11_015AV ఓయమ్మా !

శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా నిర్వహించిన సంగీత వాద్య నాట్య రవళి 2015 లో రామేతి బృందం అన్నమాచార్య కృతి ‘ ఓయమ్మా ! ‘

వైయోలిన్ : సంజయ్ సురేష్, వీణ :సాయిప్రసన్న, కీబోర్డ్ : శ్రీకర్ రాపాక, మృదంగం : అఖిల్ అవసరాల

ఓయమ్మా ఇంతయేల వొద్దనరే
నాయముగాదిందరిలో నగుబాటు తనకును

  1. చెక్కునొక్కితిని సెలవి నవ్వితిని
    మక్కువతో నెంతైనా మాటాడడు
    మొక్కూ మొక్కితిని మోనాన నుండితిని
    యెక్కుడు దిట్టితినంటా నెగ్గువట్టీ నితడు

2.ఇచ్చకము జేసితి ఇచ్చితి విడెమును
కచ్చుపెట్టి యెంతైనా కరగడు
ముచ్చటలాడితిని మోవిజూచితి తన్ను
బచ్చిగా జేసితినంటా పగచాటీ నితడు

 

3.కన్నులా జొక్కితిని కాగిటా నించితిని
మన్నించె రతినెంతైనా మానడు
సన్నల మెచ్చితిని చాయల హెచ్చితిని
ఇన్నిటా శ్రీవేంకటేశు డెంతజాణే ఇతడు

👉🏾 ఈ సంచిక చదివి మీ అభిప్రాయాలను ఆయా అంశాల క్రింద ఉన్న

‘ Leave a reply ‘ box లో తెలియజేయండి. 👇🏾