11_010

.

ప్రస్తావన

.

తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి వెనుక చాలామంది కృషి, పోరాటం ఉన్నాయి. తమిళంతో  బాటు తెలుగు కు కూడా ప్రాచీన హోదా దక్కడం ఇష్టం లేని తమిళులు అడ్డు పడటానికి ప్రయత్నిస్తే దానిని తిప్పి కొట్టి, ప్రాచీన హోదాకు తెలుగు కూడా అర్హమైనదే అని కోర్ట్ తీర్పుల ద్వారా నిరూపించిన వారు ఒకప్పటి ఉభయ రాష్ట్ర రాజధాని అయిన అప్పటి మదరాసు, ఇప్పటి చెన్నై నగరంలో నివశిస్తున్న తెలుగువారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు వల్ల సాధ్యం కాని పని చెన్నై తెలుగు వారు చేసి చూపించారు. చెన్నై హైకోర్ట్ లో కేసులు వేసి, వాదించి తెలుగుకు ప్రాచీన హోదా సాధించడానికి మార్గం సుగమం చేశారు.

దీనికి తోడు మన రాష్ట్రంలోని కొందరు ప్రముఖులు, సంస్థలతో బాటు ప్రభుత్వం కూడా కృషి చేయడంతో 2008 అక్టోబర్ 31న కేంద్ర ప్రభుత్వం కన్నడంతోపాటూ తెలుగుకి కూడా ప్రాచీన హోదా ప్రకటించింది. అయినా దశాబ్దం పాటు ఏ కదలిక లేదు. చివరికి 2018 లో మైసూర్ లో ఉన్న భారతీయ భాషా సంస్థ లో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఏర్పాటయింది. మన ఉపరాష్ట్రపతి గౌ. వెంకయ్యనాయుడు గారి చొరవ, కృషి వలన 2019 వ సంవత్సరంలో తెలుగు ప్రాంతానికి సుదూరంలో ఉన్న ఆ కేంద్రం నెల్లూరు కి తరలి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా వెంకయ్యనాయుడు గారికి చెందిన స్వర్ణభారతి ట్రస్ట్ భవనంలో ఏర్పాటు చేశారు. శాశ్వత భవన నిర్మాణం కోసం వెంకటాచలం ప్రాంతంలో స్థలాన్ని గుర్తించినా ఇంకా లాంఛనాలు పూర్తి కాకపోవడంతో నిర్మాణంలో జాప్యం జరుగుతోంది.

ఇటీవలే మన ప్రధానమంత్రి గౌ. నరేంద్రమోడీ గారు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం జరుపుకున్న ప్రాచీన తమిళ విశిష్ట అధ్యయన కేంద్ర భవనానికి ప్రారంభోత్సవం చేశారు. మన తెలుగు కేంద్రానికి కూడా భూమికి సంబంధించిన లాంఛనాలు  పూర్తి చేసి అప్పగిస్తే కేంద్రం త్వరగా నిధులు సమకూర్చే అవకాశం ఉంది. భవనం సిద్ధం అయితే ఈ కేంద్రాన్ని విస్తరించే అవకాశం ఉంది. ఎన్నో కొత్త పథకాలు, పరిశోధనలు చేపట్టవచ్చు. భవిష్యత్తులో ఎందరికో భాషాధ్యయన వేత్తలకు, భాషాభిమానులకు మార్గదర్శిగా నిలపవచ్చు. ప్రభుత్వం, అధికారులు ఆ దిశగా కృషి చేసి అడ్డంకులు తొలగించి కేంద్ర నిధుల కోసం కృషి చెయ్యాలి. భాషా ప్రేమికులందరూ అందుకు అవసరమైన ఒత్తిడి తీసుకురావాలి. ఇది ప్రవాసాంధ్రులకో, ఏదో కొద్దిమందికో సంబంధించిన విషయం మాత్రమే కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారందరి బాధ్యత. నిర్లిప్తత పనికిరాదు. భాషపై అలసత్వం వహిస్తే తెలుగు వారి అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడుతుంది. భాషకు కులం, మతం, ప్రాంతం, బీద, ధనిక అనే తేడాలు లేవు. అందరిదీ తెలుగు భాష. అందుకే తెలుగు వారందరూ ఒక త్రాటి పైకి వచ్చి తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చెయ్యాలి.       

మహమ్మారి రూపం మార్చుకుని ‘ ఒమిక్రాన్ ’ ఇప్పుడు మన ముందుకు వచ్చింది. గతంలో వచ్చిన వైరస్ కంటే ప్రమాదకారిగా కనబడకపోయినా వేగంగా వ్యాపించడం కొంత ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్తులో ఈ ‘ ఒమిక్రాన్ ’ వల్ల ఏవైనా ఇబ్బందులు ఉంటాయా అన్నది అధ్యయనాలలో తేలవలసి వుంది. ఏమైనా కొంతకాలం పాటు అశ్రద్ధను, అజాగ్రత్తను వీడి అప్రమత్తంగా ఉండటం మనకి, సమాజానికి మంచిది.  

.

******************************************************************************************

.

 

కరోనా జాగ్రత్తలు పాటించండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.

ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి.

మనవి :శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు. 

కృతజ్ఞతలు

ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి. ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.


మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.

Please Subscribe & Support


మీ చందా Google Pay UPI id : sirarao@okaxis

( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

           

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )

or Click here –> paypal.me/sirarao

Please visit

సాహిత్య శారదీయం
– శిరాకదంబం పేజీ