11_011AV భావయామి గోపాలబాలం….

శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీరామ్ శొంఠి, డా. శారదపూర్ణ శొంఠి గారల స్వగృహం నందలి ‘ సునాదసుధ ’ ఆర్ట్ గాలరీ లో 2021 నవంబర్ 14వ తేదీన నిర్వహించిన “ అన్నమాచార్య సంకీర్తనా పుష్పార్చన ” నుండి….. 

భావయామి గోపాలబాలం మన

సేవితం తత్పదం చింతయేయం సదా

కటి ఘటిత మేఖలా ఖచిత మణిఘంటికా

పటల నినదేన విభ్రాజమానం

కుటిల పద ఘటిత సంకుల శింజీతేన తం

చటుల నటనా సముజ్జ్వల విలాసం … భావయామి

నిరత కర కలిత నవనీతం బ్రహ్మాది

సుర నికర భావనా శోభిత పదం

తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం

పరమపురుషం గోపాలబాలం … భావయామి

 

                                   రాగం: యమునా కళ్యాణి        తాళం: ఆది

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾