11_012

.

ప్రస్తావన

.

“ ప్రత్యక్షంగా కనిపించేదే కాకుండా కనిపించని మన వారసత్వాన్ని అభివృద్ధి చెయ్యడానికి, పరిరక్షించడానికి ‘ భాష ’ అనేది చాలా శక్తివంతమైన సాధనం. మాతృభాషల వ్యాప్తి కోసం చేసే ప్రయత్నాలన్నీ భాషా వైవిధ్యాన్ని, బహుభాషలలో విద్యలను ప్రోత్సహించడమే కాదు… భాషా పరమైన, సాంస్కృతిక పరమైన సాంప్రదాయాలను ప్రపంచమంతా అభివృద్ధి చెయ్యడం పట్ల పూర్తి అవగాహన ఏర్పడేటట్లు చేస్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఓర్పు వహించడం, ఒకరితో ఒకరు సంభాషించుకోవడం వంటి వాటి ద్వారా ప్రజల మధ్య సంఘీభావం ఏర్పడడానికి స్పూర్తినిస్తుంది  ” ఐక్యరాజ్యసమితి వారి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం మైక్రోసైట్ నుంచి…..

దేశ విభజన సమయంలో భారత దేశానికి పశ్చిమంగా ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతం పశ్చిమ పాకిస్తాన్ గాను, తూర్పున ఉన్న బెంగాల్ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతం తూర్పు పాకిస్తాన్ గాను ఏర్పడ్డాయి. కావడానికి ఒకే దేశం అయినా భిన్న ధృవాలుగా ఈ రెండు ప్రాంతాలు ఉండేవి. 1948 లో పాకిస్తాన్ అధికార భాషగా ఉర్దూ ని ప్రకటించింది. ఈ విషయంలో పశ్చిమ పాకిస్తాన్ కి ఏ సమస్య లేకపోయినా తూర్పు పాకిస్తాన్ లో చాలా సమస్యలను సృష్టించింది. ఈ రెండు ప్రాంతాల సంస్కృతులు వేరు, భాషలు వేరు. తూర్పు పాకిస్తాన్ లో ప్రధానంగా బెంగాల్ సంస్కృతి, వంగ భాష ఉండేవి. ఈ ప్రాంతానికి అధికార భాషగా వంగ భాష నే ఉంచాలనే విజ్ఞప్తులు వచ్చాయి. కనీసం ఉర్దూ తో బాటు బంగ్లా ను కూడా మరో అధికార భాషగా ఉంచాలనే ప్రతిపాదనలు కూడా చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం దిగిరాలేదు. దానితో మాతృభాష కోసం ఉద్యమం మొదలయింది. అది తారస్థాయికి చేరింది. ఢాకా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఈ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. పాకిస్తాన్ ప్రభుత్వం బహిరంగ సభలు, ప్రదర్శనలు నిషేధించింది. 1952 వ సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీ న ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాన్ని అణిచివెయ్యడానికి పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో అయిదుగురు చనిపోగా వందలమంది గాయపడ్డారు.

ఆ మరణహోమానికి గుర్తుగా అమరవీరుల జ్ఞాపకార్థం ‘ షహీద్ మినార్ ’ పేరుతో ఒక స్థూపాన్ని నిర్మించి ప్రతి సంవత్సరం మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు బంగ్లాదేశీయులు. 1998 లో కెనడా లో నివసించే బెంగాలీలు మాతృబాషల పరిరక్షణ కోసం ఢాకా లో జరిగిన మాతృబాషా ఉద్యమంలో జరిగిన మరణహోమానికి గుర్తుగా ఆరోజుని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించాలని కోరుతూ అప్పటి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ కి లేఖ వ్రాసారు. తర్వాత బంగ్లాదేశ్ ప్రధాని  షేక్ హసీనా నాయకత్వంలో పార్లమెంట్ లో తీర్మానం ఆమోదించి యునెస్కో కి పంపడం జరిగింది. లాంఛనాలన్నీ పూర్తి చేసుకుని 1999 వ సంవత్సరం నవంబర్ 17వ తేదీన ఐక్యరాజ్యసమితి నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవాలనే ప్రకటన వెలువడింది.

మాతృభాష పరిరక్షణకోసం సలిపిన ఆ మహోద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయింది. మన దేశంలో పరాయి పాలకుల వలన మన మాతృభాషలకు కొంతవరకు ముప్పు ఏర్పడింది. ముఖ్యంగా బ్రిటిష్ పాలనలో ఈ పరాయిభాషా దాడి ఎక్కువగా జరిగింది. కానీ మన భాషల పైన, సంస్కృతి పైన మక్కువ పెంచుకుని మన భాషల అభివృద్ధికి దోహదపడిన విదేశీయులు కూడా కొంతమంది ఉన్నారు. వారిలో తెలుగు భాషకు సంబంధించినంతవరకు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ముఖ్యులు. శిధిలావస్థలో ఉన్న ఎన్నో తాళపత్ర గ్రంధాలను ఆయన పరిష్కరించే ప్రయత్నం చేశారు. అమూల్యమైన మన సారస్వత సంపదను కాపాడి మనకందించారు. అలాగే తర్వాత కాలంలో మన భాషా సంపదను ఎందరో పండితులు, పరిశోధకులు వెలికి తీసి మనకి అందిస్తూనే ఉన్నారు. మాతృభాషా పరిరక్షణకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నో సంస్థలు వెలిశాయి. అయితే ఇవి సరిపోతుందా అంటే ఖచ్చితంగా ఇది ఎవరో కొందరు మాత్రమే చేయవలసిన పని కాదు.

భాషా పరిరక్షణ అనేది ప్రభుత్వాల బాధ్యత, ఆయా సంస్థల బాధ్యత, విశ్వవిద్యాలయాల బాధ్యత…. మనకెందుకు అని అనుకోకుండా తెలుగు మాతృభాషగా కలిగిన ప్రతి ఒక్కరూ ఇది మన అందరి బాధ్యత అనుకోవాలి. మాతృభాషాభివృద్ధి ముందుగా మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి. మన పిల్లలకు తప్పనిసరిగా తెలుగు భాష చదవడం, వ్రాయడం, ముఖ్యంగా సరిగా మాట్లాడటం నేర్పించాలి. మన సాహిత్యాన్ని పరిచయం చెయ్యాలి. ముఖ్యంగా శతక సాహిత్యం వంటి వాటిని వారికి పరిచయం చేస్తే పెద్దయ్యాక వారికి వ్యక్తిత్వ వికాస తరగతుల అవసరం ఉండదు. చిన్నప్పటినుంచే మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుంది.

మాతృభాషను పిల్లలకి దూరం చేస్తే తల్లిని దూరం చేసినట్లే. పసిపిల్లల భాష తల్లికి మాత్రమే అర్థమవుతుంది. తల్లి చెప్పేది ఆ పిల్లలకే అర్థమవుతుంది. అందుకే పుట్టుకతో వచ్చే భాష మాతృభాష అయింది. ఈ ప్రాముఖ్యాన్ని గుర్తు చెయ్యడానికే ‘ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ’ జరుపుకోవడం. మాతృభాషకోసం పోరాటం చేసిన ఢాకా అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలి.

“ బహుభాషాధ్యయనానికి సాంకేతికత ఉపయోగించడంలో ఉన్న అవకాశాలు, సవాళ్ళు ”

– ఇదీ ఈ సంవత్సరం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ ఇతివృత్తం.

ఈ సందర్భంగా ఫిబ్రవరి 21 వ తేదీన భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 3.30 ని. లకు యునెస్కో ఒక వెబ్‌నైర్ నిర్వహిస్తోంది. ఆ లింక్….

UNESCO webnair on 21 February 2022 at 3.30 pm IST. Link is –

https://youtu.be/1mERil9mH_I

 .

****************************************************************************************

కరోనా జాగ్రత్తలు పాటించండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.

ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి.

మనవి :శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు. 

కృతజ్ఞతలు

ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి. ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.


మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.

Please Subscribe & Support


మీ చందా Google Pay UPI id : sirarao@okaxis

( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

           

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )

or Click here –> paypal.me/sirarao

Please visit

సాహిత్య శారదీయం
– శిరాకదంబం పేజీ