పండితులకి పరిమితులు కాకుండా పామరజన హృదయానందకరకమైనటువంటి సారస్వతాన్ని ఆయన పాటలుగా అందించాడు. అయితే హృద్యంగా దేశి కవితని, దేశ సంగీతాన్ని, దేశి నృత్యాన్ని ఏకం చేసి పాటలుగా, సంకీర్తనలుగా అందించాదాయన. ఇందులో అన్నమాచార్యునిది మధురభక్తి. ప్రతి జీవాత్మ కూడా స్త్రీ లేదా ఆమె రాధ, ఆమె గోపిక, ఆమే నాయిక అని దీని సారం. ఈ స్త్రీలందరూ అనగా జీవాత్మలన్నీ పరమాత్మను చేరడానికి ఒక యోగ మార్గం అవలంబిస్తారని, జీవులందరికీ అంటే స్త్రీమూర్తులందరికీ పరమ పురుషుడు ఒకడే ఏకైక నాయకుడు అయిన భగవానుడే భర్త అని మధుర పద్ధతి యొక్క తాత్పర్యము. అంటే మధురభక్తి సిద్ధాంతం అది.
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾