హరినామమే కడు ఆనందకరము
మరుగవో మరుగవో మరుగవో మనసా
నళినాక్షుని శ్రీ నామము
కలిదోషహరము కైవల్యము
ఫలసారము బహుబంధ మోచనము
తలచవో తలచవో తలచవో మనసా
నగధరు నామము నరకహరణము
జగదేకహితము సమ్మతము
సగుణ నిర్గుణము సాక్షాత్కారము
పొగడవో పొగడవో పొగడవో మనసా
కడగి శ్రీవేంకటపతి నామము
బడి బడినే సంపత్కరము
అడియాలంబిడ అతి సుఖమూలము
తడవవో తడవవో తడవవో మనసా
శ్రీమతి సి. ఇందిరామణి గారి సంగీత సారధ్యంలో పద్మజ శొంఠి ఆలపించిన
చంద్ర కౌన్స్ రాగం, అది తాళంలోని అన్నమాచార్య కీర్తన……
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
Very well composed by Indiramani garu and sung by padmaja sonti garu