11_011AV ఏ తీరుగ నను దయ చూచెదవో

ఏతీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా
నాతరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామా || ఏతీరుగ ||

శ్రీ రఘునందన సీతారమణా శ్రితజనపోషక రామా
కారుణ్యాలయ భక్తవరద నిను – కన్నది కానుపు రామా || ఏతీరుగ ||


నాదనామక్రియ రాగం, ఆది తాళం లో కూర్చిన భద్రాచల రామదాసు కీర్తన

ద్విభాష్యం నగేష్ బాబు గారు నిర్వహించిన వాద్య గోష్టి…..


వచన రచన :మధునాపంతుల సత్యనారాయణ మూర్తి

వచన గళం : పెండ్యాల సుబ్బారావు

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾