రదర్శనల లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంతకాలానికి పాత ఫోటోల లో మాత్రమే చూడవలసి వస్తుందేమో !

ఇది ఆంగ్లేయుల పరిపాలనా ప్రభావమా అని ఆలోచిస్తే కాదేమోననిపిస్తుంది. అర్థశతాబ్దం వెనక్కి వెడితే చాలా ఎక్కువ తెలుగు పదాలు సంభాషణల్లో దొర్లుతూ ఉండేవి. ఉదాహరణకి ఇప్పుడు విందు భోజనానికి వెళ్ళినపుడు అన్నం వడ్డించమని అడగాలంటే ‘ రైస్ ’ కావాలని అడుగుతున్నాం గానీ అప్పట్లో చక్కని తెలుగులో ‘ అన్నం ’ వడ్డించమని అడిగేవారు. ఇంకా అప్పటి ‘బండి’ ని ఇప్పుడు ‘ వెహికల్’ గా మార్చేసాం. ‘ వైద్యశాల ’ ‘ హాస్పిటల్ ’ గా మారిపోయింది. అయితే మన తెలుగు భాషలో ఉన్న సౌకర్యం ఏమిటంటే ఇతర భాషా పదాలను కలుపుకుని వాటిని తెలుగు పదాలే అనుకునేటట్లు మార్చేసుకోగలదు. ఉదాహరణకి ‘ ఆసుపత్రి ’, ‘ రోడ్డు ’.

భాష ఎలా అయితే సులువుగా ఇతర భాషల్ని తనలో కలిపేసుకుందో అంత సులువుగా సాంప్రదాయాలను కూడా కలిపేసుకుంది మన సమాజం. దానికి ప్రధాన కారణం సుదీర్ఘ కాలం ఆంగ్లేయుల పరిపాలనా ప్రభావం అయి ఉండవచ్చు. మన ప్రాంతం మీద ఎందుకు ఎక్కువగా ఉంది అని ఆలోచిస్తే సహజ వనరులు, విశాలమైన సముద్ర తీరం ఉండటం కారణంగా ఆంగ్లేయులు, ఇతర దేశాల వారు చాలా ఓడరేవులను అభివృద్ధి చేసి రాకపోకలు సాగించడం కారణం కావచ్చు. కానీ ప్రస్తుతం షష్టిపూర్తి చేసుకున్నవారు ఒకసారి గతంలోకి వెళ్ళి ఆలోచిస్తే తెలుస్తుంది. ఆంగ్లేయుల ప్రభావం ఎక్కువగా ఉన్న అప్పటి రోజుల్లో కంటే ఇప్పుడే ఆ భాష, సంస్కృతి పైన మోజు ఎక్కువగా కనిపిస్తోందని. అప్పటి విద్యార్థి ‘ అమ్మా ! నేను బడికి వెళ్లొస్తా ! ’ అని చెప్పేవాడు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు అలా చెబుతున్నారు. అప్పట్లో విద్య వ్యాపారం కాలేదు. అందుకని మన సంస్కృతిని ప్రతిబింబించేవి. అప్పటి తెలుగు మాస్టారు పంచె కట్టు, లాల్చీ, కండువాతో నుదుటన తిలకం దిద్దుకుని కనిపించేవారు. మరి ఇప్పటి తెలుగు మాస్టారు…. ? అప్పట్లో తెలుగు, సంస్కృతం లో పండితులైన వారందరికీ ఆ భాషలతో పాటు ఆంగ్లంలో కూడా ప్రావీణ్యం ఉండేది. కానీ ఆంగ్లేయులతో మాట్లాడేటప్పుడు, అవసరాన్ని బట్టి మాత్రమే దానిని ఉపయోగించేవారు.  ఆచార వ్యవహారాలలోను, సంప్రదాయాలలోను, ఇంటి దగ్గర, మన వాళ్ళ దగ్గర మాట్లాడేటపుడు తెలుగుదనమే కనిపించేది. 

ఇవన్నీ విశ్లేషిస్తే మన భాష, సంస్కృతిలో వస్తున్న ఈ మార్పు అప్పటి ఆంగ్లేయుల ప్రభావం కాదేమోననిపిస్తుంది. ఈ మధ్య కాలంలో పెరిగిన విదేశీ ఉద్యోగాల మోజు, దానికోసం జ్ఞానం కంటే ఫలితమే ముఖ్యం అను’కొంటు’న్న చదువులు, పెరిగిన పోటీ తత్వం….. వీటన్నిటి కారణంగా ప్రజల ఆలోచనా విధానం లో వచ్చిన మార్పు అని చెప్పవచ్చు. అదే జీవన విధానంలో కూడా ప్రభావం చూపుతోంది. అసలు మార్పు అనేది సహజమైన ప్రక్రియ. ఎవరు అవునన్నా, కాదన్నా అది ఆగదు.

ఈ మార్పు కి సూచనే ఆంగ్ల నూతన సంవత్సర సంబరాలు. అలాగే గతంలో కూడా సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగేవి. ఇప్పుడూ జరుగుతున్నాయి వేరే విధంగా. ఇప్పుడు చాలామందికి ‘ సంక్రాంతి ’ అనగానే కోడి పందేలు గుర్తుకు వస్తున్నాయి. అప్పట్లో అవి సంబరాల్లో భాగం. ఇప్పుడు అవే సంబరాలు. సరదాగా జరుపుకునే పండుగ కూడా జూదం రూపం దాల్చింది. ఇది ఏ సంస్కృతి నుంచి వచ్చింది అని ఆలోచిస్తే మన మస్తిష్కంలోంచి వచ్చినదే అని అర్థమవుతుంది. సమాజనికి కీడు చేసే ఈ జూద, వ్యసన  సంస్కృతి నుంచి బైట పడే ఉపాయం కూడా మన మస్తిష్కంలోనే ఉంటుంది.

 

******************************************************************************************

.

కరోనా జాగ్రత్తలు పాటించండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.

ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి.

మనవి :శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు. 

కృతజ్ఞతలు

ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి. ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.


మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.

Please Subscribe & Support


మీ చందా Google Pay UPI id : sirarao@okaxis

( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

           

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )

or Click here –> paypal.me/sirarao

Please visit

సాహిత్య శారదీయం
– శిరాకదంబం పేజీ